Lakshimi Raave Maa Intiki Serial Today December 26th: ఆస్ట్రేలియా పారిపోదామనుకున్న సింధూ ప్లాన్ అడ్డం తిరిగిందా...? మ్యాడీ, లక్ష్మీ ఎలా ఎదురుపడతారు..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode December 26th: ఆస్ట్రేలియా పారిపోవడానికి సింధు,మ్యాడీ వేసిన ప్లాన్లు మొత్తం ప్లాప్‌అవుతాయి.చేసేది లేక తాతయ్య వెంట వాళ్లిద్దరూ ఊరికి వెళతారు.

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: సూర్యనారాయణ కుటుంబం వస్తుందని తెలిసి శ్రీలక్ష్మీ తెల్లవారుజామునే బంగ్లా వద్దకు వచ్చి పని మనుషులతో అంతా శుభ్రం చేయించి ముగ్గులు వేయిస్తుంది. దీంతో గోపీ అమెను మెచ్చుకుంటాడు. ఇంతలో గోపీ అమ్మ,చెల్లి అక్కడికి వచ్చి ఉడుక్కుంటారు. ఇంతలో వారు అక్కడికి వచ్చి ఇవాళ నీకు పెళ్లి చూపులు అవుతుంటే...నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతారు. ఆ మాటలకు గోపి లక్ష్మీకి ఇప్పుడే పెళ్లిచూపులు ఏంటని అడుగుతాడు. మంచి సంబంధం వచ్చిందని వాళ్ల అమ్మానాన్న తనకు పెళ్లి చేస్తున్నారని ఆమె చెబుతుంది. మరి నీ చదువు ఏంకావాలని గోపి అడగ్గా...పెళ్లి కొడుకు చదివిస్తానని ఒప్పుకుంటేనే పెళ్లి చేస్తానని నాన్న చెప్పారని చెబుతుంది. నీకు పెళ్లిచూపులు ఇష్టం లేకపోతే నేను వెళ్లి మాట్లాడతానని గోపి అంటాడు. దీంతో వాళ్ల అమ్మ కల్పించుకుని ఇది చాలా మంచి సంబంధం అని చెబుతుంది. తొందరగా వెళ్లి ముస్తాబు అవ్వమని చెప్పి పంపిస్తుంది.
ఆస్ట్రేలియా పారిపోవడానికి సింధూ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా....ఊరికి వెళ్లడానికి ఇంట్లో వాళ్లందరూ బయలుదేరుతుంటారు. త్రిషి ఆల్రెడీ ఇంటి వెనక గేటు వద్ద కారులో ఎదురుచూస్తుంటుంది. బట్టలన్నీ సర్దుకుని పారిపోయే సమయానికి సింధూ రాలేదని తెలుసుకుని తానే వెళ్లి పిలుచుకుని వస్తానని సూర్యనారాయణ వెళ్తాడు. అతనికి వాళ్లు దొరికిపోతారు. దీంతో మ్యాడీ, సింధూను తీసుకుని తాతయ్య కిందకు వెళ్తాడు. చేసేది లేక అందరూ కారులో ఊరికి బయలుదేరి వెళ్తారు. వెళ్లే దారిలో మ్యాడీ తప్పిస్తానని సింధూకి చెబుతాడు. త్రిషకు ఫోన్ చేసి మమ్మల్ని ఫాలో అవ్వమని చెబుతాడు. మార్గమధ్యలో మ్యాడీ కారు దారి మళ్లించండతో సూర్యనారాయణకు అనుమానం వస్తుంది.పిల్లలు వస్తున్న కారు కనిపించడం లేదని తన కారు ఆపుతాడు. వాళ్లు దారి తప్పి ఉంటారని తన కారును వెనక్కి తిప్పుతాడు. ఇంతలో సింధూ త్రిష కారులోకి షిప్ట్ అవుతుండగా...సూర్యనారాయణ అక్కడికి వస్తాడు. ఏం జరిగిందని అడుగుతాడు. దారి మర్చిపోయామని....సింధూకు వాంతులు వచ్చినట్లు ఉంటే ఇక్కడ ఆగామని మ్యాడీ అబద్ధం చెబుతాడు. దీంతో మీరు దారి తప్పుతున్నారని చెప్పి మ్యాడీని, సింధూను సూర్యనారాయణ తన కారులో ఎక్కించుకుంటాడు.
శ్రీలక్ష్మీ పెళ్లిచూపులు కావడంతో నూకాలు ఆమెను అందంగా రెడీ చేయిస్తుంది. ఇంతలో సూర్యనారాయణ వాళ్ల కార్లు ఊరిలోకి అడుగుపెడతాయి. ప్రతిఒక్కరూ ఆయనకు నమస్కారం పెడుతుంటారు. తనకు ఈ ఊరు అన్నా..ఈ పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అన్నా ఎంతో ఇష్టమని మ్యాడీకి వాళ్ల తాతయ్య చెబుతాడు. ఇంతలో సూర్యనారాయణ కారు శ్రీలక్ష్మీ వాళ్ల ఇంటి వద్దకు రాగానే ఆపమని చెబుతాడు. ఇక్కడ ఎందుకు ఆపించావ్ తాతయ్య అని మ్యాడీ అడగ్గా.. వెళ్లి పోస్ట్ మెన్ కోటేశ్వరరరావును పిలుచుకుని రమ్మని చెబుతాడు. ఆయన వల్లే మన సింధూకు ఇంత మంచి సంబంధం దొరికిందని చెబుతాడు. వెంటనే మ్యాడీ కారు దిగి లక్ష్మీ వాళ్ల ఇంట్లోకి అడుగుపెట్టబోతుంటాడు. ఇంతలోశ్రీలక్ష్మీ లోపల నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి మ్యాడీని ఢీకొట్టుకుని కిందపడిపోతుంది. మ్యాడీ కూడా ఆమెపై పడతాడు. తొలిసారి ఒకరినొకరు చూసుకుంటారు.





















