Lakshimi Raave Maa Intiki Serial Today February 10th: కిటికీలో నుంచి దూకి పారిపోయిన మ్యాడీ.....మధుబాబును వెతుక్కుంటూ పబ్‌కు వెళ్లిన సూర్యనారాయణ,శ్రీలక్ష్మీ
Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 10th: కిటికీలో నుంచి దూకి పారిపోయిన మ్యాడీ.....మధుబాబును వెతుక్కుంటూ పబ్‌కు వెళ్లిన సూర్యనారాయణ,శ్రీలక్ష్మీ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: మ్యాడీ పబ్‌కు వెళ్లడానికి బయలుదేరుతుంటే అతన్ని రూమ్‌లో పెట్టి తాళం వేసి బయటకు వస్తుంది శ్రీలక్ష్మీ. ఇంతలో లక్ష్మీ వాళ్ల అమ్మానాన్న అందరూ రావడంతో సూర్యనారాయణ వాళ్లని సాదరంగా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్తాడు. వారి ప్రయాణ ఏర్పాట్లను అడిగి తెలుసుకుంటాడు. ఇంతలో సూర్యనారాయణ శ్రీలక్ష్మీని పిలిచి మీ అమ్మానాన్న వచ్చారని చెప్పడంతో ఆమె పరుగుపరుగున కిందకు వచ్చి వాళ్ల నాన్నను చుట్టేసుకుంటుంది. వాళ్లను చూసి ఆమె ఎంతో సంతోషపడుతుంది. శ్రీలక్ష్మీ వైభవం చూసి కోటేశ్వరావుతోపాటు నూకాలు కూడా ఎంతో సంతోషపడుతుంది. ఊరిలో సంగతులు అన్నీ అడిగి తెలుసుకున్న శ్రీలక్ష్మీ వాళ్ల నాన్నతో మాట్లాడుతుంది. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో సూర్యనారాయణ వాళ్లకు టీ తీసుకుని రమ్మని కబురు పంపగా...తానే వెళ్లి తీసుకొస్తానంటూ శ్రీలక్ష్మీ వెళ్లి కప్పుల్లో టీ తీసుకుని వచ్చి వాళ్లకు ఇస్తుంది.నూకాలు టీ తాగబోతుండగా...ప్రియంవద గట్టిగా అరిచి ఆపేస్తుంది. ఎవరికి ఎలాంటి కప్పుల్లో టీ ఇవ్వాలో కూడా తెలియదా అంటూ శ్రీలక్ష్మీపై మండిపడుతుంది.తమను కావాలనే అవమానిస్తున్నారని నూకాలుకు అర్థమవుతుంది. వెంటనే కలుగజేసుకున్న సూర్యనారాణ ఇంకొక మాట మాట్లాడితే సహించేది లేదని కన్న కూతురు అని కూడా చూడనని హెచ్చరిస్తాడు. నా బంధువులకు ఎలాంటి అమార్యాద తలపెట్టిన ఊరుకునేది లేదని అంటాడు. కోటేశ్వరరావుకు క్షమాపణలు చెబుతాడు. ఈ కప్పులు మనం రోజూ తాగేవని...బంధువులకు ఎంగిలి కప్పుల్లో కాకుండా కొత్త కప్పుల్లో టీ ఇవ్వమన్నానని మాట మారుస్తుంది ప్రియంవద. ఈ పంక్షన్ అయిపోయేవరకు నువ్వు నోరు తెరిచి మాట్లాడితే సహించేది లేదని సూర్యనారాయణ మరోసారి హెచ్చరిస్తారు. మేం అల్లుడిగారిని చూసి వెళ్లిపోతామని కోటేశ్వరరావు అంటే....ఈ రిసెప్షన్ ఏర్పాటు చేసింది కేవలం మా కోడలని పరిచయం చేయడానికి కాదని మిమ్మల్ని కూడా మా బంధువులకు పరిచయం చేయడానికేని మీరు ఫంక్షన్ అయిపోయే వరకు వెళ్లడానికి వీల్లేదని చెప్పి సూర్యనారాయణ ఒప్పిస్తాడు. వెళ్లి మ్యాడీని తీసుకుని రమ్మని శ్రీలక్ష్మీని పురమాయిస్తాడు.
పైన గదిలో ఉన్న మ్యాడీని తీసుకుని వచ్చేందుకు శ్రీలక్ష్మీ వెళ్లగా...అప్పటికే మ్యాడీ చీర సాయంతో కిటికీలో నుంచి కిందకు దిగి పబ్‌కు పారిపోతాడు. రూమ్‌లో మొత్తం వెతికి కిందకు వచ్చిన శ్రీలక్ష్మీ మ్యాడీ గదిలో లేడని...కిటికీలో నుంచి దూకి పారిపోయాడని చెబుతుంది.దీంతో సూర్యనారాయణకు కోపం వస్తుంది. ఇంతకు ముందు ప్రెండ్ పబ్‌కు వెళ్తానని చెప్పడం నేను విన్నానని శ్రీలక్ష్మీ అంటుంది. మ్యాడీని తీసుకొచ్చేందుకు వాళ్లిద్దరూ బయలుదేరతారు. మ్యాడీ రూమ్‌లో లేడని తెలుసుకున్న ప్రియంవద చాలా సంతోషపడుతుంది.మీరు ఎంత వెతికినా వాడు కనిపించడని...వాడు ఎక్కడికి వెళ్లాడో నాకు మాత్రమే తెలుసని సంబరపడిపోతుంది. ఇంతలో పబ్‌కు చేరుకున్న మ్యాడీ ఫుల్‌లో మందు తాగి బాధపడుతుంటాడు. మ్యాడీని వెతుక్కుంటూ పబ్‌లోకి వచ్చిన సూర్యనారాయణ, శ్రీలక్ష్మీకి అక్కడ మ్యాడీ తాగి వాగుతుండటం చూసి షాక్‌కు గురవుతారు.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు





















