Meghasandesam Serial Today November 2nd: ‘మేఘసందేశం’ సీరియల్: కేపీని గుడికి తీసుకెళ్లిన శారద – గుడిలో కేపీని చూసిన అపూర్వ
Meghasandesam serial today episode November 2nd: కేపీ ఆరోగ్యం కోసం గుడిలో హోమానికి కేపీని తీసుకెళ్తుంది శారద. అక్కడ కేపీని అపూర్వ చూడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: హాస్పిటల్ లో ఉన్న కేపీ ఆరోగ్యం బాగుండాలని శారద గుడికి వెళ్తుంది. అక్కడ కేపీ పేరుతో అర్చన చేయిస్తుంది. అర్చన చేసిన తర్వాత పంతులు శారదతో కేపీ ఆరోగ్యం బాగయితే హోమం చేయిస్తానని మొక్కుకోమని చెప్తాడు. శారద అలాగే మొక్కుకుంటుంది. తర్వాత కేపీ కొద్దిగా కోలుకుంటాడు. దీంతో శారద తన మొక్కుబడి గురించి భూమికి చెప్తుంది. భూమి కూడా కేపీని గుడికి తీసుకెళ్లి హోమం చేద్దాం అత్తయ్య అని చెప్తుంది. ఇద్దరూ కలిసి ఎవ్వరూ చూడకుండా కేపీని గుడికి తీసుకెళ్తారు. అక్కడ హోమం చేయడానికి ఏర్పాట్లు చేస్తుంటారు.
పంతులు: అమ్మ మృత్యుంజయ హోమానికి సంబంధిచిన ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. ఇక హోమం మొదలు పెట్టడమే తరువాయి. అయితే మీకు స్వచ్చమైన పాలు, పెరుగు, పండ్లు, పూలు, నెయ్యి తీసుకురమ్మని చెప్పాను. తీసుకువచ్చారా..?
శారద: అన్ని తీసుకొచ్చాం పంతులు గారు.. కానీ నెయ్యి మర్చిపోయాము ఇప్పుడెలా..?
పంతులు: అమ్మ హోమంలో ముఖ్యంగా ఉండాల్సింది.. అతి ప్రధానమైనది స్వచ్చమైన నెయ్యి అదే మర్చిపోతే ఎలా అమ్మ.. మీరు నెయ్యి తీసుకురావడమే ఆలస్యం ఇక హోమం మొదలెపెట్టొచ్చు..
శారద: అమ్మా భూమి నేను వెళ్లి స్వచ్చమైన నెయ్యి తీసుకొస్తాను.. నువ్వు మామయ్యను జాగ్రత్తగా చూస్తుండు..
భూమి: వద్దులే అత్తయ్యా నేనే వెళ్లి నెయ్యి తీసుకొస్తాను.. నువ్వు ఇక్కడే మామయ్యతో ఉండు అత్తయ్య.. పంతులు గారు నేను ఇప్పుడే తీసుకొస్తాను.. అంతలోపు మీరు పూజ ప్రారంభించండి..
పంతులు: సరే అమ్మా.. త్వరగా తీసుకుని రండి..
భూమి: సరే అత్తయ్య మీరు హోమంలో కూర్చోండి..
అని చెప్పి భూమి నెయ్యి కోసం బయటకు వెళ్తుంటే.. అప్పుడే అపూర్వ, సుజాత, నక్షత్ర, చెర్రి వస్తారు అదే గుడికి వస్తారు. వాళ్లు గుడి బయట గేటు ముందు కారు దిగడం భూమి చూస్తుంది. వాళ్లను చూసిన భూమి షాక్ అవుతుంది.
భూమి: వీళ్లేంటి ఇక్కడికి వస్తున్నారు.. మామయ్య ఇక్కడ ఉన్నాడని వీళ్లకు ఏమైనా తెలిసిందా..? లేకపోతే క్యాజువల్ గానే వచ్చారా..? ఏదైనా సరే హోమంఒ అయ్యేంత వరకు మామయ్య వీళ్ల కంట్లో పడకుండా కాపాడుకోవాలి. వెంటనే లోపలికి వెళ్లాలి..
అనుకుంటూ భూమి తిరిగి హోమం జరిగే ప్లేస్‌కు వెళ్తుంది.
శారద: ఏంటి భూమి మళ్లీ వచ్చావు.. నెయ్యి తీసుకొచ్చావా..? ఇక్కడ ఎక్కడ దొరికింది నెయ్యి.. అసలు నువ్వు తెచ్చింది స్వచ్చమైన నెయ్యేనా..?
భూమి: అత్తయ్య నేను నెయ్యి తీసుకురాలేదు.. కానీ ఆ అపూర్వ వాళ్లు ఇదే గుడికి వచ్చారు అత్తయ్య ఎలాగైనా మామయ్య వాళ్లకు కనబడకుండా మనం జాగ్రత్త పడాలి.
అంటూ భూమి చెప్పగానే.. శారద టెన్షన్ పడుతుంది.
శారద: అపూర్వ వాళ్లు వచ్చారా..? ఇప్పుడెలా భూమి..
భూమి: నువ్వేం టెన్షన్ పడకు అత్తయ్య.. వాళ్లు దేవుడిని దర్శనం చేసుకుని వెళ్లిపోతారు. అంతసేపు మామయ్య వాళ్ల కంట పడకుండా ఉంటే సరిపోతుంది. పంతులు గారు ఏమీ అనుకోకపోతే హోమం కొద్ది సేపు అయిన తర్వాత చేద్దాం
అని భూమి చెప్పగానే.. పంతులు సరేనమ్మా.. మీరు చేద్దాం అన్నప్పుడే చేద్దాం.. అంతవరకు నేను గుడిలో ఉంటాను అంటూ పంతులు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో గగన్ కూడా అదే గుడికి వస్తాడు. గగన్‌ను చూసిన భూమి మరింత టెన్షన్ పడుతుంది. ఇంతలో సుజాత కేపీని పక్క నుంచి చూసి అనుమానంగా అపూర్వ చెప్తుంది. అపూర్వ కూడా కేపీని చూసి అలాగే కనిపిస్తున్నాడు కానీ సరిగ్గా కనిపించడం లేదు పిన్ని అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















