Krishna Mukunda Murari Serial Today May 2nd : కృష్ణ ముకుంద మురారి సీరియల్: సరోగసి కోసం రచ్చచేస్తా అంటూ అడ్డంగా బుక్కైన ముకుంద.. భవాని మాటలకు కుమిలిపోయిన కృష్ణ!
Krishna Mukunda Murari Serial Today Episode : కృష్ణ నెల తప్పిందని అందరూ సంతోషంగా ఉండటం చూడలేకపోయిన ముకుంద సరోగసీ కోసం చెప్పాలని ఓ మహిళను ఇంటికి రప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode : కృష్ణ నెల తప్పిందని భవాని ఫంక్షన్ ఏర్పాటు చేసి సందడి చేస్తుంది. అందరూ కృష్ణని దీవిస్తారు. ఇక ముకుంద వచ్చి కృష్ణకు కంగ్రాట్స్ చెప్తుంది. తర్వాత మురారి దగ్గరకు వెళ్తుంది. మురారికి కూడా కంగ్రాట్స్ చెప్తుంది.
ముకుంద: సారీ మురారి గారు మీరు ఏ పరిస్థితిలో ఇలా ఉన్నారో నాకు అర్థమవుతుంది. అందుకే మీతో పాటు నేను నటించాల్సి వస్తుంది. మీ కళ్లల్లో ఆనందం చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. మేడం, మీరు ఇంత సంతోషంగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. దీనంతటికి కారణం మీ కృష్ణే. చూడండి ఎంత ముద్దొస్తున్నారో నా దిష్టే తగిలేలా ఉంది.
సంగీత: అత్తయ్య.. అత్తయ్య కృష్ణ అక్క దిష్టి పోయేలా నేను ఓ పాట పాడనా.
రజిని: ఏంటే నువ్వు నీ ముఖం పాడేది.
భవాని: తను సరదాగా పాడుతా అంటే ఎందుకు అడ్డుకుంటావ్. నువ్వు పాడు సంగీత. డ్యాన్స్ కూడా చేయ్.
సంగీత డ్యాన్స్ చేస్తుంది. మధు కూడా జాయిన్ అవుతాడు. తర్వాత సంగీత అందరితో స్టెప్పులేయిస్తుంది. మరోవైపు ముకుంద వీళ్లు ఇంత సంతోషంగా ఉండకూడదు అనుకొని పక్కకెళ్లి ఓ ఫోన్ చేసి తన ప్లాన్ చెప్తుంది.
ముకుంద మురారిని చూసి నీ బాధ నాకు అర్థమవుతుంది మురారి.. అందుకే కాసేపట్లో ఇక్కడ అందరి సంతోషం నాశనం చేయబోతున్నా అనుకుంటుంది. ఇంతలో ఒకామె వచ్చి ఇక్కడ సరోగసీ మదర్ కావాలని అడిగారు మాట్లాడుదాం అని వచ్చానని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. కృష్ణ భయంతో పైకి లేస్తుంది. కృష్ణ, మురారిలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు.
కృష్ణ: అసలు సరోగసీ మదర్ ఎవరో చెప్పకూడదు అని డాక్టర్ చెప్పారు కదా మరి డైరెక్ట్‌గా ఇంటికే పంపేసింది ఏంటి.
భవాని: సరోగసీ ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.
లేడీ: అదే మేడం ఏదైనా కారణం వల్ల పిల్లలు కనలేకపోతే గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు.
భవాని: అది నాకు తెలుసు. కానీ ఇక్కడ ఆ అవసరం ఎవరికి ఉంది.
సరస్వతి: నీ కోడలే రమ్మని చెప్పిందేమో. అదే భవాని నీ కోడలికి పిల్లలు కనే అవకాశం లేక సరోగసీకి ప్లాన్ చేసిందేమో.
భవాని: అంత అవసరం మాకు ఏముంది. మా కోడలు ఆల్రెడీ నెల తప్పింది కదా.
రేవతి: అసలు ఎక్కడికి వెళ్లాలని ఎక్కడికి వచ్చావ్. నీకు ఈ అడ్రస్ ఇచ్చింది ఎవరు.
ముకుంద: ఇంకా ఎక్కువ సేపు ఉంటే దొరికిపోయేలా ఉంది.
సరస్వతి: ఏయ్ కృష్ణ ఈమెను నువ్వే రమ్మన్నావు కదా. నెలతప్పినట్లు మీ అత్తయ్యని మభ్యపెట్టి సరోగసి ద్వారా పిల్లల్ని కనాలి అనుకుంటున్నావ్ కదా.
ముకుంద: ఏం మాట్లాడుతున్నారండి. ఇక్కడ నెల తప్పిన ఫంక్షన్ జరుగుతుంటే నువ్వొచ్చి సరోగసీ అంటున్నావ్ ఏంటి. ఏదీ అడ్రస్ ఇలా ఇవ్వు. అని పేపర్ మీద అడ్రస్ చూసి రాంగ్ అడ్రస్ అని ఆమెను పంపేస్తుంది. పాపం కృష్ణ కుప్పకూలిపోతుంది.
భవాని: మా మూడ్ అంతా పాడు చేశావ్ వెళ్లు ఇక్కడి నుంచి. థ్యాంక్స్ ముకుంద సమయానికి నువ్వు అడ్రస్ చూసి మంచి పని చేశావ్.
కృష్ణ: ఏంటి ఏసీపీ సార్ తెగ ఆలోచిస్తున్నారు. ఇంకా మీ పోలీస్ బుర్రకి తట్టలేదా. అదే సరోగసీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నారా..
మురారి: నేను ఆవిడ గురించి ఎందుకు ఆలోచిస్తాను. కానీ తాను నిజంగానే నీ గురించి వచ్చి పెద్దమ్మకు నిజం తెలిసిపోయి ఉంటే ఎలా ఉండేదా అని ఆలోచిస్తున్నా.
కృష్ణ: అయినా ఈ వీధిలో ఇన్ని ఇళ్లు ఉండగా మన ఇంటికి ఎందుకు వచ్చింది.
మురారి: అది యాదృచ్చికంగా. అయినా సరోగసీ మదర్ గురించి సీక్రెట్‌గా ఉంచుతా అన్నారు కదా ఆవిడ రావడం ఏంటి.
కృష్ణ: కదా నేను అదే అడుగుతున్నా ఏసీపీ సార్. మన విషయంలోనే కాదు వేరు ఎవరి విషయంలో కూడా అలా వెళ్లకూడదు కదా. ఏసీపీ సార్ నాకు ఎవరో కావాలనే పంపించారు అనిపిస్తుంది. మన గురించి నిజం తెలుసుకొని మనచేత నిజం చెప్పించాలని మనల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరో ఇలా చేయొచ్చు.
కృష్ణ మాటలతో మురారి ఆలోచనలో పడతాడు. ముకుందకు నిజం తెలుసని ఆ దిశగా ఆలోచిస్తాడు. ఇక ఎంత ఆలోచించినా తనకు తట్టడం లేదని నీకు ఏమనిపిస్తుందని కృష్ణని అడుగుతాడు.
కృష్ణ: సరోగసీ గురించి మీకు నాకు డాక్టర్ వైదేహికి తెలుసు. డాక్టర్‌తో మన ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి తనకి ఇలాంటి వారిని ఇంటికి పంపాల్సిన అవసరం లేదు. కానీ మన ఫ్యామిలీ అంటే పడని వాళ్లు ఎవరో వైదేహి ద్వారా తెలుసుకొని ఇలా చేసుంటారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన వారు ఏంటంటే మన ఫ్యామిలీ అంటే పడని వారు వైదేహికి క్లోజ్‌గా ఉన్నారా అని.
మురారి: ముకుంద గురించి ఆలోచిస్తూ కచ్చితంగా తెలుసుకుంటా కృష్ణ.
మరోవైపు భవాని సరోగసీ మదర్ కోసం వచ్చిన ఆ అమ్మాయి మాటలు తలచుకొని బాధ పడుతుంది. రేవతితో ఆ విషయం చెప్తూ ఆ మాటలు వినడం ఏదోలా అనిపించిందని అంటుంది. వాళ్ల మాటలు కృష్ణ వింటుంది. అత్తయ్య మనసు మార్చాలి అని వెళ్లి మాట్లాడుతుంది.
కృష్ణ: కొంత మంది అంతే అత్తయ్య ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలీదు.
భవాని: ఎవరి గురించి మాట్లాడుతున్నావ్.
కృష్ణ: అదే అత్తయ్య సరోగసీ అని వచ్చి మీకు మనశ్శాంతి లేకుండా చేసింది కదా ఆవిడ గురించి. అసలు సరోగసీ అంటే ఎంత సీక్రెట్‌గా ఉంచుతారో తెలుసా పెద్దత్తయ్య. ఇటు అసలు తల్లిదండ్రులకు గానీ అటు కడుపులో మోసే వారికి గానీ తెలీకుండా ఉంచుతారు.
భవాని: అవును కదా. కానీ నిజంగానే నువ్వు సరోగసీకి వెళ్లావేమో అని నా గుండెలో రాయి పడింది తెలుసా.
భవాని తొమ్మిది నెలలు మోసి కన్న పేగు తెంచుకొని పుట్టే బిడ్డ తోనే మంచి అనుబంధం ఉంటుందని అంటుంది. భవాని మాటలకు కృష్ణ చాలా బాధ పడుతుంది. జాగ్రత్తలు చెప్తుంది. దీంతో బాధగా కృష్ణ వెళ్లిపోతుంది. మరోవైపు మురారి ముకుందతో మాట్లాడాలని పిలుస్తాడు. దీంతో ముకుంద టెన్షన్ పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.