అన్వేషించండి

Krishna Mukunda Murari August 29th: మురారి గదిలో తమ ప్రేమ గుర్తులను అతికించిన ముకుంద.. కొడుకుని చూసి కంగారుపడ్డ భవాని?

మురారి, కృష్ణల గదిలో ముకుంద తమ ప్రేమ గుర్తులను అతికించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Krishna Mukunda Murari August 29th: కృష్ణ తన అత్తయ్యతో.. ఏసీపీ సర్ తన ప్రేమ విషయం నాతో డైరెక్ట్ చెప్పొచ్చు కదా అనడంతో.. వెంటనే తను విషయం అదే అయినప్పుడు ఎవరితో చెబితే ఏంటి అని.. ఇంటికి వెళ్ళాక చెప్తాడేమో అని అంటుంది. పద అని తన అత్తయ్య బాగా హడావుడి చేయడంతో..  మళ్లీ కృష్ణ.. ఏసీపీ సార్ తన ప్రేమ విషయం తనకి ఎందుకు చెప్పలేదు అంటూ అనుమానం పడటంతో మీరు మీరు ఇంటికెళ్లాక తేల్చుకోండి అని అంటుంది తన అత్తయ్య. దాంతో కృష్ణ తన మనసులో అయితే నేరుగా ఏసీపీ సార్ నే అడగాలి అని అనుకొని ఇక సంతోషంగా కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు.

మరోవైపు ముకుంద మురారి గదిని శుభ్రం గా చేస్తుంది. తన ప్రేమతో మురారి మనసులో కృష్ణ ప్రేమ ను తొలగించేస్తాను అని కలలు కంటూ ఉంటుంది. మురారి ప్రేమ తనకు మాత్రమే సొంతం అని కృష్ణ ప్రొడక్ట్స్ అన్ని పడేసి.. మురారి మీద నీడ కూడా పడనివ్వకుండా నువ్వు చేస్తాను అని అనుకుంటుంది. ఇక గతంలో తమ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను చూసుకుంటూ నువ్వు మన ప్రేమ విషయం అత్తయ్యకి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు.. కాబట్టి నేనే చెప్పి స్వయంగా అత్తయ్య చేతుల మీదుగానే పెళ్లి జరిపేటట్టు చేస్తాను అని అనుకుంటుంది.

మరోవైపు మురారి అమ్మ కృష్ణ తో ఏం మాట్లాడుతుంది కృష్ణ తనతో రావడానికి ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణ లగేజ్ తీసుకొని తన అత్తయ్యతో అక్కడికి రావడంతో మురారి సంతోషపడతాడు. ఇక కృష్ణ మురారి వైపు చూస్తూ ఏసీపీ సార్ నన్ను ప్రేమిస్తూ నాతో చెప్పరా.. అత్తయ్య చెప్పింది నిజమో అబద్దమో తెలియదు కానీ.. నాకు మాత్రం మీరు నన్ను ప్రేమగా ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంది అని సంతోషపడుతుంది.

ఇప్పుడు మీకు తగ్గిపోయిందా అనటంతో మురారి పర్వాలేదు అని అంటాడు. మీరు ఇంత త్వరగా కోలుకోవటం నాకు నిజంగానే సంతోషంగా ఉంది అంటూ.. కంగ్రాట్యులేషన్స్ చెబుతుంది. దాంతో మురారి థాంక్యూ చెప్పటంతో.. పరాయి వాళ్లకు చెబుతున్నట్టు థాంక్స్ చెబుతున్నారు ఏంటి ఈయన అంటూ మనసులో అనుకుంటుంది. నన్ను నిజంగానే లవ్ చేస్తున్నారా అత్తయ్య అబద్ధం చెబుతుందా అని అనుమానం పడుతుంది.

ఆ తర్వాత వాళ్లు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక ఇంట్లో ఉన్న భవాని దేవుడ ఎదుట నిలబడి తమ కుటుంబంలో ఎటువంటి కలతలు రావద్దని అందరూ సంతోషంగా ఉండాలి అని.. తన కొడుకు ఆదర్శ తిరిగి రావాలి అని కోరుకుంటుంది. ఇక మురారి వాళ్లు కార్లో ఇంటికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో కృష్ణ తన అత్తయ్యతో తను క్యాంపుకు వచ్చే ముందు అందరికీ గిఫ్ట్ లు ఇచ్చాను అందరికీ నచ్చాయా అనడంతో అందరికీ నచ్చాయి అని అంటుంది తను.

