Naga Panchami November 10th: నన్ను చంపేంత పగ ఎందుకు? పంచమిని నిలదీసిన మోక్ష
Naga Panchami Serial Latest Episode: ఆ పాముకి నామీద అంత పగ, ప్రతీకారం ఎందుకు అని మోక్ష పంచమిని నిలదీయడంతో ఇవాళ్టి ఏపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Serial Today Episode: జ్వాలా, చైత్ర ఇద్దరూ కుర్చీలకు అతుక్కొంటారు. ఎంత ట్రై చేసినా లేవలేకపోతారు. ఇంతలో శిశిర పాప అక్కడికి వచ్చి మమ్మీ చాకొలెట్ ఇస్తా అన్నావ్ రా అమ్మ అని చైత్ర చేయి లాగుతుంది. ఏంటి మమ్మీ రావడం లేదు అని అడుగుతుంది. ఇక సుబ్బు అక్కడికి వచ్చి మనం లాగితే రారు శిశిర వాళ్లు బలంగా అతుక్కున్నారు అని అంటాడు. ఎవరికైనా కీడు చేయాలని ఆలోచిస్తే ఇలానే జరగుతుందని, తప్పు చేశాం అని దేవుడిని కోరుకోవాలని సుబ్బు చెప్తాడు. దీంతో క్షమాపణ చెప్పగా ఇద్దరూ బయటకు వస్తారు. ఇంతలో పంచమి ఆమె వెనకాలే సుబ్బు బయట నుంచి రావడం చూసి చైత్ర, జ్వాలా ఇద్దరూ షాక్ అవుతారు. సుబ్బు మామూలోడు కాడు మహా మంత్రికుడిలా ఉన్నారని ఇద్దరూ మాట్లాడుకుంటారు.
మోక్ష అన్న మాటలను తలచుకుంటూ శబరి బాధ పడుతుంటుంది. ఇంతలో పంచమి లోపలికి రావడం చూసి పంచమితో మాట్లాడుతుంది.
శబరి: నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను పంచమి. నేను నిన్ను చూడక ముందే.. ఈ ఇంటికి నువ్వు రాక ముందే నా మనవడికి పాము కాటు నుంచి ఓ అమ్మాయి కాపాడినట్టు కల వచ్చింది పంచమి. నిన్ను చూసిన తర్వాత నాకు కలలో కనిపించిన అమ్మాయి నువ్వే అని మురిసిపోయాను. సాక్షాత్తు ఆ భగవంతుడే నిన్ను పంపించాడని నేను ప్రగాఢంగా నమ్మాను పంచమి. కానీ ఇప్పుడు నా నమ్మకం కలలాగే కరిగిపోతుంది. చెప్పు పంచమి నీకు, మోక్షకు మధ్య ఏం జరుగుతుంది. మీ ఇద్దరినీ సీతారాముల్లా ఊహించుకున్న నేను ఇప్పుడిలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. మీ ఇద్దరూ ఎవరికీ వారే అన్నట్టు ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు.
పంచమి: అలాంటిది ఏమీ లేదు బామ్మగారు. మోక్ష బాబు అంటే నాకు ప్రాణం. నేను అంటే మోక్ష బాబుకి చాలా ఇష్టం
శబరి: మీరు అంత అన్నోన్యంగా ఉంటే ఎందుకు నా మనవడు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు. అంతా అనుభవించేసిన వాడిలా నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో అంటూ ఎందుకు మాట్లాడుతాడు.
మోక్ష అలా మారడానికి కారణం ఏంటి.. అసలు ఎందుకు భయపడుతున్నాడని పంచమి చిన్న అత్త, బామ్మ అడుగుతారు నిజం చెప్పమని పంచమికి ప్రదేయపడతారు.
పంచమి: (మనసులో.. నేను భయపడినట్టే జరుగుతోంది. నిజం తెలిస్తే ఈ ఇంట్లో నన్ను ఒక్క క్షణం కూడా ఉండనివ్వరు. అప్పుడు మోక్ష బాబుని కాపాడే టైం దాటిపోతుంది.)
శబరి: వాళ్ల తాతగారు కూడా నాగ గండంతోనే చనిపోయారు. అయినా ఎప్పుడూ మోక్ష నమ్మలేదు. కానీ మొన్న పాము తనను కాటేయడానికి వచ్చినప్పుడు నుంచి బలంగా నమ్ముతున్నాడు. బాగా భయపడుతున్నాడు. అదే మాకందరికీ భయంగా ఉంది. నువ్వు మా మోక్షను కాపాడగలవా లేదా పంచమి.
దీంతో పంచమి నేను ఆ కాటేసే పాముని అని మనసులో అనుకొని బాధ పడుతుంది. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మోక్ష బాబుని కాపాడుకుంటానని చెప్పి పంచమి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
కుటుంబ సభ్యులందర్ని తన మాటలతో కష్టపెట్టానని తన గదిలో కూర్చొని బాధ పడతాడు మోక్ష.
