అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Krishna Mukunda Murari Serial Today May 21st : కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద మాటలకు కళ్లు తిరిగి పడిపోయిన కృష్ణ.. ముకుంద మీరా ఒక్కరేనా? మురారి, కృష్ణలలో అనుమానం! 

Krishna Mukunda Murari Serial Today Episode : ముకుంద ప్రవర్తనను అనుమానించి.. ముకుంద ప్రవర్తన మీరా ప్రవర్తన ఒకటే అని కృష్ణ, మురారి అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode : అందరూ భోజనాలు చేస్తుంటారు. కృష్ణ, మురారి కూడా వస్తారు. పొద్దున్న వెళ్లి ఇంత లేట్‌గా వచ్చారు ఎక్కడికి వెళ్లారని భవాని అడుగుతుంది. కృష్ణని బయట తిప్పినందుకు మురారిని తిడుతుంది. ఇక కృష్ణకు భోజనం చేయమని చెప్తుంది. అందరూ కింద కూర్చొంటారు. కృష్ణ ప్రెగ్నెంట్ అని తనకు ప్రత్యేకంగా కుర్చీ వేయించి పైన తినమని చెప్తుంది. 

ముకుంద చేసిన పనికి కృష్ణకు నోటికి ముద్దు కూడా వెళ్లదు. కానీ అందరూ బలవంతం చేయడంతో తినడానికి కూర్చొంటుంది. ఇంతలో కృష్ణ పొలమారుతుంది. ముకుంద హడావుడిగా నీరు తీసుకొని కృష్ణకు తాగిస్తుంది.

ముకుంద: గర్భం తీసేశాను అని ఇక పెళ్లి ఆపాల్సిన పని లేదు అని రిలాక్స్ అయిపోతారేమో. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలా అయినా మీరే ఈ పెళ్లి ఆపాలి. ఆపలేదు అనుకో నీ విషయం మొత్తం చెప్పేస్తా. 

ముకుంద మాటలకు కృష్ణ కళ్లు తిరిగి పడిపోతుంది. అందరూ కంగారు పడి కృష్ణ దగ్గరకు వచ్చి లేపుతారు. భవాని డాక్టర్‌కి కాల్ చేయమని అంటుంది. మురారి వద్దు అంటాడు. దీంతో రేవతి కూడా మురారిని తిడుతుంది. ప్రెగ్నెంట్ అని అలా ఎలా వద్దు అంటావ్ అని అడుగుతుంది. ఇక భవాని మురారి ఫోన్ తీసుకొని డాక్టర్‌కి కాల్ చేస్తుంది. కానీ ఫోన్ అవ్వదు. 

ముకుంద: ఇప్పుడు డాక్టర్ వస్తే నిజం బయట పడిపోతుంది. 

మురారి: డాక్టర్ ఇంటికి వస్తే నిజం చెప్పేస్తారు కదా. అని నీరు కృష్ణ ముఖం మీద చల్లితే కృష్ణ లేస్తుంది. 

భవాని: సరే సరే పద హాస్పిటల్‌కి వెళ్దాం.

కృష్ణ: అయ్యో అవసరం లేదు పెద్దత్తయ్య. ఇప్పుడు బాగానే ఉంది. అయినా ఇది గర్భవతులకు మామూలే. అందరూ భోజనం చేయండి. కూర్చొండి పెద్దత్తయ్య. 

కృష్ణ: మన బిడ్డను తీసేసింది. అయినా గుండె దిటువు చేసుకొని ఆదర్శ్‌ పెళ్లి ఆపాల్సిన అవసరం లేదు అనుకుంటే మళ్లీ పెళ్లి ఆపమని అంటుందేంటి. 

మురారి: తనకి ఆదర్శ్‌ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కృష్ణ. ముందే చెప్పాను కదా. ఆదర్శ్‌ మీద మీరా మనసు మార్చడం జరగని పని. నా బాధ అంతా ఆదర్శ్‌ కోసమే. వాడు మీరా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కదా. తను కాదు అంటుంది అని తెలిస్తే ఏమైపోతాడో. అప్పుడు ముకుంద, ఇప్పుడు మీరా.. వాడికే ఎందుకు ఇలా అవుతుంది. 

కృష్ణ: మీరా కడుపులో మన బిడ్డ లేదు కదా ఏసీపీ సార్ ఇప్పుడు కొన్ని డౌట్లు అడుగుతాను. ఊరికే పనికి మాలిన డౌట్లు అని కొట్టి పడేయకండి. బాగా ఆలోచించి చెప్పండి. అసలు మీరాకు మన కుటుంబానికి సంబంధం ఏంటి. 

మురారి: ఏం లేదు. తను ఎవరో ముకుంద ఫ్రెండ్ అంతే. 

కృష్ణ: కదా. మిమల్ని ముకుంద తండ్రి అరెస్ట్ చేయిస్తే హోం మినిస్టర్‌తో మాట్లాడి విడిపించింది. తర్వాత అనాథ అని చెప్తే పెద్దత్తయ్య ఇంట్లో చోటిచ్చింది. హ్యాపీగా ఆదర్శ్‌ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోవచ్చు కదా ఏంటి ప్రాబ్లమ్. ఆలోచించండి ఏసీపీ సార్. తనకి ఈ ఇంట్లో స్థానం దక్కడమే ఎక్కువ. అలాంటిది కోడలు అయ్యే అవకాశం వస్తుంటే ఎందుకు కాదు అనుకుంటుంది. ఒక వేళ తను ఎవరినైనా ఇష్టపడింది అనుకుంటే అతని బిడ్డను మాత్రమే మోయాలి అనుకుంటుంది. ఇలా సరోగసీకి ఒప్పుకోదు. సరే అది తన ఇష్టం. ఆదర్శ్‌ అస్సలు నచ్చలేదు అనుకుందాం. ఆ మాట పెద్దత్తయ్యతోనో, ఆదర్శ్‌తోనో చెప్పేయొచ్చు కదా. ఒక్క మాటతో అయిపోతుంది కదా. మనల్ని ఎందుకు అడ్డు పెట్టుకొని పెళ్లి ఆపాలి అని చూస్తుంది. 

మురారి: ఇదీ పాయింటే.

కృష్ణ: అసలు పాయింట్ ఇదే ఏసీపీ సార్. మన మీద డామినేషన్ ఏంటి. మనకు చెప్పకుండా బిడ్డను మోసింది. మనకు చెప్పకుండా తీసేసింది. అంతా తన ఇష్టానికి చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తుందో నాకు అయితే అర్థం కావడం లేదు. 

మురారి: ఆలోచిస్తుంటే నాకు నువ్వు చెప్పేది నిజం అనిపిస్తుంది. పైగా నీకు బిడ్డ లేదు అని చెప్పేస్తా అంటుంది. నువ్వు చెప్తున్నట్లు తనలో తెలీని కోణం ఏదో ఉంది. ఇదంతా అనుకోకుండా జరుగుతున్నట్లు లేదు. ఓ ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఒక మనిషి మీద అనుమానం రావడమే ఆలస్యం కృష్ణ ఈ రోజు నుంచి తన మీద నిఘా పెడదాం. 

మరోవైపు అందరూ హాల్‌లో కూర్చొని ఉంటారు. భవాని చీరలు తెప్పించి అందరి కోసం సెలక్ట్ చేసుకోమని చెప్తుంది. ముకుంద డల్‌గా ఉంటుంది. ఆదర్శ్, ముకుంద కోసం చీర సెలక్ట్ చేస్తాడు. ముకుంద నవ్వుతూ సరదాగా ఉంటే కృష్ణ, మురారి చూసి బాగా నటిస్తుందని అనుకుంటారు. 

కృష్ణ: మనసులో.. కొంచెం ఓపిక పట్టవే నీ అసలు రంగు ఏంటో తెలిశాక ఏం చేయాలో మేం డిసైడ్ చేస్తాం. 

