అన్వేషించండి

Kruthika Umashankar: పొదరిల్లు సీరియల్ మహాలక్ష్మి.. కృతిక ఉమాశంకర్ గురించి ఆసక్తికర విషయాలు

Kruthika Umashankar: మగువ ఓ మగువా సీరియల్‌తో ‌తెలుగు టెలివిజన్‌కు పరిచయమైన కృతిక ఉమాశంకర్.. పొదరిల్లుతో మంచి ఆదరణ పొందింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కృతిక ఉమాశంకర్ పొదరిల్లు, మగువ ఓ మగువా సీరియల్స్‌తో ప్రసిద్ధి.
  • తన సహజ నటన, హోమ్లీ లుక్స్‌తో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
  • సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, కంటెంట్ ఉన్న పాత్రలు ఎంచుకుంటుంది.

Kruthika Umashankar: పొదరిల్లు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల్ని తన నటనతో ఫిదా చేస్తుంది హీరోయిన్ కృతిక ఉమాశంకర్. కర్ణాటకకి చెందిన కృతిక స్టార్ మాలో ప్రసారమవుతున్న 'మగువ ఓ మగువా' సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయింది. ఇందులో సింధూర క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది. ఈ సీరియల్ నడుస్తుండగానే పొదరిల్లు సీరియల్‌లో హీరోయిన్ అయిన మహాలక్ష్మి పాత్ర ఛాన్స్ వచ్చింది. తన సహజసిద్ధమైన నటనతో, హోమ్లీ లుక్స్‌తో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె రియల్ లైఫ్, కెరీర్, సోషల్ మీడియా, ఇతర ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.

రియల్ లైఫ్

కృతిక పుట్టి పెరిగింది, చదువుకుంది అంతా బెంగళూరులోనే. ఆమెకు చిన్నప్పటి నుండి యాక్టింగ్, కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. చదువు పూర్తి కాగానే మోడలింగ్, కన్నడ ఇండస్ట్రీ ద్వారా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. షూటింగ్స్ కోసం ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరుల మధ్య ప్రయాణిస్తూ ఉంటుంది.

Also Read: బుల్లితెరపై విలన్ రోల్స్.. ఫేమస్ సీరియల్ ముకుంద.. యష్మీ గౌడ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

సీరియల్ కెరీర్

కృతికా కన్నడ టెలివిజన్ పరిశ్రమ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. అయితే, తెలుగు బుల్లితెర ఆమెకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న 'పొదరిల్లు' సూపర్ హిట్ సీరియల్‌లో 'మహాలక్ష్మి' అనే లీడ్ క్యారెక్టర్‌లో కృతిక నటించింది. ఒక మధ్యతరగతి అమ్మాయిగా, బాధ్యత గల భార్యగా ఆమె చేసిన నటన మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. మగువ ఓ మగువా సీరియల్‌లో 'సింధూర' అనే కీలకమైన పాత్రలో నటించి మెప్పించింది. ఎమోషనల్ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ డ్రామాలను పండించడంలో కృతిక తనదైన శైలిని చూపిస్తూ తెలుగులో బిజీ నటిగా మారింది.

సోషల్ మీడియా ఫాలోయింగ్

కృతికా ఉమా శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సీరియల్ సెట్స్ నుంచి తెరవెనుక జరిగే ఫన్నీ వీడియోలు, రీల్స్, ఫొటోలను తరచూ షేర్ చేస్తుంటుంది. సంప్రదాయ దుస్తులలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. కో-స్టార్స్‌తో కలిసి చేసే ట్రెండింగ్ రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

Also Read: మెగాస్టార్ 'పసివాడి ప్రాణం'లో చైల్డ్ ఆర్టిస్ట్.. సీరియల్ 'వదినమ్మ'.. మల్టీటాలెంటెడ్ సుజిత గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

రెమ్యూనరేషన్

టెలివిజన్ పరిశ్రమలో నటీనటుల రెమ్యూనరేషన్ అనేది వారి సీరియల్ రేటింగ్, డిమాండ్, రోజువారీ కాల్షీట్లను బట్టి మారుతుంటుంది. లీడ్ రోల్స్ చేస్తున్న కృతిక ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై క్రేజ్ ఉన్న నటి కావడంతో, ఆమెకు రోజుకు సుమారు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు పారితోషికం అందుతుందని ఇండస్ట్రీ టాక్.

ఆసక్తికర అంశాలు

కన్నడ అమ్మాయి అయినప్పటికీ, తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్నప్పుడు భాషను అర్థం చేసుకుని, డైలాగ్స్ ఎక్స్‌ప్రెషన్స్‌ను పర్ఫెక్ట్‌గా పలికేందుకు ఆమె చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇంటర్వ్యూలలో ఆమె మాట్లాడే విధానం చాలా సరళంగా, హుందాగా ఉంటుంది. గ్లామర్ పాత్రల కంటే కంటెంట్ ఉన్న, ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలకే ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కృతికకు రకరకాల వంటకాలను రుచి చూడటం, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.

Also Read: నువ్వు లేక నేను లేను సీరియల్ రాధ.. ఆ యాక్టర్ అంటే చాలా ఇష్టం.. బెంగాల్ భామ నిషా రియల్ లైఫ్ విషయాలు

Frequently Asked Questions

తెలుగు ప్రేక్షకులకు కృతిక ఉమాశంకర్ ఎలా పరిచయం అయ్యారు?

కృతిక ఉమాశంకర్ 'మగువ ఓ మగువా' సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యారు. 'పొదరిల్లు' సీరియల్‌లో మహాలక్ష్మి పాత్రతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

కృతిక ఉమాశంకర్ సొంత ఊరు ఏది? ఆమె ఎక్కడ పెరిగారు?

కృతిక ఉమాశంకర్ కర్ణాటకకు చెందినవారు. ఆమె పుట్టి పెరిగింది, చదువుకుంది అంతా బెంగళూరులోనే.

తెలుగు బుల్లితెరపై కృతిక నటించిన మొదటి సీరియల్ ఏది?

స్టార్ మాలో ప్రసారమైన 'మగువ ఓ మగువా' సీరియల్‌లో సింధూర క్యారెక్టర్‌లో నటించి కృతిక తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget