Karthika Deepam 2 Serial Today May 2nd: కార్తీకదీపం 2 సీరియల్ : దీపతో పాటు అనసూయని ఇంటికి తీసుకొచ్చిన కార్తీక్.. దీపతో చాలా పెద్ద తప్పు చేశావన్న సుమిత్ర!
Karthika Deepam 2 Serial Today Episode : సిటీకి వచ్చిన అనసూయ రోడ్డు మీద దీప, కార్తీక్‌లను కలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీపని కావాలనే ఇంటి నుంచి పంపేశారని పోలీస్ సుమిత్ర వాళ్లని ప్రశ్నిస్తాడు. దీంతో కార్తీక్ వచ్చి దీప ఎక్కడికి వెళ్లిందో తనకు తెలుసని తీసుకొని వస్తా అని వెళ్తాడు. ఇక సుమిత్ర దీపని మళ్లీ ఏమైనా అన్నారా అని పారిజాతాన్ని ప్రశ్నిస్తుంది.
జ్యోత్స్న: చెప్పకుండా వెళ్లి మిస్టేక్ చేసింది దీప అయితే నువ్వు గ్రానీని అడుగుతున్నావ్ ఎందుకు మమ్మీ. వెళ్లిపోయేటప్పుడు ఎవరితో అయినా చెప్పకపోయినా నీతో చెప్పాలి కదా. నా విషయంలో అవసరం లేకపోయినా మందుకు వచ్చి మరి సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు తన అవసరం కాబట్టి చెప్పకుండా వెళ్లిపోయింది.
సుమిత్ర: చెప్పుకోలేని ఇబ్బంది తనకి ఏం వచ్చిందో.
జ్యోత్స్న: అంత చెప్పకోలేని విషయం అయితే మనకు తెలీని విషయం బావకు ఎలా తెలుస్తుంది. పోనీ శౌర్య చెప్పింది అనుకుంటే వాళ్ల దగ్గర మొబైల్ లేదు కదా. మన ఇంట్లో ఉన్న మనిషి గురించి వేరు ఇంట్లో ఉన్న బావకి తెలిసింది కానీ మనకు తెలీలేదు. తీసుకొస్తాను అన్నాడు అంటే దీప, శౌర్యలు ఎక్కడున్నారో బావకి తెలుసు అన్నట్లే కదా. అంటే బావకి వాళ్లు వెళ్లిపోవడం తెలుసు.. ఎక్కడున్నారో కూడా తెలుసు.
సుమిత్ర: మనసులో.. దీప చెప్పకుండా వెళ్లిపోయి చాలా పెద్ద తప్పు చేశావ్. ఎక్కడున్నావ్.
మరోవైపు దీప వాళ్లు ఆటో ఎక్కుతుండగా కార్తీక్ వస్తాడు. అర్జెంటుగా ఇంటికి రావాలి అని అంటాడు. దీప రాను అంటే ఇంటికి పోలీసులు వచ్చారు. గొడవ జరుగుతుందని జరిగింది చెప్తాడు. ఇక దీప కార్తీక్‌కు ఎందుకు చెప్పావని అడుగుతుంది. కార్తీక్‌ను సూటిపోటి మాటలు అంటుంది. ఇక కార్తీక్ వాళ్లని రమ్మని మళ్లీ ఇక్కడే డ్రాప్ చేస్తా అంటాడు. దీంతో దీప కారు ఎక్కుతుంది. కారులో వెళ్తూ శౌర్య తన నానమ్మ అనసూయని చూస్తుంది.
దీప అత్తయ్య అంటూ దగ్గరకు వెళ్తుంది. శౌర్య కూడా నానమ్మ నా కోసమే వచ్చావా అని అడుగుతుంది. మరోవైపు కార్తీక్‌కు ఇంటి నుంచి వరస ఫోన్లు వస్తే కార్తీక తొందరగా ఇంటికి వెళ్లాలి అంటాడు. దీంతో కార్తీక్ దీప వాళ్లని ఇంటికి వెళ్దామంటాడు. దీప తన అత్త కూడా వస్తానని అంటుంది.