ఇక మురారిని భవాని పిలిచి కృష్ణ కోసం చీర సెలక్ట్ చేయమని అంటుంది. రేవతి ఆదర్శ్‌ పెళ్లి కోసం ఒకటి సీమంతం కోసం ఒకటి తీసుకోమని అంటుంది. ఇక ముకుంద మురారి సెలక్ట్ చేసిన చీర ఎలా అయినా తీసుకోవాలి అంటుంది. ఇక మురారి ఓ చీర సెలక్ట్ చేసి కృష్ణకు ఇచ్చే టైంలో ముకుంద లాక్కొని ఆ చీర తనకు నచ్చిందని తీసుకుంటానని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. 

మురారి: మీరా మనతో ఆడుకుంటుంది కృష్ణ. నీకోసం సెలక్ట్ చేసిన చీర తను తీసుకోవడం ఏంటి. 

కృష్ణ: ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి తనెప్పుడు అది కావాలి ఇది కావాలి అని అడిగిందే లేదు. మొన్న ఆదర్శ్‌ చీర కొనే వరకు పెద్దత్తయ్య కొన్న చీరలతోనే అడ్జస్ట్ అయింది. అలాంటిది ఇప్పుడు మీరు సెలక్ట్ చేసిన చీర మీద ఎందుకు మనసు పారేసుకుందో నాకు అర్థం కాలేదు.

మురారి: నాకు అదే అర్థం కావడం లేదు కృష్ణ. ఆ లాక్కోవడం చూస్తుంటే చీర మీద ఇష్టంతో కాదు నీకు దక్కకూడదు అని ఆలోచనతోనే లాక్కున్నట్లు అనిపించిది.

కృష్ణ: ఇది కరెక్ట్ ఏసీపీ సార్. అసలు ఈ పెళ్లి అంటే ఇష్టం లేనిది మంగళ స్నానాల కోసం చీర ఎందుకు. తను చేసే ప్రతి పని వెనక మనకు తెలీని ఏదో ఒక అజెండా కనిపిస్తుంది.

మురారి: నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఆరోజు నన్ను కాపాడటం వల్ల ఇంటికి వచ్చింది అనుకున్నాం కానీ అసలు విషయం అది కాదు. ఇంటికి రావడం కోసం నన్ను కాపాడిందేమో అని నన్ను అనిపిస్తుంది. అసలు ఆ సమస్యకు తనే కారణమా..

కృష్ణ: గుర్తు తెచ్చుకుంటుంటే తన ప్రతీ కదలిక వెనక అనుమానం కనిపిస్తుంది. ఏసీపీ సార్ ఒకప్పుడు ముకుంద ఎలా ప్రవర్తించిందో మీరా కూడా అలాగే ప్రవర్తిస్తుంది. 

మురారి: ఆలోచిస్తూ ఉంటే అసలు తన టార్గెట్ నువ్వా, నేనా లేక మన బిడ్డా లేక మన కుటుంబమా.. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్ : రేపే తిలోత్తమకు మృత్యువు.. సర్ప దీవిలో తిలోత్తమను చంపేది గాయత్రీ పాపేనా! నయని అడ్డుకుంటుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Devaki Nandana Vasudeva: మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే డిజాస్టర్ టాక్, షోస్ క్యాన్సిల్
మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే డిజాస్టర్ టాక్, షోస్ క్యాన్సిల్
Crime News: గుర్తు తెలియని యువతి నుంచి వీడియో కాల్ - కూల్‌గా మాట్లాడి కొంపముంచింది, చివరకు!
గుర్తు తెలియని యువతి నుంచి వీడియో కాల్ - కూల్‌గా మాట్లాడి కొంపముంచింది, చివరకు!
Hindu Temples: దేవుడు ప్రతిచోటా ఉన్నాడు కదా..ఆలయాలకు ఎందుకు వెళ్లాలి - వెళ్లకపోతే భక్తి లేనట్టేనా!
దేవుడు ప్రతిచోటా ఉన్నాడు కదా..ఆలయాలకు ఎందుకు వెళ్లాలి - వెళ్లకపోతే భక్తి లేనట్టేనా!
Embed widget