అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today March 25th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఒకర్ని ఒకరు చూసుకొని ఎమోషనలైన మురారి, ముకుంద.. అసలైన ఆట ఇప్పుడు మొదలైంది!

Krishna Mukunda Murari Serial Today Episode మురారిని ముకుంద జైలు నుంచి విడిపించి ఎమోషనల్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode : మురారిని తన తండ్రి అరెస్ట్ చేయించాడు అని తెలిసి ముకుంద మురారి దగ్గరకు వెళ్తుంది. తప్పు అంతా తనదే అని మురారికి చెప్పి ఏడుస్తుంది. మురారికి దగ్గర అవ్వాలి అని ఏదో చేస్తే ఏదో అయిందని ముకుంద అంటుంది. తనని గుర్తు పట్టలేదా అని తానే ముకుంద అని మురారితో చెప్తుంది మురారి షాక్ అవుతాడు. 

మురారి: నువ్వు ముకుందా.. ముకుంద చనిపోయింది కదా.. ఎవరు నువ్వు ముకుంద అని ఎందుకు చెప్తున్నావ్.. అని మురారి అడుగుతాడు అని ముకుంద పోలీస్ స్టేషన్‌లో ఊహించుకుంటుంది. ఇంతలో మరో పోలీస్ వచ్చి హోం మినిస్టర్‌లా మాట్లాడుతున్నావ్ అతనిది నాన్ బెయిలబుల్ కేసు అని అంటారు. ఇక ముకుంద హోం మినిస్టర్‌కి కాల్ చేసి చెప్తుంది. దీంతో ఆయన పోలీస్‌కు కాల్ చేసి మురారిని వదిలేయమని అంటారు. ఒంటి నిండా దెబ్బలతో నడవడానికి ఇబ్బంది పడుతున్న మురారిని చూసి ముకుంద ఏడుస్తుంది. 
ముకుంద: సారీ..
మురారి: మీరు రాకపోయి ఉంటే నేను బయటకు వచ్చే వాడినే కాదు ఇంత హెల్ప్ చేసి తిరిగి సారీ చెప్తున్నారు. 
ముకుంద: రావడం ఆలస్యం అయినందుకు..
మురారి: నేను ఓ పోలీస్ ఆఫీసర్‌ని నన్ను నేను కాపాడుకోలేకపోయాను. మా ఇంట్లో వాళ్లు కూడా విడిపించడానికి ట్రై చేసి ఉంటారు. వాళ్ల వల్ల కూడా కాలేదు. మీరు విడిపించారు. ఇంతకీ మీరు ఎవరు.
ముకుంద: ముకుందని.. నేను ముకుంద ఫ్రెండ్ మీరాని.. అలాగే హోం మినిస్టర్ కూతురి ఫ్రెండ్‌ని కూడా..
మురారి: అందుకని మీరు చెప్తే నన్ను రిలీజ్ చేశారా. ముకుంద వాళ్ల నాన్న కూడా హోం మినిస్టర్ ఫ్రెండే.. 
ముకుంద: ఆయన హోం మినిస్టర్ ఫ్రెండ్ అయితే నేను ముకుంద హోం మినిస్టర్ కూతురు మృదుల ఫ్రెండ్స్. మృదుల మాట కాదు అనలేక హోం మినిస్టర్ మిమల్ని విడిపించారు. 
మురారి: థ్యాంక్స్ అండీ..
ముకుంద: ఇది నా బాధ్యత. ముకుంద చనిపోవడానికి కొంత సమయం ముందు నాకు కాల్ చేసింది. మురారి లేకుండా నేను బతకలేను. బతికి ముకుందను ఇబ్బంది పెట్టలేను అందుకే వెళ్లిపోతున్నాను అని చెప్పింది. నీ మీద తనకి ఎలాంటి కోపం లేదు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే కోరుకుంది. అందుకే తన తరఫున మీకోసం నేను వచ్చాను. జాగ్రత్త.
మురారి: మీరు కూడా మా ఇంటికి రండి నన్ను కాపాడింది మీరు అని తెలిస్తే వాళ్లు చాలా హ్యీపీగా ఫీలవుతారు. 
ముకుంద: వస్తాను కానీ ఈ టైంలో కాదు. ఏదైనా అవసరం ఉంటే నా నెంబరుకి కాల్ చేయండి. మీ నెంబరు చెప్పండి. మళ్లీ కలుద్దాం. 

కృష్ణ: అత్తయ్య నాకు ఆ కానిస్టేబుల్ చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. పెద్దత్తయ్య వచ్చేలోపు జరగరానిది ఏదైనా జరిగితే అసలు ఏసీపీ సార్ తిరిగి వస్తారో రారో అని భయంగా ఉంది అత్తయ్య అని ఏడుస్తుంది.
మధు: కృష్ణ అవేం మాటలు నువ్వు భయపడి నట్లు ఏం జరగదు మురారి క్షేమంగా ఇంటికి వస్తాడు. 
ఆదర్శ్‌: మనసులో.. ముకుంద మురారే తన చావుకి కారణం అని లెటర్ రాసిన తర్వాత కూడా ఇంకా మురారి క్షేమంగా ఇంటికి రావాలి అని కోరుకుంటున్నారు అంటే వీళ్లని ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. మురారి తిరిగి రావడం జరగదు. 

