అన్వేషించండి

Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మి నివాసం' సీరియల్: తులసిని ఇంప్రెస్ చేసేందుకు సిద్ధు పాట్లు - భార్గవ్ ప్లాన్‌తో శ్రీనివాస్ ఫ్యామిలీ రోడ్డు మీద పడనుందా?

Lakshmi Nivasam Today Episode: జానుతో పెళ్లి కలల్లో ఉంటాడు జై. కాలేజీలో విశ్వ, జాను క్లోజ్‌గా ఉండడం చూసి ఆమెకు స్పైగా పని చేయాలంటూ ప్యూన్‌కు డబ్బులిస్తాడు జై. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..

Lakshmi Nivasam Serial April 25th Today Episode: ఇంటి నుంచి వెళ్లిపోయిన చిన్నారి ఖుషీ తులసి వద్దకు చేరగా.. పాపను బలవంతంగా తమ ఇంటికి తీసుకెళ్తారు భార్గవ్, సుపర్ణిక. ఖుషీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది సుపర్ణిక. ఇదే సమయంలో జానుతో పెళ్లి కలల్లో తేలుతుంటాడు జై. కాలేజీలో విశ్వతో చనువుగా మాట్లాడడాన్ని చూసి జై తట్టుకోలేకపోతాడు. కాలేజీ ఫ్యూన్‌కు డబ్బులిచ్చి జానుకు స్పైగా ఉండాలంటూ చెప్తాడు. ఆమె ఎప్పుడు ఏం చేసినా తనకు చెప్పాలంటూ ఆర్డర్ వేస్తాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..

శ్రీనివాస్ పతనానికి భార్గవ్ ప్లాన్

తులసి పెళ్లి కోసం శ్రీనివాస్ రూ.10 లక్షలు అప్పు చేయగా.. ఆ డబ్బులు ఇవ్వాలంటూ అతని ఇంటికి వచ్చి నిలదీస్తాడు ఫైనాన్షియర్. నెల నెలా వడ్డీ ఇస్తున్నా అంటూ శ్రీనివాస్ చెప్పగా.. అసలు కట్టాలని అడుగుతాడు. డబ్బు అయినా ఇవ్వాలని లేకుంటే తన దగ్గర తాకట్టు పెట్టిన ల్యాండ్‌ను తన పేరు మీద రాయాలంటాడు. అందరి సంతకాలు పెట్టాలని.. లేకుంటే జైలుకు పంపిస్తానని బెదిరిస్తాడు. స్థలం రిజిస్టర్ చేయాలంటూ డిమాండ్ చేస్తాడు. దీంతో లక్ష్మీ, శ్రీనివాస్‌తో పాటు ఫ్యామిలీ మొత్తం వేదనకు గురవుతారు. 

ఆ తర్వాత భార్గవ్‌కు ఫోన్ చేస్తాడు ఫైనాన్షియర్. మీరు చెప్పినట్లే చేశానని అంటాడు. వడ్డీ, బారు వడ్డీ అని శ్రీనివాస్ వాళ్లను పీల్చి పిప్పి చేయాలని.. జాలి చూపించొద్దంటూ ఆర్డర్ వేస్తాడు. ఆ స్థలం వాళ్లకు ఉండకూడదని.. ఉంటున్న ఇళ్లు కూడా ఉంచకూడదని భార్గవ్ అంటాడు. దీంతో అలానే అంటాడు వ్యాపారి.

తులసిని ఇంప్రెస్ చేసేందుకు సిద్ధు తిప్పలు

మరోవైపు, తులసి బస్సు కోసం వెయిట్ చేస్తుండగా ఆమెను చూసి పలకరిస్తాడు సిద్ధు. అతనితో వెటకారంగా మాట్లాడిన తులసి.. పక్కనే లేడీ కానిస్టేబుల్‌కు ఏడిపిస్తున్నాడని చెబుతుంది. ఇంతలో బస్ రాగా తులసి బస్సెక్కి వెళ్లిపోతుంది. కానిస్టేబుల్‌కు నచ్చ చెప్పిన సిద్ధు అదే బస్ ఎక్కి ఆమె వెంటపడతాడు. తనతో మాట్లాడాలని ప్రయత్నించగా.. నీ వల్ల చాలా నష్టపోయానని సిద్ధుతో అంటుంది తులసి. నువ్వు రౌడీవి అని అందరికీ సాయం చేయాలంటూ సలహా ఇస్తూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది తులసి. ఇది గమనించిన సిద్ధు.. ఇక నుంచి తులసి దృష్టిలో తాను రాముడిలా కనిపించాలనే నిర్ణయానికి వస్తాడు.

ఇదే సమయంలో ఉదయం వ్యాపారి ఇంటికి వచ్చి అప్పు అడిగిన విషయాన్ని శ్రీనివాస్, లక్ష్మి ఫ్యామిలీకి చెబుతారు. తులసి పెళ్లి కోసం భూమి తాకట్టు పెట్టానని అంటాడు. డబ్బు ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్టర్ చేయించాలని ఫైనాన్షియర్ చెప్పినట్లు అందరికీ చెప్తాడు. అందరి సంతకాలు కావాలని చెప్తాడు. అయితే, శ్రీనివాస్ కొడుకులిద్దరూ తాము పెట్టమని ముక్త కంఠంతో చెప్తారు. విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో లక్ష్మి, శ్రీనివాస్ ఇద్దరూ వేదనకు గురవుతారు. 

హరీష్, మహేష్ ఇద్దరూ శ్రీనివాస్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తుంటారు. ఇంతలో కీర్తి వాళ్లకు ఓ ఐడియా ఇస్తుంది. పైనాన్షియర్ దగ్గర నుంచి ఆ స్థలం విడిపించి అమ్మేసి అప్పులు కట్టేసి మిగిలిన డబ్బుతో ఇద్దరూ కలిసి బిజినెస్ చేసుకోవచ్చు కదా అంటూ చెప్తుంది. ఈ ఐడియా బాగుంది అంటూ ఇద్దరూ అంటారు.

మరి శ్రీనివాస్‌ను రోడ్డుకు లాగాలన్న భార్గవ్ ప్లాన్ ఫలిస్తుందా? ఫైనాన్షియర్ బారి నుంచి తన స్థలాన్ని శ్రీనివాస్ ఎలా కాపాడతాడు? సిద్ధు తులసి దృష్టిలో మంచివాడనే ముద్ర పడుతుందా? తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget