అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today May 15th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: అందరి ముందు ముకుందకు గిఫ్ట్ ఇచ్చిన ఆదర్శ్‌, త్వరలో పెళ్లి.. జుట్టు పీక్కుంటున్న కృష్ణ, మురారి!

Krishna Mukunda Murari Serial Today Episode : ముకుంద ఆదర్శ్‌తో పెళ్లికి పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వడంతో మురారి, కృష్ణ ముకుందని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode  : భవాని రేవతి, కృష్ణలను పిలిచి ఆదర్శ్‌, ముకుందల పెళ్లి గురించి చెప్తుంది. దీంతో రేవతి వీలైనంత తొందరగా పెళ్లి చేసేద్దామని అంటుంది. ఇక కృష్ణ వద్దు అని కంగారుగా చెప్తుంది. రేవతి కృష్ణకు కారణం అడుగుతుంది.

భవాని: వాళ్లిద్దరికి పెళ్లి అనగానే పక్కనే బాంబు పేలినట్లు అంత ఉలిక్క పడ్డావు. నీ ముఖంలో ఏదో కంగారు ఏమైంది తింగరి.

కృష్ణ: ఏం లేదు పెద్దత్తయ్య వాళ్ల ఇష్టాఇష్టాలు తెలుసుకోకుండా మనం ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదేమో అని.

భవాని: నీ ముఖం చూస్తే అలా అనిపించడం లేదు. ఏదో నా కళ్లలోకి చూసి ఆ మాట చెప్పు. 

కృష్ణ: అంతే అత్తయ్య ఇంకేం లేదు. ఆదర్శ్ ఒక్కడే ఇష్టపడితే సరిపోదు కదా.. మీరాకి కూడా ఇష్టం ఉండాలికదా.

భవాని: ఇష్టం లేకుండానే ఆదర్శ్‌తో అంత చనువుగా ఉంటుంది.

రేవతి: పొద్దున్న కృష్ణకు పెట్టే ఫుడ్ తనకి కావాలి అంటే ఆరోజులు నీకు ముందు ఉన్నాయి అంటే ఆదర్శ్‌ని చూసి సిగ్గు పడింది. అంటే ఇష్టం ఉన్నట్లే కదా. ఎప్పుడెప్పుడు పెళ్లి చేస్తారా అని ఇద్దరూ ఎదురు చూస్తున్నారు.

కృష్ణ: అంటే అప్పుడు ముకుందతో కూడా ఇలాగే అనుకొని పెళ్లి చేశాం కదా. అందుకే ఈ సారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది అత్తయ్య.

భవాని: ఇంకేం అవసరం లేదు. ఆ అమ్మాయిని ఈ ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి కనిపెడుతున్నా నీకు ఎన్ని అర్హతలు ఉన్నాయో ఆ అమ్మాయికి అన్ని ఉన్నాయి. ఇక నుంచి అంతా మంచే జరుగుతుంది నువ్వేం ఆలోచించకుండా ఉండు. 

మురారి: ఎందుకు ఏడుస్తున్నావ్ కృష్ణ. ఇప్పుడు ఏమైంది.  కృష్ణ జరిగింది చెప్తుంది. 

కృష్ణ: ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతుంది ఇప్పుడేం చేద్దాం ఏసీపీ సార్.  

మురారి: మనసులో.. మీరాని, ఆదర్శ్‌ని ఎలాగోలా మ్యానేజ్‌ చేయమని అంటే పెద్దమ్మ ఏకంగా పెళ్లే అంటుంది. ఇలా జరుగుతుందని కొంచెం అనుమానం వచ్చినా ముందే కృష్ణకు చెప్పేసేవాడిని. ఇప్పుడేం చేయాలి. కృష్ణ టెన్షన్‌గా ఉంది. మన బిడ్డ సమస్యకు సరోగసి పరిష్కారం అనుకుంటే ఇప్పుడు మరో సమస్య. 