పాపం ముకుంద మాత్రకు నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చకపోవచ్చు అని అనటంతో తన అత్తయ్య ఆశ్చర్య పోతుంది. ఏం గిఫ్ట్ ఇచ్చావు అని అడగటంతో.. మీకు తెలుసో లేదో అత్తయ్య.. జస్ట్ మనసులో పెట్టుకోండి అని అనటంతో ఏంటి అది అని అడుగుతుంది తన అత్తయ్య. ముకుంద ఎవరినో ప్రేమించింది అని చెప్పటంతో తన అత్తయ్య షాక్ అవుతుంది. మురారి కూడా కాస్త సైలెంట్ గానే ఉంటాడు.

అదంతా ఆదర్శ్ తో పెళ్లికి ముందు అని.. కానీ ఇదంతా ఇప్పుడు మర్చిపోలేక పోతుంది అని అంటుంది. దాంతో తన అత్తయ్య నీకు ముకుందా ఏమైనా చెప్పిందా అని కంగారుగా అడుగుతుంది.. అవును అని అప్పుడు ఏసీపీ సార్ కూడా పక్కనే ఉన్నాడు అని అంటుంది. ఆవిడ మాత్రం బాగా కంగారు పడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇక మురారి అవును. కానీ.. ఇప్పుడు అవన్నీ ఎందుకు కృష్ణ అని అడుగుతాడు.

దాంతో కృష్ణ ఎందుకు ఏంటి ఏసీపీ సార్.. అలా చేయడం తప్పు కదా అని తనకు ప్రేమ గుడ్డిది అంటూ పెళ్లి జీవితాన్ని మంచిగా చూసుకోమని సలహా ఇచ్చాను అని అనటంతో అది సలహా కాదు ఉచిత సలహా అంటూ తన అత్తయ్య అంటుంది. పోయి పోయి నువ్వు దానికే సలహా ఇచ్చావా అని అరుస్తుంది. ఇవన్నీ అక్కకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ.. అలా అడగకుండా ఇంకెప్పుడు ఎవరికి సలహాలు ఇవ్వకూడదు అని చెబుతుంది.

దాంతో కృష్ణ సరే అన్నట్లు తల ఊపుతుంది. ఇక అనవసరంగా ముకుంద విషయం అత్తయ్యకు చెప్పాను అని.. ఈ విషయం అత్తయ్య పెద్ద అత్తయ్యకి చెబితే ముకుందను మందలిస్తుందేమో అని తల పట్టుకుంటుంది. ఇక మురారి కూడా అనవసరంగా ముకుంద విషయం ఎందుకు తీశావు కృష్ణ అని టాపిక్ డైవర్ట్ చేయాలి అని వేరే టాపిక్ తీస్తాడు.

ఆ తర్వాత కృష్ణ, మురారి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కృష్ణ ఒక విషయాన్ని అడుగుదామని మురారిని అడగటంతో వెంటనే తన అత్తయ్య ఎప్పుడు సైలెంట్ గా ఉండవా అంటూ చిరాకు పడుతూ ఆ మాట మాట్లాడకుండా చేస్తుంది. కానీ కృష్ణ మాత్రం ఊరుకోకుండా ఏసీపీ సార్ మీరు మాత్రం నిజం చెప్పాలి అని అంటుంది. దాంతో మురారి సరే అడుగు అనడంతో.. మీరు ఎవరినైనా ప్రేమించారా అని సిగ్గుపడుతూ అడుగుతుంది.

దాంతో మురారి తల్లి కంగారుపడుతూ కనిపిస్తుంది. ఇక మురారి చెప్పకుండా సైలెంట్ గా ఉండటంతో చెప్పండి సార్ పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది. మరోవైపు ముకుంద గదిలో ముకుంద, మురారి అంటూ గోడమీద తమ పేరు రాసి గతంలో తాము దిగిన ఫోటోలు స్టిక్ చేస్తుంది. అవ్వన్నీ ఫోటో దింపుకొని మురారి కి ఫోన్ చేస్తుంది.

మురారి ఫోన్ లిఫ్ట్ చేయటంతో.. నువ్వు వచ్చేవరికి మన ప్రేమ విషయం అత్తయ్యకు చెబుతాను అని అంటుంది. దాంతో ఆ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని మురారి అనటంతో.. నువ్వేం కంగారు పడకు నేను అత్తయ్యకి చెప్పి కన్విన్స్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. కృష్ణ మాత్రం మీరు ఎవరినైనా ప్రేమించారా అంటూ పదేపదే అడుగుతుంది. దాంతో తన అత్తయ్య తన మనసులో.. దీనికి ఏమైనా మెంటలా నిన్నే ప్రేమిస్తున్నాడు అంటే ఒకప్పటి ప్రేమ గురించి అడుగుతుంది అని కోప్పడుతుంది.

ఇక ఏదో ఒకటి చేయాలి అని టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఉన్నాను కదా ఇటువంటి విషయాలు ఏదైనా ఉంటే మీరు ఏకాంతంలో ఉన్నప్పుడు మాట్లాడుకోండి అని అంటుంది. దాంతో థాంక్యూ అమ్మ అని మురారి తన మనసులో అనుకుంటాడు. ఇక కృష్ణను తన అత్తయ్య తిడుతూ ఉంటే కృష్ణ మాత్రం అమాయకంగా నవ్వుకుంటూ కనిపిస్తూ ఉంటుంది.

ఇక కృష్ణ ఏసీపీ సార్ మనం ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం అని అంటుంది. మరోవైపు ముకుంద భవాని దగ్గరికి వెళ్లి మీకు ఒక విషయం చెప్పాలి అని అనటంతో ఏంటది అని భవాని అడుగుతుంది. అది నేను చెప్పటం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది అని ముకుంద అంటుంది. దాంతో భవాని తను ఏం చెప్పాలనుకుంటుంది ఏం చూపించాలి అనుకుంటుంది అని మనసులో అనుకుంటుంది.

ఇక ముకుంద ప్లీజ్ రండి అనటంతో సరే అని భవాని తనతో పాటు వెళ్తుంది. ముకుంద తన మనసులో.. అత్తయ్య తమ ఫోటోలు చూసి తిట్టిన సరే.. తన ప్రేమ విషయం చెప్పి మురారితో పెళ్లి జరిపించుకోవాలి అని అనుకుంటుంది. ఇక గది దగ్గరికి వెళ్లి తలుపు తీస్తున్న సమయంలో అప్పుడే అక్కడకు మురారి వాళ్లు చేరుకుంటారు. ఇక ఇంట్లో వాళ్లకి ఏదైనా సర్ప్రైజ్   చేద్దామా అని కృష్ణ అంటుంది.

మరోవైపు భవాని ముకుందతో కృష్ణ వాళ్ళ గది దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అనడంతో.. నీకు తెలియాల్సిన విషయం ఈ రూమ్ లోనే ఉంది అని ముకుంద అంటుంది. సరే పద చూద్దాం అని భవాని అనటంతో ముకుంద డోర్ తీస్తూ ఉండగా.. అప్పుడే కృష్ణ వచ్చింది అని చిన్న కొడుకు అంటాడు. దాంతో కృష్ణ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు వచ్చాకే ఆ గదిలో ఏముందో వారి ముందు చూద్దాము అని భవాని అని అక్కడి నుంచి తను కూడా కృష్ణ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇక కృష్ణ ఎందుకు తిరిగి వచ్చింది అని ముకుంద కంగారు పడుతూ ఉంటుంది. ఇక భవాని మురారి తలకు గాయాన్ని చూసి కంగారు పడుతూ ఉంటుంది. 

also read it : Guppedantha Manasu August 28th: 'గుప్పెడంత మనసు' సీరియల్: రిషితో క్యాండిల్ నైట్ డిన్నర్ ప్లాన్ చేసిన ఏంజెల్.. రిషి ప్రేమ కోసం ఆరాటపడుతున్న వసు?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు - బీఆర్ఎస్ నేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు - బీఆర్ఎస్ నేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Harish Rao Tweet: కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు - బీఆర్ఎస్ నేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు - బీఆర్ఎస్ నేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Harish Rao Tweet: కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
Pradeep Machiraju: బుల్లితెరపై ప్రదీప్ రీ ఎంట్రీ... వెంకీ మామతో 'బ్రహ్మముడి' కావ్య కామెడీ... సంక్రాంతి వేడుక కోసం
బుల్లితెరపై ప్రదీప్ రీ ఎంట్రీ... వెంకీ మామతో 'బ్రహ్మముడి' కావ్య కామెడీ... సంక్రాంతి వేడుక కోసం
Parents Property Rights: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
Renu Desai: రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
Hyderabad Metro Phase 2: మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు- ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై సమీక్ష
మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు- ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై సమీక్ష
Embed widget