Lakshimi Raave Maa Intiki Serial Today January 8th: త్రిష కారుకు శ్రీలక్ష్మీ ఎందుకు అడ్డుపడి ఆపింది...? తాతయ్యను మభ్యపెట్టేలా సింధూ ఆడిన నాటకం ఏంటి..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 8th: సింధూ పెళ్లికి వచ్చిన త్రిష వాళ్లు గ్రామంలో ఓ ముసలావిడను కారుతో గుద్దడంతో లక్ష్మీ వారిని అడ్డగిస్తుంది.

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: సింధూను పెళ్లిమండపం నుంచి తప్పించడానికి మ్యాడీ త్రిషతోపాటు వాళ్ల ప్రెండ్స్‌ను సిటీ నుంచి రప్పిస్తుంటాడు. వాళ్ల ఊరిలోకి వచ్చీ రాగానే దారిలో ఓ ముసలావిడను కారుతో గుద్దేస్తారు.పాలన్నీ కిందపడిపోయాయని ఆమె ఏడ్వడం మొదలుపెట్టగానే...డబ్బులు ఆమె ముఖంపై విసిరేసి వెళ్లిపోతుంటారు. ఇదంతా గమనించిన లక్ష్మీ వాళ్ల కారుకు అడ్డుగా నిలబడి ఆపుతుంది. బామ్మను గుద్దేసి కనీసం ఆమెకు ఏం జరిగిందో తెలుసుకోకుండా వెళ్లిపోతారా అంటూ నిలదీస్తుంది. మర్యాదగా బామ్మ కాళ్లు పట్టుకుని సారీ చెప్పి వెళ్లండని అంటుంది. బామ్మకు క్షమాపణలు చెప్పకుండా ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెబుతుంది. త్రిషను లాక్కెళ్లి బామ్మకు క్షమాపణలు చెప్పాలని కోరుతుంది.ఆల్రెడీ డబ్బులు ఇచ్చేశామని త్రిష అంటుంది.లక్ష్మీని తోసేసి వాళ్లు పెళ్లింటికి వెళ్లిపోవడానికి ట్రై చేస్తారు. దీంతో లక్ష్మీ దగ్గర ట్యూషన్‌కు వచ్చే పిల్లలు కారు టైరుకు పంక్చర్ చేయడంతో వాళ్లు ముందుకు వెళ్లలేకపోతారు. ఈ విషయం మ్యాడీకి చెప్పి మీ సంగతి తేలుస్తానని త్రిష అంటుంది. మీరు ఎవరో తెలియక జరిగిన పొరపాటని లక్ష్మీ క్షమాపణలు చెబుతుంది. వాళ్లు కారు అక్కడే వదిలేసి నడిచి వెళ్లిపోతారు.
నడుచుకుంటూ ఇంటికి వచ్చిన త్రిష, ప్రెండ్స్‌ను ఎందుకు ఇలా వచ్చారని మ్యాడీ అడుగుతాడు. దీంతో లక్ష్మీ చేసిన పని వివరించి చెబుతారు. నేను సారీ చెప్పి వచ్చేశానని త్రిష అబద్ధం చెబుతుంది. కారు పంక్చర్ చేశారని చెబుతారు. లక్ష్మీమీద లేనిపోనివి మ్యాడీకి చెబుతారు. పెళ్లింట్లో అంతా హడావుడిగా ఉంటుంది. అక్కను బయటకు ఎలా పంపించాలా అని మ్యాడీ ఆలోచిస్తుంటాడు. త్రిషతో కలిసి సింధూరూమ్‌కు వెళ్లిన మ్యాడీ ఆమెకు ఎలా పారిపోవాలో చెబుతాడు. అందరూ నిద్రపోయేవరకు నువ్వు కాస్త వాళ్లకు అనుమానం రాకుండా వ్యవహరించమని చెబుతారు. ఇంతలో కారు బాగుచేయించుకుని లక్ష్మీ దాన్ని తీసుకుని సూర్యనారాయణ ఇంటికి వస్తుంది. కారు తాళం మ్యాడీకి ఇచ్చేందుకు వెళ్తుండగా..పెద్దాయన పిలుస్తాడు. కారు ఎవరిదని అడగ్గా...మ్యాడీ వాళ్ల స్నేహితుల కారు పంక్చర్ అయితే బాగు చేయించి తీసుకొచ్చానని చెబుతుంది. అయితే మీ వదిన చేతికి నువ్వు గోరింటాకు పెట్టాలంటూ లక్ష్మీని తీసుకుని సూర్యనారాయణ సింధూ గదికి వెళ్తాడు.
ఇంతలో గదిలో మ్యాడీ వాళ్ల అక్కకు ప్లాన్ గురించి చెబుతుంటాడు. త్రిష ప్రెండ్ ఒక బురఖా తీసుకుని వచ్చిందని...పెళ్లిలో చీరమార్చుకుని రమ్మని పంపినప్పుడు నువ్వు లోపలికి వెళ్లి ఆ బురఖా వేసుకుని బయటకు వెళ్లిపోవడమేనని చెబుతాడు. అంతలో అక్కడికి తాతయ్య,లక్ష్మీ రావడం అద్దంలో చూసి సింధూ గట్టిగా అరుస్తుంది. నేను ఈ పెళ్లిచేసుకుంటానని నాకు ఈ పెళ్లిఇష్టమేనని చెబుతుంది. తాతయ్య నిర్ణయమే నా నిర్ణయమని చెబుతుంది. ఇదంతా కిటికీ దగ్గర ఉండి పెద్దాయన,లక్ష్మీ వింటున్నారని తెలిసి అలా మాట్లాడుతుంది. మిగిలిన వారికి ఆమె ప్రవర్తన అర్థం కాదు.





