అనసూయ: తనలో తాను.. దీప ఏంటి కార్లతో తిరుగుతుంది. అతను ఎవరు శౌర్య ఏంటి పేరు పెట్టి పిలుస్తుంది.
దీప: ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు అత్తయ్య.
అనసూయ: రెండు రోజులు అవుతుంది. రాత్రి రోడ్డుమీద పడుకుంటే ఎవడో నా కొంగుకున్న డబ్బులు కొట్టేశాడు. మంచి నీరు కొనుకోవడానికి కూడా రూపాయి లేదు. ఆ మల్లేశ్ ఐదు రూపాయల వడ్డీకి ఇచ్చాడు ఆ డబ్బు పోయింది.
శౌర్య తన నానమ్మకు సైకిల్ గురించి అడుగుతుంది. అమ్మేశాను అని అనసూయ చెప్పడంతో శౌర్య నానమ్మని ప్రశ్నిస్తుంది. కార్తీక్ అన్నీ వింటున్నాడు అని దీప కూతురు, అత్తయ్య ఇద్దరినీ మాట్లాడొద్దని అంటుంది.
అందరూ దీప కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీప వాళ్లు ఇంటికి వస్తారు. బంగ్లాను చూసి అనసూయ ఇది నన్ను ఎక్కడికి తీసుకొచ్చిందని అనుకుంటూ ఉంటుంది.
అనసూయ: ఇక్కడ పోలీసులు ఉన్నారేంటే..
దీప: నాకోసమే వచ్చారు.
అనసూయ: నీ కోసమా ఏం చేశావే..
దీప: మీరు ఏం మాట్లాడకుండా నాతో రండి.
కార్తీక్: దీపని తీసుకొచ్చాను.
పారిజాతం: ఇదే ఎక్స్‌ట్రా అనుకుంటే ఇంకో కాండిడేట్‌ని తీసుకొచ్చిందేంటి.
సుమిత్ర: నిన్ను ఎక్కడికీ వెళ్లొద్దని చెప్పానా లేదా. నీకు అర్థం కాలేదా. లేదా నా మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటున్నావా. ఎవరికి చెప్పి వెళ్లావ్.. మీరు బాధ్యత తీసుకున్న మనిషి మీకు చెప్పకుండా వెళ్లిపోతుందా అని అడుగుతున్నారా ఆయనకు ఏం సమాధానం చెప్పాలి.
అనసూయ: మనసులో.. ఇదెవరురా బాబు నా కంటే గట్టిగా మాట్లాడుతుంది. ఈ పోలీసులు ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. ఏం అర్థమవ్వడం లేదు. అయినా దీపని పట్టుకొని సొంత మనిషిలా మాట్లాడుతున్నారేంటి.
పోలీస్: ఏం దీప మేడం మీ మీద చూపిస్తున్న కోపం నిజమేనా.. లేదా మేడం గారే నిన్ను వెళ్లి పోమని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా.. మేడం గారు ఇన్ని మాట్లాడినా దీప ఏం మాట్లాడటం లేదు అంటే దీప వెళ్లిపోవడం వెనక ఎవరో ఉన్నారు. ఏం దీప నేను చెప్పింది నిజమే కదా. నిన్ను వెళ్లిపోమన్న ఆ మనిషి ఎవరు.
పారిజాతం: నేనే అని ఆ దీప చెప్పేస్తుందా.
దీప: నన్ను ఎవరూ వెళ్లిపోమని చెప్పలేదు. నేనే వెళ్లిపోవాలి అనుకున్నాను.
పోలీస్: అలా ఇంకెప్పుడూ అనుకోకు.
ఇక రౌడీని చూసి దీప తాను కాదు అని చెప్తుంది. ఇక కార్తీక్ పోలీసుల మీద ఫైర్ అవుతాడు. వారం రోజుల్లో అటాక్ చేసిన వాడిని తీసుకొస్తానని అంత వరకు దీప బాధ్యత మీదే అని పోలీసులు అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: పెద్దబొట్టమ్మ మీదకు కారం చల్లిన సుమన.. పోలీసన్నను కాటేసిన పాము!