అన్వేషించండి

Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మి నివాసం' సీరియల్: విజయేంద్ర ఇంటికి జాను - శ్రీ, తులసి పెళ్లి ఆపేందుకు భార్గవ్ చేసిన ప్లాన్ ఏంటి.?, అసలు ఈ పెళ్లి జరుగుతుందా..?

Lakshmi Nivasam Today Episode: తన అక్క పెళ్లికి పిలిచేందుకు జాను విశ్వ ఇంటికి వెళ్తుంది. ఇదే టైంలో పెళ్లి ఆపేందుకు శ్రీ బావ భార్గవ్ ప్లాన్ చేస్తుంటాడు. అసలు ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Lakshmi Nivasam Serial Today Episode Review: లక్ష్మి ఇంట్లో తులసి పెళ్లి పనుల హడావుడి జరుగుతుంటుంది. లక్ష్మి, శ్రీనివాస్ తన కోడలు కీర్తి ఇంటికి పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్లగా.. వారిని బసవ, అతని తల్లి అవమానిస్తారు. లక్ష్మి ఎవరో తెలియకుండానే ఆవిడను అక్క అని పిలుస్తోన్న సిద్ధు వారిని చూడడం మిస్ అవుతాడు. మరోవైపు, తన అక్క తులసి పెళ్లికి విశ్వతో పాటు అతని స్నేహితులను సైతం ఆహ్వానిస్తుంది జాను. ఇదే సమయంలో ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు విశ్వ. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

తాత ఇంటికి వెళ్లిన జాను..

తన అక్క తులసి పెళ్లికి ఆహ్వానించేందుకు.. జాను విశ్వ ఇంటికి వెళ్తుంది. విశ్వ తన తండ్రి విజయేంద్ర, తల్లి త్రివేణి, తాతలను పరిచయం చేస్తాడు. అందరినీ పలకరించిన తర్వాత జాను పెళ్లి పత్రికను వారికి అందిస్తుంది. పెద్దల ఆశీర్వాదం బలంగా ఉంటే ఆడపిల్ల కాపురం సంతోషంగా ఉంటుందని పెద్దలు చెబుతుంటారని.. మీరంతా తప్పకుండా పెళ్లికి రావాలని వారిని ఆహ్వానిస్తుంది. ఇదే సమయంలో విజయేంద్ర తండ్రి.. లక్ష్మి గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు. 

ఈ లోపు కంప్యూటర్ అసైన్‌మెంట్ చేయిస్తానని.. విశ్వతో పాటు వెళ్తుంది జాను. ఇదే సమయంలో ఆ అమ్మాయిని చూస్తుంటే సొంత మనుషులను చూసినట్లే ఉందని త్రివేణి విజయేంద్రతో అంటుంది. ఆమెను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు ఎవరో అని అంటాడు.

పెళ్లి కార్డు చూడడం మిస్ అయ్యారుగా..

పెళ్లి కార్డును చూస్తే జాను తల్లిదండ్రులు ఎవరో తెలిసిపోతుందని చెప్పగా.. విజయేంద్ర కార్డ్ ఓపెన్ చేస్తాడు. అదే టైంలో సరిగ్గా కనిపించక కళ్ల జోడు తీసుకురావాలని త్రివేణికి చెప్తాడు విజయేంద్ర. ఆమె వెళ్తుండగా.. కార్డు పొరపాటున నీటిలో పడిపోతుంది. దీంతో జాగ్రత్తగా ఉండాలని విజయేంద్ర ఆమెపై అరుస్తాడు. 

మరోవైపు, తులసితో శ్రీ పెళ్లి ఆపేందుకు సుపర్ణిక, ఆమె భర్త భార్గవ్ ప్లాన్ చేస్తారు. పెళ్లి జరగదని.. దానికి తాను ఓ ప్లాన్ వేశానని చెప్తాడు సుపర్ణిక భర్త. ఎవరికో ఫోన్ చేసి తాను ప్లాన్ చేసిన విషయం తన భార్య సుపర్ణికకు కూడా తెలియదని.. ప్లాన్ అప్లై చేయమని చెప్తాడు. 

వధూవరులుగా శ్రీ, తులసి..

ఇదే సమయంలో పెళ్లి పనుల్లో లక్ష్మి బిజీగా ఉంటుంది. అన్నీ కష్టాలు తీరిపోయాయని.. తన అమ్మతో శ్రీనివాస్ అంటాడు. ఈలోపు వసు.. శ్రీకు బాసికం కట్టి వరుడిగా రెడీ చేస్తుంది. తానే తన నాన్నకు కాటుక పెడతానంటూ ఖుషీ పట్టుబడుతుంది. సెల్ఫీలు దిగుతూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ముహూర్తానికి టైం అవుతుందంటూ బయల్దేరతారు.

తులసిని సైతం వధువుగా జాను అందంగా రెడీ చేస్తుంది. ఇదే టైంలో తోడికోడళ్లు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటుంటారు. ఇదే టైంలో భోజనాల దగ్గర శ్రీనివాస్ పెద్ద కొడుకు కొబ్బరికాయల కోసం కక్కుర్తి పడతాడు. 

తులసి పెళ్లికి త్రివేణి

తులసి పెళ్లికి విజయేంద్ర భార్య త్రివేణి వెళ్తుండగా.. ఎక్కడికని అడగకూడదని విజయేంద్ర అంటాడు. లక్ష్మి కూతురు తులసికి ఈ రోజు పెళ్లని.. మీ మేనకోడలి పెళ్లికి తానైనా వెళ్తానని అంటుంది. దీంతో విజయేంద్ర ఆమెపై చేయి చేసుకుంటాడు. 30 ఏళ్ల కిందట లక్ష్మి వేరే పెళ్లి చేసుకుని వచ్చినందుకే తన తండ్రి రెండు కాళ్లు పడిపోయాయని.. ఇప్పుడు నువ్వు ఆ పెళ్లికి వెళ్తే రెండు కాళ్లు విరిచేస్తానని.. విజయేంద్ర త్రివేణికి వార్నింగ్ ఇస్తాడు. దీంతో కన్నీళ్లు పెట్టుకుంటూ త్రివేణి లోపలికి వెళ్లిపోతుంది.

పెళ్లి కోసం శ్రీ బయలుదేరుతుండగా భోరున వర్షం కురుస్తుంటుంది. అందరం ఒకే కారులో వెళ్దామని శ్రీ అనగా.. సుపర్ణిక, భార్గవ్ తాము గిఫ్ట్ కొనాలని.. వేరే కారులో వస్తామని చెప్తారు. దీంతో సరే అంటూ శ్రీ, వసు, ఖుషి కారులో బయల్దేరుతారు. ఆ తులసిని పెళ్లి కూతురిలా చూడాలా అంటూ.? సుపర్ణిక విసుక్కోగా.. ఇది చివరి చూపు సుప్పూ.. అంటూ భార్గవ్ మనసులో అనుకుంటాడు. మరి శ్రీని చంపేందుకు భార్గవ్ ఏమైనా ప్లాన్ చేశాడా..? అసలు శ్రీ, తులసి పెళ్లి జరుగుతుందా.? అనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
Illu Illalu Pillalu Serial Today August 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget