అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today April 6th: శ్రీలక్ష్మిని తిట్టి ఇంటికి తీసుకొచ్చిన మ్యాడీ..? లక్ష్మీ చేసిన పనిని మెచ్చుకున్న సూర్యనారాయణ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode April 6th:శ్రీలక్ష్మిని తిట్టి ఇంటికి తీసుకొచ్చిన మ్యాడీ..? లక్ష్మీ చేసిన పనిని మెచ్చుకున్న సూర్యనారాయణ

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: ఆస్పత్రిలో తన భర్తను చూసి కోపంతో రగిలిపోయిన ప్రియంవద...ఒక్క మనిషి కిడ్నాప్ చేసి తీసుకురమ్మని చెబితే చేతకాలేదని రౌడీలపై కోప్పడుతుంది. ఇంతలో పక్కనే అతన్ని కాపాడింది ఎవరా అని చూసి ఒక్కసారిగా షాక్‌ తింటుంది. అప్పుడే తన భర్తకు రక్తం ఇస్తున్న శ్రీలక్ష్మీని చూసి కంగారుపడిపోతుంది. ఇది ఇతన్ని ఎందుకు కాపాడిందని ఆందోళన చెందుతుంది.అప్పుడే శ్రీలక్ష్మీని వెతుక్కుంటూ మ్యాడీ కూడా ఆస్పత్రికి వస్తాడు. తీవ్ర గాయాలతో ఉన్న తన భర్తకు మెలకువ రాగానే వెంటనే ఇక్కడి నుంచి అతన్ని షిప్ట్ చేయమని రౌడీలకు చెప్పి వెళ్లబోతుండగా...అప్పుడే అక్కడికి వచ్చిన మ్యాడీని చూసి ప్రియంవద మరింత భయపడి వెనక్కి పరుగులు తీస్తుంది.

తాను కాపాడిన వ్యక్తికి రక్తం ఇచ్చి బయటకు వస్తున్న శ్రీలక్ష్మీని చూసి మ్యాడీ మండిపడతాడు.కాలేజీకి రాకుండా ఎక్కడికి వెళ్లావని...నిన్ను వెతుక్కుంటూ ఎక్కడెక్కడ తిరగాలని అరుస్తాడు. మొన్నే కదా యాక్సిడెంట్ జరిగింది...మళ్లీ ఇంతలో ఇదంతా ఏంటని నిలదీస్తాడు. భయపడిపోయిన శ్రీలక్ష్మీ...నా కళ్లముందు ఓ మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకోలేపోయానని అందుకే అతన్ని తీసుకుని ఆస్పత్రికి వచ్చానని చెబుతుంది. రోడ్డునపోయే గొడవలన్నీ ఎందుకు తలకు చుట్టుకుంటావని కోప్పడతాడు. ఇది మర్డర్‌ కేసని...పోలీసులు, కోర్టులను సవాలక్ష గొడవలు ఉంటాయని అంటాడు.ఇప్పుడు పోలీసుస్టేషన్లు చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదని అంటాడు. కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోదామని చెప్పి శ్రీలక్ష్మీని లాక్కుని వెళ్లిపోతాడు.

శ్రీలక్ష్మీ కోసం తనపై మ్యాడీ చేయిచేసుకోవడంతో త్రిష ఆగ్రహంతో ఊగిపోతుంది. ఆ ఎర్రబస్సు కోసం నాపైనే చేయిచేసుకుంటాడా అని మండిపడుతుంది. ఆ ఎర్రబస్సు అడ్డుతొలగించుకోకపోతే...నా మ్యాడీ నాకు దక్కకుండాపోతాడని అంటుంది. ఏదైనా చేసి ఆ ఎర్రబస్సును శాశ్వతంగా మ్యాడీకి దూరం చేయాలని అనుకుంటుంది.అప్పుడే అక్కడికి వచ్చిన సీనియర్‌ విక్రమ్‌....త్రిష దగ్గరకు వచ్చి మీ ఫ్రెండ్ శ్రీలక్ష్మీ కనిపించడం లేదేంటని అడుగుతాడు. ఎందుకు సార్‌ రికార్డులు ఏమైనా రాసివ్వాలంటే నేను రాసిస్తానని అంటుంది.అలాంటిదేమీ లేదని... ఎందుకో చాలారోజుల నుంచి ఆ అమ్మాయి కనిపించకపోవడంతో అడిగానని అంటాడు.

