Meghasandesam Serial Weekly Roundup July 28th to August 2nd: ‘మేఘసందేశం’ సీరియల్: పెళ్లి సంబంధం తెచ్చిన అపూర్వ, భూమి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో శరత్ చంద్ర షాక్..
Meghasandesam serial weekly episode July 28th to August 2nd: భూమికి శరత్ చంద్ర పెళ్లి సంబంధ చూడటం. భూమి ఇంట్లోంచి వెళ్లిపోవడం. ఈ వారం మేఘసందేశం హైలెట్స్

Meghasandesam Serial weekly Episode: గడచిన వారం కూడా మేఘసందేశం సీరియల్ చాలా ఆసక్తిగా జరిగింది. ఇంటికి వచ్చిన శరత్ చంద్ర ఎస్సై మర్డర్ గురించే ఆలోచిస్తుంటాడు. దీంతో అపూర్వ బాధపడ్డట్టు నటిస్తుంది. డాక్టర్ చెప్పిన విషయాలు గుర్తు చేసి నువ్విలా అయిపోతే నేనులా బతకగలను బావ అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంది. శరత్ చంద్ర మాత్రం శోభాచంద్రది మర్డర్ అని తెలిశాక మనఃశాంతిగా ఎలా ఉండగలను అంటూ ఎమోషనల్ అవుతుంటాడు. మరోవైపు చెర్రి, నక్షత్రల మధ్య దూరాన్ని ఎలాగైనా చెరిపేయాలని ప్లాన్ చేసిన భూమి వారికి శోభనం జరిపించాలని అనుకుంటుంది. అందుకోసం మీరా దగ్గరకు వెళ్లి మీరాను రెచ్చగొడుతుంది. దీంతో మీరా డైరెక్టగా శరత్ చంద్ర దగ్గరకు వెళ్లి చెర్రి, నక్షత్రలకు శోభనం చేద్దామని అడుగుతుంది. శరత్ చంద్ర ఓకే అంటాడు. అయితే శోభనం గదిలోకి వెళ్లిన నక్షత్ర తనను తాను కొట్టుకుని అరుస్తూ బయటకు వస్తుంది. అందరికి చెర్రియే తనను కొట్టాడని పాల గ్లాస్ విసిరి వేశాడని ఏడుస్తున్నట్టు నటిస్తుంది. దీంతో శరత్‌చంద్ర కోపంగా చెర్రిని కొడతాడు.
తర్వాత అపూర్వ ప్లాన్ ప్రకారం భూమి కోసం పెళ్లి సంబంధం తీసుకొస్తుంది. ఆ విషయం తెలిసిన భూమి ఇంట్లోంచి వెళ్లిపోతుంది. నేరుగా గగన్ ఇంటికి వెళ్లి శారదను కలిసి ఏడుస్తూ గగన్ బావను తప్పా నేను ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్తుంది. ఇంతలో ఇంటికి వచ్చిన గగన్, భూమిని చూసి శరత్‌చంద్రకు ఫోన్ చేస్తాడు. ఒక అమ్మాయి ఇష్టాఇష్టాలు తెలుసుకోకుండా పెళ్లి చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఇప్పుడు నీ కూతురు నా ఇంటి దగ్గర ఉంది అని చెప్తాడు. దీంతో శరత్ చంద్ర షాక్ అవుతాడు. తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన భూమిని, శరత్ చంద్ర తాను తీసుకొచ్చిన సంబంధం ఓకే చేయమని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి చేస్తానని పెళ్లి వారితో తాంబూలాలు తీసుకుంటాడు. దీంతో భూమి డైలమాలో పడిపోతుంది.
మరోవైపు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అపూర్వ అక్కడి కానిస్టేబుల్‌కు లంచం ఇచ్చి భూమి తమ్ముడు శివను శివ చేతిలో ఉన్న బొమ్మను సీసీటీవీలో చూస్తుంది. తర్వాత అక్కడి నుంచి వస్తుంది. ఇక భూమికి పెళ్లి ఫిక్స్ అయిందని గగన్ ఇంట్లో స్వీట్లు పంచుతాడు. తాను స్వీట్లు తిని పైకి రూంలోకి వెళ్లి మళ్లీ ఏడుస్తుంటాడు. భూమి కూడా ఏడుస్తూ కూర్చుని ఉంటే చెర్రి వెళ్లి తిడతాడు. తాను నక్షత్ర మెడలో తాళి కట్టింది మీకేసమేనని నేను ఇన్ని రోజులు త్యాగం చేశానని అనుకున్నాను కానీ కాలం నాకు రోగం కుదిర్చిందని ఎమోషనల్ అవుతాడు.
ఇష్టం లేని పెళ్లి చేసుకని జీవితాంతం బాధపడాల్సిందేనని అందుకు నువ్వు కూడా సిద్దంగా ఉండు భూమి అని చెప్తాడు. దీంతో భూమి కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నేరుగా శారద దగ్గరకు వెళ్లి తాన గగన్‌నే పెళ్లి చేసుకుంటానని.. తనకు మానసికంగా ఎప్పుడో గగన్‌తో పెళ్లి జరిగిపోయిందని బాధపడుతుంది. మీరే ఎలాగైనా బావను పెళ్లికి ఒప్పించాలని వేడుకుంటుంది. అయితే శారద మాత్రం అందుకు తాను ఒప్పుకోనని గగన్ వచ్చే టైం అయింది నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ భూమికి చెప్తుంది. భూమి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఈ వారం మేఘసందేశం అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















