అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today February 4th: శ్రీలక్ష్మీతో కీచులాడుకుంటూనే గుడికి చేరుకున్న మ్యాడీ....మరి భార్యను ఎత్తుకుని మరి గుడిమెట్లు ఎందుకు ఎక్కాడు...?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 4th: శ్రీలక్ష్మీతో కీచులాడుకుంటూనే గుడికి చేరుకున్న మ్యాడీ....మరి భార్యను ఎత్తుకుని మరి గుడిమెట్లు ఎందుకు ఎక్కాడు...?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: భార్యాభర్తలిద్దరూ గుడికి వెళ్లాలని సూర్యనారాయణ ఆదేశించడంతో...మ్యాడీ శ్రీలక్ష్మిని గుడికి తీసుకెళ్లేందుకు బయలుదేరతాడు. తన బండిపై శ్రీలక్ష్మిని ఎక్కమంటే తను కొంచెం ఇబ్బందిగానే బండి ఎక్కి తనపక్కనే కూర్చుంటుంది.ఇదంతా చూస్తున్న ప్రియంవదకు కడుపుమండిపోతుంది. బండికొంచెం ముందుకు వెళ్లగానే శ్రీలక్ష్మీ ఇబ్బందిపడుతుంది.దీంతో మ్యాడీ భయపడతాడు.ఈ ఎర్రబస్సును  బైక్‌పై తీసుకెళ్తుంటే ఊరిలోఅందరూ చూస్తారని....తనే నా పెళ్లాం అని భావిస్తారని అనుకుంటాడు.అందుకే కారులో వెళితే బెటరని అనుకుంటాడు. వెంటనే బండి దిగిమనికారులోవెళ్తామనిచెబుతాడు. దీనికి శ్రీలక్ష్మీ కూడా సంతోషపడుతుంది. నాకు బైక్‌పై రావడం ఇబ్బందిగా ఉందని భావించే మీరు నాకోసం కారులో వెళ్తామని అంటున్నారు కదా అని అంటుంది.అలాంటిదేమీ లేదని నిన్ను బైక్‌పై ఎక్కించుకుని వెళితే నా పరువే పోతుందని అందుకే కారులో వెళ్తున్నామని నోరు మూసుకుని రమ్మని చెబుతాడు. బైక్‌దిగి కారు  ఎక్కుతాడు. తనను కారులో కూర్చోమని  చెప్పగా....ముందుసీటులో కూర్చునేందుకు శ్రీలక్ష్మీ ప్రయత్నించగా....వెనకసీటులో కూర్చోమని చెబుతాడు.అప్పుడు నేను ఓనర్‌ నువ్వు డ్రైవర్‌లా ఉంటావని చెప్పి ముందు సీటులోనే కూర్చుంటుంది. తనకు బెల్టు పెట్టుకోవడం రాకపోతే మ్యాడీయే ఆమెకు సీటు బెల్టు పెడతాడు.
                       అటు గోపీ  ఇంటికి పక్కింటి ఆవిడ వచ్చి గోపీవాళ్ల అమ్మను పిలుస్తుంది. దీంతో సింధూ భయటకు వచ్చి ఏం కావాలని అడుగుతుంది.నేను నీకు అక్క అవుతానమ్మా అని చెబుతుంది.దీంతో సింధూకు కోపం వస్తుంది.వచ్చిన పని ఏంటో చెప్పమని అంటుంది.మా ఇంట్లో పాలు పిల్లితాగేసిందని...పసిపిల్లాడు పాలకోసం ఏడుస్తున్నాడని అందుకే వచ్చానని అంటుంది. మా ఇంట్లో పాలు లేవని చెప్పి సింధూ ఆమెను పంపించబోతుండగా...బయట నుంచి వచ్చి గోపీ ఏంటని ఆరా తీస్తాడు.బాబు ఏడుస్తున్నాడని పాలకోసం వచ్చానని మీ ఇంట్లో పాలు లేవని చెబితే వెళ్లిపోతున్నానని చెబుతుంది. మా ఇంట్లో పాలు లేకపోవడం ఏంటని...నేను తీసుకొస్తాను ఉంటూ గోపీ లోపలకి వెళ్లి పాలు తీసుకుని వచ్చి ఇస్తాడు.దీంతో ఆమె సింధూపై మండిపడుతుంది.ఇంట్లో పాలు ఉంచుకుని కూడా లేవని అబద్ధాలు చెబుతావా అంటూ తిడుతూ పాలు తీసుకుని వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత సింధూ గోపీపై మండిపడుతుంది.రాత్రినుంచి నేను ఏం తినలేదని...ఇప్పుడు  ఆ పాలు తాగుదామనుకుంటే అవికూడా ఇచ్చేస్తావా అనిఅరుస్తుంది. ఇంతలో గోపీ వాళ్ల అమ్మవచ్చి ఏంమాయరోగం తినడానికి అని అంటుంది.మేం అందరం తినడం లేదా అని అనగానే....సింధూ కోపంతో లోపలికి వెళ్లిపోతుంది.
                               కారులో గుడికి వెళ్తూ మ్యాడీ, శ్రీలక్ష్మీ కీచులాడుకుంటారు.ఇంతలోగుడివస్తుంది.మ్యాడీ కారు దిగకుండా కారులోనే ఉండి నువ్వు వెళ్లి దేవుడిని దర్శనం చేసుకుని రమ్మని అంటాడు. నువ్వు కూడా రావాలి అంటే తాతయ్య నిన్ను గుడికి తీసుకెళ్లమని మాత్రమే చెప్పాడని...నీతోపాటు గుడిలోపలికి వెళ్లమని చెప్పలేదని అంటాడు. నేను రానంటేరానని తెగేసి చెబుతాడు. ఇంతలో సూర్యనారాయణ పూజారికి ఫోన్‌చేసి మా మనవడు వచ్చాడా అని ఆరా తీస్తాడు. అప్పుడే అక్కడ మ్యాడీని చూసిన పూజారి ఇప్పుడే వచ్చాడండి...కాకపోతే కారు దిగడం లేదని చెప్పడంతో  భయపడిపోయిన మ్యాడీ కారు దిగుతాడు. కొత్తగా పెళ్లయిన  జంటలతో చేయించాల్సిన పూజలన్నీ చేయిస్తానని పూజారి సూర్యనారాయణకు చెబుతాడు. తాతయ్య పేరు చెప్పి బెదిరించి  శ్రీలక్ష్మీని ఎత్తుకుని మెట్లన్నీ ఎక్కుతూ  గుడిలోకి వెళ్లాలని చెబుతాడు.దీనికి మ్యాడీ ససేమీరా అంటాడు. నువ్వు అలాచేస్తే నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయని చెప్పండంతో ఈ ఎర్రబస్సు గోలవదిలిపోవాలని మొక్కుకుంటూ  శ్రీలక్ష్మీనిఎత్తుకుని గుడి మెట్లుఎక్కుతాడు.

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget