Meghasandesam Serial Weekly Roundup August 18th to 23rd : ‘మేఘసందేశం’ సీరియల్: గడచిన వారం ఏ జరిగిందో మొత్తం ఏపిసోడ్స్ హైలెట్స్ పై ఓ లుక్కేద్దాం.
Meghasandesam serial weekly episode August 18th to 23rd: మేఘసందేశం సీరియల్ ఈ వారంలో చాలా ఆసక్తికరంగా జరిగింది. ఆగస్టు 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Meghasandesam Serial weekly Episode: డాన్స్ స్కూల్‌లో భూమి పిల్లలకు డాన్స్ ప్రాక్టీస్ చేయిస్తుంది. ఇంతలో అక్కడిక ఉదయ్ వస్తాడు. గుడ్ మార్నింగ్ భూమి అంటాడు. పక్కన కూర్చోండి వస్తాను మాట్లాడుదాం అంటుంది. దీంతో ఉదయ్ పక్కన కూర్చోవడానికి రాలేదని నేను డాన్స్ నేర్చుకుందామని వచ్చాను మీ స్కూల్‌లో జాయిన్ అవుతాను అని చెప్తాడు. దీంతో జాయిన్ చేసుకోవాల్సింది నేను కాదు గగన్ అని చెప్తుంది భూమి. అయితే గగన్‌నే అడుగుదాం పద అంటాడు ఉదయ్. ఇద్దరూ కలిసి గగన్ దగ్గరకు వెళ్తారు.
ఉదయ్ తాను శరత్ చంద్రతో తీసుకొచ్చిన రికమండేషన్ లెటర్ గగన్‌కు ఇస్తూ నాకు ఈ స్కూల్‌లో అడ్మిషన్ కావాలి అంటాడు. లెటర్ చూసిన గగన్ కోపంతో చింపి పడేస్తాడు. దీంతో ఉదయ్ కోపంగా గగన్‌ను తిడతాడు. నువ్విలా ఉన్నావు కాబ్టటే మీ అమ్మకు అంత అవమానం చేశారు అంటాడు. దీంతో ఏంటా అవమానం అంటూ గగన్ మరింత కోపంగా ఉదయ్ పీక పట్టుకుంటాడు. భూమిని చెప్పమని అడుగుతాడు. అయితే శరత్ చంద్ర ఇంట్లో శారదకు జరిగిన అవమానం చెప్తుంది భూమి. దీంతో గగన్ కోపంగా శరత్ చంద్ర ఇంటికి బయలుదేరుతాడు.
గగన్ గొడవకు వస్తున్నాడని తెలుసుకున్న శరత్ చంద్ర కూడా గన్‌తో రెడీగా ఉంటాడు. గగన్ రాగానే షూట్ చేస్తాడు. అయితే తప్పించుకున్న గగన్ నేరుగా శరత్ చంద్ర దగ్గరకు పరుగెత్తుకు వెళ్లి ఆయన చేతిలో గన్ లాక్కుంటాడు. శరత్ చంద్రను చంపేయబోతాడు. ఇంతలో చెర్రి, కేపీ అడ్డుపడతారు. కేపీ కోపంగా గగన్ తిడతాడు. దీంతో గగన్ కూడా కేపీ తిట్టి పక్కకు తోసేస్తాడు. చెర్రి వచ్చి గగన్‌ను కన్వీన్స్ చేస్తాడు. వీళ్లను చంపి నువ్వు జైలుకుపోతే పెద్దమ్మ, పూర్ణి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో అంటాడు. దీంతో కన్వీన్స్ అయిన గగన్ వెంటనే మనసు మార్చుకుని సుజాతను పిలిచి తాడు తీసుకురమ్మంటాడు. తాడు తీసుకొచ్చిన సుజాత చేతే శరత్ చంద్రను స్థంభానికి కట్టేస్తాడు. ఇంతలో శారదకు ఫోన్ చేసి పిలిపిస్తాడు. శారద రాగానే అపూర్వ చేత కాళ్లు మొక్కించి సారీ చెప్పిస్తాడు. తర్వాత అపూర్వను తన గాజులు తానే పగులగొట్టుకునేలా చేస్తాడు. తన బొట్టు తానే తుడుచుకునేలా చేస్తాడు. అపూర్వను విధవలా తయారు చేసి గన్ అక్కడే పడేసి గగన్ వెళ్లిపోతాడు.
అవమానంతో ఊగిపోతున్న అపూర్వ రూంలోకి వెళ్లి ఏడుస్తుంది. శరత్ చంద్ర ఓదారుస్తుంటే.. కోపంతో రగిలిపోతూ ఆ గగన్ గాడిని చంపేయాలని అంటుంది. దీంతో భూమి పెళ్లి ఉదయ్‌తో జరిగితే వాడే అవమానంతో కుంగి చచ్చిపోతాడు అని శరత్ చంద్ర చెప్తాడు. అంతా బయటి నుంచి వింటున్న భూమి ఎలాగైనా ఉదయ్‌తో పెళ్లి క్యాన్సిల్ చేయాలని ఆలోచిస్తుంది.
మరోవైపు భూమి దగ్గరకు కొంతమంది తమ పిల్లలతో వచ్చి వెస్ట్రన్ డాన్స్ కూడా నేర్పిస్తారా అని అడుగుతారు. దీంతో భూమి లేదని చెప్పగానే వాళ్లు వెళ్లిపోతుంటే.. గగన్ వాళ్లను ఆపేస్తాడు. ఇక్కడ వెస్ట్రన్ డాన్స్ కూడా నేర్పుతామని మీ పిల్లలను జాయిన్ చేయమని చెప్తాడు. దీంతో భూమి షాక్ అవుతుంది. ఎవరు నేర్పిస్తారని అడగ్గానే తానే నేర్పిస్తానని గగన్ చెప్తాడు. దీంతో భూమి షాక్ అవుతుంది. ఇంతలో ఉదయ్ అక్కడకు వచ్చి గగన్ నీకు ఇంకా సైట్ కొడుతున్నాడని చెప్తాడు. ఎలా చెప్పగలం అని భూమి అడిగితే తన చేష్టలు అలాగే ఉన్నాయని వెంటనే భూమిని చాంబర్‌లోకి తీసుకెళ్తాడు ఉదయ్. అక్కడికి గగన్ వస్తుంటే.. తాను భూమిని ముద్దు పెట్టుకుని నాటకం ఆడతాడు. అది చూసిన గగన్ కోపంగా భూమి, ఉదయ్‌లని తిట్టి ఇలాంటి పర్సనల్స్ ఏవైనా ఉంటే ఇంట్లో పెట్టుకోవాలని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఈ వారం మేఘసందేశం చివరి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