మోక్ష: అసలు నేను ఎందుకు చావాలి పంచమి. అంత ఘోర మైన తప్పు నేనేం చేశాను. చెప్పు పంచమి నిన్నే అడిగేది. నాకు మరణ శిక్ష పడేంత తప్పు చేశానా. నన్ను చంపడానికి ఆ పాము చాలా ప్రయత్నాలు చేసింది. నా మీద ఆ పాముకి అంత పగ ఎందుకు చెప్పు పంచమి.
పంచమి: (మనసులో.. ఆ పాము నేనే అన్న విషయం మోక్ష బాబుకి తెలిసిపోయింది. ఈ విషయం నాతో చెప్పలేక దాచుకోలేక నలిగిపోతున్నారు.)
మోక్ష: నాకు తెలిసి నేను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు పంచమి. అలాంటిది సడెన్‌గా నువ్వు చనిపోవాలి అని అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. నేనంటే మావాళ్లకు ప్రాణం. నేను చనిపోతే మా అమ్మ, శబరి అందరూ ఏమైపోతారోనని భయంగా ఉంది. నేను బతికుండే అవకాశమే లేదా పంచమి కచ్చితంగా చనిపోవాల్సిందేనా.. ఏం చేస్తే నేను బతుకుతాను చెప్పు పంచమి. ఆ పాము నన్ను ఎందుకు చంపాలి అనుకుంటుందో చెప్పు పంచమి.
పంచమి: విధి రాత మోక్షబాబు. అంతా ఆ పాము ఖర్మ. చంపడం చావడం ఆ పాము చేతిలో లేదు. నిజంగా ఆ అవకాశం ఆ పాము చేతిలో ఉంటే మీలాంటి మంచి వారిని చంపాలని ఏ నాగు అనుకోదు. ఒకసారి మీరే చెప్పారు బాబు చిన్నప్పుడు ఓ పామును మీరు కర్రతో కొట్టి చంపేశారు అని ఆపాము పెట్టిన శాపమే మీకీ శిక్ష.
మోక్ష: ఎప్పుడో చిన్నప్పుడు చేసిన తప్పుకి ఇంత శిక్షా
పంచమి: మీ ఆవేదన నాకు అర్ధం అవుతుంది. కానీ ఆ జాతి నాగుల పగ, ప్రతీకారం అంత కఠినంగా ఉంటాయి. జాలి,దయ క్షమించడం అనేవి ఏమీ వాటికి తెలీదు.
మోక్ష: అంటే నేను చనిపోవాలా పంచమి.. నువ్వు కూడా నన్ను కాపాడలేవా.. నేను ఎలాగూ చనిపోతానని తెలిసినప్పుడు నువ్వింకా నన్ను కనిపెట్టుకొని ఉండడం అర్ధమే లేదు
పంచమి: నేను మీ భార్యను.. మిమల్ని కాపాడుకోవడం నా ధర్మం. ఆ పాముకి పగ ఎంత ముఖ్యమో మీ భార్యగా మిమల్ని కాపాడుకోవడం అంతే ముఖ్యం. నేను మిమల్ని వదిలి వెళ్లడం అంటే అది ప్రాణం లేని పంచమిగానే జరుగుతుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా మిమల్ని వదిలి వెళ్లను అని చెప్పి పంచమి వెళ్లిపోతుంది.
మరోవైపు కరాళి క్షుద్రపూజలు జరుపుతుంటుంది. అప్పుడే మహాంకాళి ఆమెకు ప్రసన్నం అవుతుంది. తనకు వరం కోరుకోమంటుంది. దీంతో కావాల్సి చేయిజార్చుకున్న శక్తులు తిరిగిపొందలేవని మహాంకాళి తేల్చిచెప్పేస్తుంది. ఇప్పటికే మీ అన్న కోసం నీ శక్తులు కోల్పోయావు. మిగిలిన శక్తులనైనా కాపాడుకో అని మహాంకాళి సూచిస్తుంది.
కరాళి: నాకు నా అన్న ముఖ్యం, ఆ నాగమణి ముఖ్యం అందుకు ఏమైనా చేస్తా.. ఎంతకు అయినా తెగిస్తా.
మహాంకాళి: ఒక దుష్టుడికి సాయం చేయాలని చూస్తే ఎలాంటి దుస్థితి పడుతుందో నువ్వే ఉదాహరణ కరాళి.. నువ్వు ఇప్పుడు ప్రాధాయపడేది కూడా మళ్లీ ఆ శక్తులను దుర్వినియోగ పరచడానికే
కరాళి: నీ భక్తురాలి కోరిక తీర్చడం నీ విధి మహాంకాళి. నేను పొందిన వరాలను ఎందుకు ఉపయోగించుకోవడం అనేది మా ఇష్టం
మహాంకాళి: మేము ప్రసాదించిన శక్తులు లోక కల్యాణానికి ఉపయోగపడాలి. స్వార్ధానికి ఉపయోగించకూడదు. ఇకపై నానుంచి నువ్వు ఎలాంటి వరాలు పొందలేవు కరాళి. నంబూద్రీని బతికించాలన్న ఆశ మానుకో. నాగమణిని సంపాదించాలన్న కోరిక పక్కన పెట్టు. అని మహాంకాళి హెచ్చరించడంతో నేటి ఏపిసోడ్ పూర్తవుతుంది.