మీలో చాలామార్పులు వచ్చాయి సార్ ఈ మధ్య అని త్రిష విక్రమ్‌ను ఆటపట్టిస్తుంది. శ్రీలక్ష్మీని చూసినప్పటి నుంచి మీలో మార్పులు మొదలయ్యాయని....నిజంగా ఆమెకు కూడా మీరంటే ఇష్టంలేకపోతే ఆరోజు స్టేజీపై మీ గురించి అంత గొప్పగా ఎలా మాట్లాడుతుందని అంటుంది. ఆ మాటలకు విక్రమ్‌ చాలా సంతోషపడి వెళ్లిపోతాడు. ఈ విక్రమ్‌ను శ్రీలక్ష్మీ మీదకు ఉసిగొల్పి నా పగతీర్చుకుంటానని త్రిష అంటుంది.

శ్రీలక్ష్మీని తీసుకుని మ్యాడీ ఇంటికి రాగా...ఆమె బట్టలన్నీ రక్తంతో తడిచిపోయి ఉండటం చూసి ఇంట్లోవాళ్లు కంగారుపడతారు.ఏం జరిగిందని...మళ్లీ ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా అని అడుగుతారు. తనకు ఏం కాలేదని...కాకపోతే దారినపోయే గొడవలన్నీ మీదకు తెచ్చుకుంటుందని మ్యాడీ మండిపడతాడు. ఇంతలో లక్ష్మీ కలుగజేసుకుని ఎవరో ఒకతన్ని నలుగురు రౌడీలు కలిసి కొట్టి కత్తులతో పొడిచి చంపబోయారని...నేను వెళ్లి అడ్డుకుని అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లానని చెబుతుంది. ఆ మాటలు విన్న సూర్యనారాయణ కంగారపడతాడు. నలుగురు రౌడీలను నువ్వు అడ్డుకోవడానికి నీకు భయం లేకుండా పోయిందని మ్యాడీ అంటాడు. వాళ్లు నిన్నుకూడా ఏదైనా చేసి ఉంటే అని అంటాడు. పైగా ఇది మర్డర్‌ కేసు అని...వాడు ఏం తప్పుచేస్తే వాళ్లు చంపుతున్నారోనని అంటాడు.

ఇవన్నీ నీకు ఎందుకని అంటాడు. శ్రీలక్ష్మీ చేసిన పనిని సూర్యానారాయణ మెచ్చుకుంటాడు. అతనికి సంబంధించిన వాళ్లు వచ్చేవరకు ఉందామని అన్నా...మధుబాబు లాక్కుని వచ్చాడని చెబుతుంది.అయితే మనం వెళ్లి చూసొద్దమని సూర్యనారాయ అనగా...అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియంవద అవసరంల లేదులే అని అంటుంది. కోమాలో ఉన్న అతన్ని మీరు చూసి ఏం చేస్తారని అంటుంది.అతను కోమాలో ఉన్నాడని నీకు ఎలా తెలుసని వాళ్ల అమ్మ ఇందిర నిలదీయగా...అన్ని కత్తిపోట్లు దిగిన తర్వాత కోమాలోనే ఉంటాడుగా అని తప్పించుకుంటుంది. అయితే మనం ఆ రౌడీలపై కేసు పెడదామని శ్రీలక్ష్మీ అనగా...అతనికి మెలకువ రాగానే వెళ్లి కలిసి వివరాలు కనుక్కుని కేసు పెడతామని సూర్యనారాయణ అంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్న ఆస్పత్రికి వెళ్లకుండా చూసుకోవాలని ప్రియంవద అనుకుంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget