అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today January 8th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: అందరిముందు లొంగిపోయిన దేవ్‌ - వెక్కి వెక్కి ఏడుస్తున్న ముకుంద!

Krishna Mukunda Murari Serial Today Episode దేవ్ రింగు చూసి కృష్ణ నిలదీయడంతో అందరి ముందు దేవ్ తప్పు ఒప్పుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Telugu Serial Today Episode: ఆర్టిస్ట్ శ్రీధర్‌ని చంపిన వారిలో ఒకరిని పోలీసులు పట్టుకుంటారు. అతడిని పోలీసులు మురారి ఇంటికి తీసుకొస్తారు. వాడికి నిజం చెప్పమని మురారి కొడితే అంతా కృష్ణ బాబాయ్ పెద్దపల్లి ప్రభాకరే చేయించాడు అని చెప్పేస్తాడు. దీంతో ఇంట్లో వాళ్లు అందరూ షాక్ అవుతారు. ఇందులో ఏదో కుట్ర ఉంది నేను పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తేల్చుతా అని మురారి అంటే భవాని అతడిని ఇళ్లు దాటనివ్వదు. ఇక కృష్ణని అవమానించి తన ఇంటి నుంచి పంపేస్తుంది భవాని. మరోవైపు పోలీసులకు దేవ్ డబ్బులు ఇస్తాడు. 

కృష్ణ: అసలు ఏం జరుగుతుంది ఏసీపీ సార్.. ఇది కుట్రా.. నిజమా.. మా చిన్నాన్న ఎందుకు చేస్తారు ఇలా.. లేదు ఏసీపీసార్ కానీ అతను చెప్పింది..
మురారి: పూర్తిగా అబద్ధం.. కానీ దీని వెనుక ఎవరు ఉన్నారో కనిపెట్టాలి. 
కృష్ణ: అంత అవసరం ఎవరికి ఉంటుంది ఏసీపీ సార్. మనల్ని వేరు చేయాలి అన్నంత కోపం ఎవరికి ఉంది. ముకుందకు తప్పా.
మురారి: ముకుందకు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఉంది తప్ప. ఒకరిని చంపాలి ఇంకొకరి చేత ఇలా చేయించడం లాంటివి మాత్రం చేయదు. కృష్ణ పెద్దమ్మ అలా అంది అని నువ్వు బాధపడకు.
కృష్ణ: లేదు ఏసీపీ సార్ మిమల్ని ఎవరు అయినా అలా అంటే ఎవర్ని అయినా ఎదిరిస్తా ఏసీపీ సార్. 
మురారి: అసలు ఇవన్నీ ఎందుకు పెద్దమ్మ నిన్ను నమ్మితే చాలుకదా.. అవును అసలు ఆ రింగ్ విషయం ఏమైందో ఒక్క నిమిషం ఆగు అని రింగ్ ఎంక్వైరీ ఎంత వరకు వచ్చిందని డిపార్ట్‌మెంట్‌కి కాల్ చేసి అడుగుతాడు. 

కృష్ణ తన చిన్నాన్నని కలవడానికి జైలుకి వెళ్తుంది. అయితే పెద్దపల్లి ప్రభాకర్ ఎవర్నో కొట్టాడు అని అందుకే ఆయన్ను జైలులోని క్షమశిక్షణ సెల్‌లో వేశామని.. ఇప్పట్లో ఆయన్ను ఎవరూ కలవడానికి వీలులేదు అని కానిస్టేబుల్ చెప్తాడు. దీంతో కృష్ణ షాక్ అయిపోతుంది. తన చిన్నాన్న ఎవర్ని కొట్టుంటాడు. శ్రీధర్‌కి ఇందాక ఇంటికి వచ్చిన వాడికి ఏదైనా సంబంధం ఉందా.. లేకపోతే వేరే ఎవర్ని అయినా కొట్టాడా అని కృష్ణ ఆలోచిస్తుంది. 

మరోవైపు భవాని ఇంట్లో ముకుందకు కోన్ పెడుతుంటారు. భవాని ఇంట్లో నుంచి నవ్వులు వినిపించడంతో కృష్ణ, శకుంతల బయట నుంచి విని ఏడుస్తుంటారు. ఇక మురారి కూడా అక్కడికి వస్తాడు. 

కృష్ణ: ఏంటి ఏసీపీ సార్ ఇలా వచ్చారు ఒకసారి చివరిగా చూసి వెళ్దామనా.. 
మురారి: అలా మాట్లాడకు కృష్ణ ప్లీజ్.. 
రేవతి: కృష్ణ ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావ్ వెళ్దాం రా. నువ్వు నా కళ్లెదుటే ఉండాలి. నువ్వు ఒంటరిగా ఉంటే ఏం చేసుకుంటావా అని భయంగా ఉందే. 
మురారి: అమ్మా ఏంటి ఇది పెళ్లి అయిపోనట్లు బాధ పడుతున్నావేంటి. 
రేవతి: లేదు కృష్ణ నాతోనే ఉండాలి.. కృష్ణ అటు ఇటు అయితే నేను కూడా నీతోనే వచ్చేస్తా మనిద్దరం కలిసే ఉందాం.. నువ్వు లేకుండా నేను ఉండలేను. 
కృష్ణ: అత్తయ్య నిజంగా ఆ దేవుడు అనే వాడే ఉండుంటే మనకు అన్యాయం చేయడు మీరు బాధ పడకండి. నేను బాధ పడటం కంటే ఇంకేం చేయలేకపోతున్నా నందూ. తర్వాత మురారి రేవతి, నందూ వాళ్లని వెళ్లిపోమని చెప్తాడు. ఇక కృష్ణ ఏడుస్తూ మురారిని హగ్ చేసుకుంటే మురారి కూడా ఏడ్చేస్తాడు. ఇక అందరూ ముకుందకు గోరింటాకు పెడుతుంటే అక్కడికి వస్తారు. కృష్ణ కూడా వస్తుంది. 

కృష్ణ: ఏసీపీ సార్ రేపటి నుంచి నేను మీకు మాజీ భార్యనా.. 
మురారి: ఏంటి నువ్వు అనేది ఆ మాట నువ్వేనా అనేది. కృష్ణ నీ ధైర్యమంతా ఏమైపోయింది. అసలు నువ్వు..
కృష్ణ: ఆడపిల్లని.. అంత కంటే మీ భార్యని. దేన్ని అయినా గుప్పెట్లో పట్టుకోవచ్చుకానీ పరిస్థితుల్ని పట్టుకోలేము ఏసీపీ సార్. అది ఒక్క దేవుడికే సాధ్యం. నేను అంతకు మించి కాదు కదా ఏసీపీ సార్. నా స్థానాన్ని వాళ్లు తీసేసుకుంటే నేను మౌనంగా చూస్తూ కూర్చొన్నాను. ఇలా చూస్తూ ఉండటం అంటే రాజీ పడటం అంటారు అది నాకు ఇష్టం లేదు ఏసీపీ సార్. దేన్ని అయినా రాజీ పడొచ్చు కానీ. ఇలా.. 
నందూ: పిన్ని ఇక ఆశలు వదిలేసుకున్నట్లేనా.. 
రేవతి: నాతో మాట్లాడకు నందూ అసలు ఎవరూ నాతో మాట్లాడొద్దు. నా అంత పాపాత్మురాలు ఈ భూమ్మీద ఎవరూ ఉండరు. నా బిడ్డ జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటున్నాను. ఇంత కంటే దారుణం ఇంకా ఏమైనా ఉంటుందా. 
మధు: నువ్వే కాదు మనమందరం తప్పు చేస్తున్నాం.
నందూ: అమ్మది తప్పు అని నిలదీయలేకపోతున్నాం కదా పిన్ని.
దేవ్: ఎందుకు నిలదీయలేకపోతున్నారు నందూ.. అయినా కన్న తల్లిదండ్రులను గౌరవించు కానీ ఎందుకు భయం. భవాని సుమలతకు భోజనం ఏర్పాట్లు చూసుకోమని చెప్పడంతో.. మీరు చేస్తున్నదే తప్పు మళ్లీ దానికి భోజనం ఏర్పాట్లు బాగుంది మేడమ్.
భవాని: దేవ్.. 
ముకుంద: మనసులో.. ఏంటి నిజం తెలిసిపోయిందా ఇప్పుడు ఎలా.. 
భవాని: పోనీలే అని వదిలేస్తే నన్నే తప్పు పడతావా.. హౌడేర్ యూ.. నేను అంత దుర్మార్గురాలిలా కనిపిస్తున్నానా.. అవతల వారిది తప్పే అని నిరూపించాలి చూస్తున్నాను. అన్నీ ఆలోచించే చేస్తున్నాను. నాలో లోపం ఉంది అని చెప్పేందుకు నిన్ను ఇక్కడే షూట్ చేసి పారేసేదాన్ని. ముకుంద అన్నవని వదిలేస్తున్నా బీ కేర్ ఫుల్. 
కృష్ణ: సారీ అన్నయ్య నా వల్ల నీవు ఎంత అవమానం పడుతున్నావో.
దేవ్: పర్లేదురా.. కానీ నేను ఉండి కూడా నీకు న్యాయం చేయలేకపోతున్నాను అని నా బాధ. అది భరించలేకపోతున్నాను. సారీ అమ్మా. చెల్లెమ్మా నీకు జీవితంలో ఎలాంటి సాయం కావాలి అన్నా ఈ అన్నయ్య ఉన్నాడు. పెద్దపల్లి ప్రభాకర్ గారిని నేను రిలీజ్ చేయిస్తాను అని నీకు ప్రామిస్ చేస్తున్నా.. అంటూ కృష్ణ చేతిలో చేయి వేస్తాడు. కృష్ణ దేవ్ రింగ్ చూస్తుంది. 
కృష్ణ: దేవ్ చేయి వదిలించుకొని యూ చీటర్ అని కాలర్ పట్టుకుంటుంది. ఏసీపీ సార్ వీడే.. శ్రీధర్‌ని చంపింది వీడే. చూడండి అదే రింగ్. 
భవాని: ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్. శ్రీధర్‌ని దేవ్ చంపడం ఏంటి.
మురారి: పెద్దమ్మ ప్లీజ్ కాసేపు ఎవరూ మాట్లాడకండి. చెప్పరా.. శ్రీధర్‌ని చంపింది నువ్వే కదూ.. ఈ ఉంగరం ముద్ర శ్రీధర్ చెంప మీద పడింది. 
దేవ్: ఏం మాట్లాడుతున్నావ్ బావ.
మురారి: ఏయ్.. ఎవడ్రా నీకు బావ..
దేవ్: ఉంగరం నాదే కానీ నేను ఏం చేయించలేదు షాపులో కొన్నాను. ఇలాంటి ఉంగరం ఇంకా ఎవరూ కొనరా.. 
భవాని: అదే కదా మురారి అలాంటి రింగ్స్ ఎవరైనా కొనొచ్చు కదా.. దానికి మీరు ఇలా గొడవ చేయడంలో అర్థం లేదు.
పరిమళ: అప్పుడే పరిమళ పోలీసులు భవాని ఇంటికొచ్చి.. అర్థముంది మేడం. నూరుకి నూరు శాతం అర్థముంది. మురారి ప్రణతి గోల్డ్ షాపులో ఆరు రోజుల క్రితం రింగ్ కొన్నాడురా ఇదిగో బిల్. 
దేవ్: మీరే ఆర్టిఫిషియల్..
మురారి: వర్మ ఫుటేజ్ లేదా..
వర్మ: ఉంది సార్.. ఇప్పుడే ఇస్తాను. అంటూ పెన్‌డ్రైవ్ చేతికిస్తూ.. 
దేవ్: అవసరం లేదు నా చెల్లెలు ఆనందం కోసమే నేను ఈ పని చేశాను. ముకుందతో పాటు అందరూ షాక్ అవుతారు. కానీ ఈ విషయాలు ఏవీ తనకు తెలీదు. 
ముకుంద: సీరియస్‌గా దేవ్ చెంప చెల్లుమనిపించి.. నాకు ఎందుకురా చెప్పలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి. ఎందుకు ఇలా చేశావ్.. చెప్పు మాట్లాడు దేవ్.. అని ఏడుస్తుంది. ఇక పోలీసులు దేవ్‌ని అరెస్ట్‌ చేసి తీసుకెళ్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: నాకు ఇక్కడ హీరోలు ఎవరూ నచ్చలేదు - ‘సైంధవ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శైలేష్ కొలను

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
Godavari Serial Today July 22nd: 'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
Jabardasth Latest Promo: 'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
Jabardasth New Timing: ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్
ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
Embed widget