కృష్ణ: మనం తీసుకున్న నిర్ణయం కరెక్టే ఏసీపీ సార్. కానీ ఎంచుకున్న మనిషి కరెక్ట్ కాదు. మీరా కనుక ఈ పెళ్లి తనకు ఇష్టం లేదు అని ఒక్క మాట చెప్తే చాలు ఏసీపీ సార్.

మురారి: కానీ మీరా అలా చెప్పేలా కనిపించడం లేదు. మన బిడ్డను మోసేది పెద్దమ్మ సంతోషం కోసమే అంటుంది. ఈ పెళ్లి కూడా పెద్దమ్మ సంతోషం కోసమే అంటుంది. రేపు పొద్దున్న పెద్దమ్మ కోసం పెళ్లి చేసుకోక తప్పదు అంటే ఏం చేస్తాం. మన పరిస్థితి ఏంటి. సరే ఏమైనా జరగనీ ధైర్యంగా ఎదుర్కొందాం. మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన బిడ్డ పెద్దమ్మకు కావాలి. ఈ పెళ్లి పెద్దమ్మకు కావాలి. కానీ ఇక్కడ ఒకటి జరిగితే మరొకటి జరగదు. 

ఇంట్లో అందరూ హాల్‌లో కూర్చొంటారు. భవాని.. మధుతో ఆదర్శ్- ముకుందల పెళ్లి కోసం ఫంక్షన్‌ హాల్ బుక్ చేయమంటుంది. కృష్ణ, మురారిలు టెన్షన్ పడతారు. ఇక రేవతి చక్కగా పల్లెటూరిలో కృష్ణ ఊరిలో చేద్దామని అంటుంది. భవాని ఐడియా బాగుంది అంటుంది. 

ఇంతలో ముకుంద కిందకి వస్తుంది. కావాలనే ఆదర్శ్ కోసం వెతుకుతుంది. అందరూ ముకుందనే చూస్తారు. మధు.. ముకుందతో ఎవరి కోసం వెతుకుతున్నావని అడుగుతాడు. 

రజిని: అందరూ ఉన్నాం కానీ కావాల్సిన వాళ్లు లేరు కదా. అందుకే ఆదర్శ్ ఎక్కడున్నాడా అని వెతుకుతుంది.

కృష్ణ: పిన్ని తను మీతో చెప్పిందా ఎందుకు ఏదేదో ఊహించుకుంటారు. 

రజిని: కళ్లకు క్లియర్‌గా కనిపిస్తుంటే ఊహించుకుంటున్నాను అంటావ్ ఏంటి. తనని అడుగు.

ముకుంద: మనసులో.. నేను ఆదర్శ్‌ కోసం వెతకడం లేదు. కానీ అందరూ అలాగే అనుకోవాలి. అప్పడే కృష్ణ కుళ్లి కుళ్లి చస్తుంది. 

రేవతి: అవును తను ఆదర్శ్ కోసమే వెతుకుతుంది. అది ఏదో పెద్ద నేరం అయినట్లు అడుగుతావ్ ఏంటి వదినా. అదిగో ఆదర్శ్‌ మాటల్లోనే వచ్చేశాడు. నీకు నూరేళ్లురా..

ఆదర్శ్‌: ఏంటి ముకుంద నాకోసమే వెతుకుతున్నావా. నేను నీ కోసం వెతుకుతున్నా. 

ఇక ఆదర్శ్ ఓ గిఫ్ట్ తీసుకొచ్చి మోకాల మీద నిలబడి ముకుందకు ఇస్తూ హ్యాపీ బర్త్‌డే అని చెప్తాడు. కృష్ణ, మురారి కంగారు పడతారు. ఇక భవాని అయితే ముకుంద బర్త్‌డే అని ముందు తెలిసుంటే కేక్ కట్ చేయించేవాళ్లం అని అంటుంది. ఇక ముకుంద తన పుట్టిన రోజు అని ఆదర్శ్‌కి చెప్పలేదు అని.. ఆదర్శ్ తెలుసుకున్నాడని అంటుంది. 

ఇక సంగీత, మధులు ఆదర్శ్‌ ఇచ్చి గిఫ్ట్ తీసి చూడమని అంటారు. ముకుంద తెరచి చూస్తే అందులో లవ్‌కి సంబంధించి ఉంటుంది. అది చూసి ముకుంద చాలా బాగుందని ఆదర్శ్‌కి థ్యాంక్స్ చెప్తుంది.

ఆదర్శ్‌: అమ్మా మరి ముకుంద పుట్టిన రోజుకు నీ గిఫ్ట్ ఏంటి.

భవాని: నిన్నే గిఫ్ట్‌గా ఇద్దాం అనుకుంటున్నానురా. మీ పెళ్లికి త్వరలోనే ముహూర్తాలు పెట్టిద్దాం అనుకుంటున్నాను. 

ఆదర్శ్‌: థ్యాంక్యూ అమ్మ.. 

ముకుంద: మనసులో.. గుండె బద్దలైపోతుంది కదా కృష్ణ. ఇలాగే నువ్వు ఏడ్చే రోజు ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. నిన్ను ఇంట్లో నుంచి కూడా గెంటేస్తా..

మరోవైపు కృష్ణ, ముకుంద, మురారి ఓ హోటల్‌లో కలుసుకుంటారు. ఇక ముకుంద తాను ఒట్టి మనిషి కాదు అని పక్కన తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటుంది అని అంటుంది. దీంతో కృష్ణ నిజంగా నువ్వు మా బిడ్డ గురించి ఆలోచిస్తున్నావా మీరా అని అడుగుతుంది. 

ముకుంద: ఏంటి కృష్ణ అంత మాట అనేశావ్. టైంకి మందులు వేసుకుంటున్నా. బాగా రెస్ట్ తీసుకుంటున్నా.. మంచి ఫుడ్ తీసుకుంటున్నా. నిన్న నీకు పెట్టిన ఫుడ్ కూడా అడిగాను కదా. బిడ్డ గురించి ఆలోచించకుండానే ఇవన్నీ చేస్తానా.. నేను మీ కోసం నా జీవితం త్యాగం చేశాను. నా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు కృష్ణ.

కృష్ణ: నువ్వు చేస్తున్న పనులు కరెక్ట్ అనిపిస్తున్నాయా.

మురారి: ఆదర్శ్‌తో చనువుగా ఉండి ఆశలు పెంచడం ఎందుకు. 

కృష్ణ: నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో తెలీక మేం జుట్టు పీక్కుంటుంటే మేం నీతో ఆడుకుంటున్నాం అంటావా..

ముకుంద: గర్భం లేని నీకే మీ అత్తయ్య వాళ్లు ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. మరి నేను నిజమైన గర్భవతిని నన్ను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మీరు నన్ను ప్రతీ దానికి నిందులు వేసి టెన్షన్ పెడుతున్నారు. నువ్వు గొడ్రాలివి అని బయట పడకుండా ఉండటానికి ఇంట్లో బాగా నటిస్తున్నావు. నేను ఏ మాత్రం ఇష్టం లేనట్లు నటించినా కారణం అడుగుతారు నిలదీస్తారు. అందుకే నేను కూడా కావాలనే అలా నటిస్తున్నాను కృష్ణ.

కృష్ణ: నువ్వు చేసే ప్రతీ పని పెళ్లి జరిగేలా చేస్తుంది. 

ముకుంద: అయితే మీరు ఆ పెళ్లి ఆపండి అని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: విశాలాక్షి బట్టలు దాచేసి ఘోరంగా అవమానించిన తిలోత్తమ, సుమనలు.. గాయత్రీ సాయం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget