Prema Entha Madhuram June 30th: పిన్నిని రప్పించే ప్రయత్నం చేసిన మదన్-అంజలిని భయపెట్టిస్తున్న మాన్సీ?
అంజలి వాళ్ళ మమ్మీ ని మదన్ నిజం బయట పెట్టడానికి కావాలని హైదరాబాద్ కు రప్పించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram June 30th: అంజలి మాన్సీ ని గట్టిగా హెచ్చరిస్తుంది. ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే అసలు ఊరుకోను అని బెదిరిస్తుంది. అంతేకాకుండా త్వరలో అను ఇంటికి రావడం ఖాయం నువ్వు వెళ్లిపోవడం కూడా ఖాయమని అంటుంది. ఇక శారదమ్మ కూడా మాన్సీని ఇక వెళ్లొచ్చు అని అంటుంది. దాంతో మాన్సీ మరింత కోపంతో రగిలిపోతూ వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్తుంది. ఇక ఇంట్లో వాళ్ళు అందరు వెళ్లాక ఆర్య సోఫాలో అను గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. దాంతో జెండే ఆర్య కు ధైర్యం ఇస్తూ ఉంటాడు.
మరోవైపు అను పిల్లలను పడుకోబెడుతుంది. ఇక కోర్టులో జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతుంది. అన్నం పెట్టుకొని ఆలోచనలో పడుతుంది. ఎలాగైనా మాన్సీ ని నీరజ్ నుండి దూరం చేయాలని.. అంజలి, నీరజ్ లు ఒకటవ్వాలని అనుకుంటుంది. ఇక భోజనం తిందామని అనేసరికి బాబు ఏడవటంతో వచ్చి ఎత్తుకుంటుంది. ఊరుకోబెడుతూ ఉంటుంది.
అప్పుడే బామ్మ వచ్చి ఏం జరిగిందని ఎందుకు అంత డల్ గా ఉన్నావు అని అడుగుతుంది. బాబు ను పట్టుకుంటాను నువ్వు భోజనం చేయు అని అంటుంది. ఇక అను తింటుండగా ఎప్పుడు చూసినా డల్లుగా ఉంటున్నావమ్మా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. చూస్తుంటే పెద్దింటి అమ్మాయి లాగా ఉన్నావు.. ఎందుకు బయటకు వచ్చావు అనడంతో.. గతంలో తనకు జోగమ్మ చెప్పిన మాటలు తలుచుకొని మంగళసూత్రం చూపిస్తూ దీని గురించి బయటికి వచ్చాను అని అంటుంది.
దాంతో బామ్మ ఏమి కాదు త్వరలోనే మీరు కలిసిపోతారు అని నమ్మకం ఇస్తుంది. మరోవైపు అంజలి, నీరజ్ షాపింగ్ చేసి వస్తుండగా సమయంలో అంజలికి తన అన్నయ్య మదన్ ఫోన్ చేస్తాడు. కాన్ఫరెన్స్ కాల్ లో మరొకరు ఉన్నారు అనడంతో వెంటనే అంజలి మామ్ అని అంటుంది. ఇక ఎలా ఉన్నావు అని తన తల్లిని పలకరించడంతో.. ఎలా ఉన్నావు కాదు ఎక్కడ ఉన్నావు అడుగు అని అంటాడు మదన్.
మమ్మీ ఇప్పుడు దుబాయ్ కి వచ్చింది రేపు హైదరాబాద్ కి వచ్చేస్తుంది అని అంజలి షాక్ అవుతుంది. అంజలి తల్లి కూడా నిన్ను చూడాలనిపిస్తుందని అందుకే వస్తున్నాను అని అలాగే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా వాళ్ళ ఫ్యామిలీ ఇలాంటిది నిన్ను బాగా చూసుకుంటున్నారా లేదా అని తెలుసుకుంటాను అని అంటుంది. ఇక తన తల్లి ఫోన్ కట్ చేసిన తర్వాత అంజలి తన అన్నయ్యతో.. మమ్మీకి నిజం చెప్పొద్దు అని అంటుంది.
ఇక మదన్ ఫోన్ కట్ చేసిన తర్వాత పిన్నిని నేనే బలవంతంగా రప్పిస్తున్నాను అంటూ.. పిన్నికి నిజం తెలియటంతో ఆర్య కుటుంబంలో జరిగే కలహాలు చూడాలి అని అనుకుంటాడు. ఇక అంజలి నీరజ్ తో తన తల్లికి బీపీ ఉందని.. ఈ విషయం తెలిస్తే తనకు ఇంకేం జరుగుతుందో అని అంటుండగా అప్పుడే మాన్సీ వచ్చి హార్ట్ ఎటాక్ వచ్చి పోతుంది అని ఉంటుంది.
దాంతో తన మాటలు విని షాక్ అవుతుంది అంజలి. రేపు మీ మమ్మీ రాగానే ఏమని చెబుతావు.. ఎలా పెళ్లి చేసుకున్నావ్ అని చెబుతావు.. అంటూ వెటకారం చేస్తూ మాట్లాడుతుంది. అంతేకాకుండా మీ మమ్మీకి నేనే నిజం చెప్పేస్తాను బెదిరించడంతో అంజలి భయపడుతుంది.
Also Read: Rangula Ratnam June 30th: సిద్దును వదిలేసిన స్వప్న.. ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న వర్ష?