ఇంతలో ఇంటి డోర్ శబ్ధం కావడంలో కృష్ణతో పాటు అందరూ కంగారు పడతారు. భయం భయంగా కృష్ణ ఇంటి తలుపు తీస్తుంది. ఎదురుగా నిల్చొన్న కానిస్టేబుల్స్‌ని ఏమైంది మీరు ఎందుకు వచ్చారు అని కృష్ణ ఏడుస్తు అడుగుతుంది. ఇక ఇంటి గుమ్మం ముందు కూలబడి కూర్చొన్న మురారిని పోలీసులు చూపిస్తారు. కృష్ణతో పాటు అందరూ మురారి అంటూ సంతోషంగా దగ్గరకు వెళ్తారు. మురారి దెబ్బలు గట్టిగా తగటడంతో విలవిల్లాడిపోతాడు. అందరూ మురారిని చూసి ఏడుస్తారు. 

కృష్ణ: మా ఏసీపీ సార్‌ని ఎందుకు కొట్టారు. 
కానిస్టేబుల్: అవన్నీ మాకు తెలీదమ్మా. కానీ ఏసీపీ సార్ ఇంటికి తిరిగి వచ్చారు అన్నా బతికి ఉన్నారు అన్నా దానంతటికి కారణం ఒక అమ్మాయి. ఆవిడ ముకుంద మేడం ఫ్రెండ్ అంట. అందరూ షాక్ అవుతారు. ఆవిడ వచ్చి విడిపించారు కాబట్టి సరిపోయింది. 
కృష్ణ: ఏసీపీ సార్ కానిస్టేబుల్ చెప్పేది నిజమా..
మురారి: అవును.. 
ఆదర్శ్: తాగిన మైకంలో.. నువ్వు అసలు బయటకు రావు అనుకున్నా మురారి పర్లేదు వచ్చేశావ్. లక్కీ ఫెలో.. ఎవరు విడిపించారు అన్నావ్ ముకుంద ఫ్రెండ్‌నా చాలా ఆశ్చర్యంగా ఉందే. నువ్వే తనని మోసం చేసి తన చావుకి కారణం అయ్యావని అంత క్లియర్‌గా సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది కదా. ఈ విషయం తన ఫ్రెండ్‌కి కూడా తెలుసుంటుంది కదా అయినా నిన్ను ఎలా విడిపించింది. తన ఫ్రెండ్‌ని చంపిన వాడిని కాపాడింది అంటే తను ఫ్రెండ్ ఎలా అవుతుంది. అలాంటి ఫ్రెండ్‌ని నడిరోడ్డులో నిల్చొపెట్టి కాల్చి పారేయాలి. 
మురారి: రేయ్ నోర్ముయ్. ఆ అమ్మాయి గురించి ఇంకొక్క మాట మాట్లాడితే ప్రాణాలు తీసేస్తా.. ఆ అమ్మాయి ఆ సూసైడ్ నోట్ చూసి కూడా అది నిజం కాదు అని నా మీద నమ్మకంతో నన్ను విడిపించింది. కానీ నువ్వు చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఉండి నేనేంటో తెలిసి కూడా నన్ను నమ్మలేకపోతున్నావ్. ఆవిడ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను.
ఆదర్శ్‌: తెలుసుకుంటుందిరా నిన్ను కాపాడిన ఆ అమ్మాయినే నువ్వు కాటేసే నాగు అని తెలుసుకుంటుంది. 
నందూ: అన్నయ్య ఇష్టమొచ్చినట్లు వాగితే బాగోదు చెప్తున్నా..

మురారిని ఇంట్లోకి తీసుకెళ్లి దెబ్బలకు మందులు రాస్తారు. రేవతి తన బిడ్డ పరిస్థితి చూసి ఏడుస్తుంది. ముకుంద ఆత్మహత్య చేసుకోవడంలో ఎంతో కొంత తప్పు తనది ఉందని మురారి ఫీలవుతాడు. మురారి తనకు చాలా ఆకలి వేస్తుంది అని చెప్పడంతో ఇంట్లో అందరూ ఎమోషనల్ అవుతారు. దగ్గరుండి వడ్డించి తినిపిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ మార్చి 25th: అమర్‌కు కనిపించిన అరుంధతి ఆత్మ – పిల్లలు రాసిన లెటర్‌ మార్చిన మనోహరి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
AP GOVT SCHOOLS: ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Vaikunta Ekadashi: 'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
'వైకుంఠ'వాసుని నిలయంలో వైకుంఠ ఏకాదశి శోభ - గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
AP GOVT SCHOOLS: ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
ఏపీలో పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులు - ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలు రద్దు
Mee Ticket App: ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
Game Changer OTT: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
Pawan Kalyan: 'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
Embed widget