Krishna Mukunda Murari Serial Today January 6th: కానిస్టేబుల్‌ని కొనేసిన దేవ్.. అంతా చేసింది పెద్దపల్లి ప్రభాకర్ అని చెప్పించేశాడుగా!
krishna mukunda murari today episode దేవ్ కానిస్టేబుల్, అనుమానితుడికి డబ్బులు ఇచ్చి మొత్తం చేయించింది పెద్దపల్లి ప్రభాకర్ అని చెప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
krishna mukunda murari serial today episode: కృష్ణ ఇంటి దగ్గర ముకుంద, మురారీలకు నలుగు రాసే కార్యక్రమం చేపడతారు. దీంతో శకుంతల ఏడుస్తూ నా బిడ్డ జీవితం ఏం కావాలి అని భవానిని అడుగుతుంది. దీంతో భవాని శుభమా అని నలుగు పెడుతుంటే ఏడుస్తావు ఏంటి అని శకుంతలను తిడుతుంది. ఇక అక్కడే ఉన్న మిగతా వారు పెళ్లి కూతురుకు గంధం రాయమని చెప్తారు. దీంతో భవాని తన కూతురు నందూకి రాయమని చెప్తుంది. ఇక ముకుంద అడ్డుకొని ముందు మీరు రాయండి అత్తయ్య అని అంటుంది.
ముకుంద: ఈ జీవితాన్ని ఇచ్చింది మీరే అత్తయ్య ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను.
భవాని: ఏడాది పూర్తి అయ్యేలోపు పాపనో బాబునో ఇచ్చి రుణం తీర్చుకో. అని ముకుందకు గంధం రాస్తుంది. ఇక కృష్ణ చాలా బాధ పడుతుంది. దేవ్ ఈ తంతు అంతటిని మేడ మీద నుంచి చూస్తుంటాడు. మరోవైపు రేవతి కూడా మురారికి గంధం రాస్తుంది. ఇక భవాని కృష్ణకు కూడా గంధం రాయమని చెప్తుంది. కృష్ణ బాధపడుతూనే రాస్తుంది. అక్షింతలు వేసి దీవిస్తుంది. మరోవైపు మురారికి ఫోన్ వస్తుంది.
మురారి: పెద్దమ్మ.. దొరికాడు. శ్రీధర్‌ని ముగ్గురు నలుగురు కలిపి చంపారు అని తెలిసింది కదా. వాళ్లలో ఒకడు దొరికాడు అని ఇప్పుడే కాల్ వచ్చింది. నేను ఇప్పుడే వెళ్తాను.. వెళ్లి పట్టుకొని వస్తాను.
కృష్ణ: సార్ నేను వస్తాను..
భవాని: కృష్ణ ఆగు ఇదేంటి నాన్న ఇప్పుడెలా వెళ్తారు.
ముకుంద: అవును మురారి అంతగా అయితే మా అన్నయ్యని పంపిద్దాం. మా అన్నయ్య వెళ్లినా నువ్వు వెళ్లినా ఒకటే కదా.
మురారి: లేదు ముకుంద ఇప్పటికే మీ అన్నయ్య మా వల్ల మాటలు పడ్డాడు. దెబ్బలు తిన్నాడు. నేనే వెళ్తాను.
భవాని: నాన్న ఇప్పుడు వెళ్లడం అంత మంచిది కాదు. పట్టుకున్నవాడు ఏం పారిపోడు కదా. పోలీసుల్నే మన ఇంటికి తీసుకురమ్మని చెప్పు. నేను చెప్తున్నా కదా మురారి పెళ్లి కొడుకును చేశాక పొలిమేర దాటకూడదు. రేవతి మురారిని తీసుకెళ్లి మంగళ స్నానం చేయించండి. ఇంకా నిందితుడు ఎవరో ప్రూవ్ చేయలేదు కదా. అప్పటి వరకు నా మాట వింటాను అని మాటిచ్చావు కదా. వెళ్లు.
ముకుంద: దేవ్‌కి ఫోన్ చేసి.. దేవ్ ఎక్కడ ఉన్నావ్. అందరూ బయట ఉంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావ్..
దేవ్: టెన్షన్ పడుతున్నా..
ముకుంద: అంటే నీకు తెలిసిందా.. మరెలారా దేవ్..
దేవ్: నువ్వు కంగారు పడి నన్ను టెన్షన్ పెట్టకు. అని ఫోన్ కట్ చేసేస్తాడు. మనసులో.. ఇప్పుడేం చేయాలి పాపం ముకుంద నా మీదే ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు ఎలా..
భవాని: మురారి ఏరి నాన్న వీళ్లు.
మురారి: ఏమైందో అర్థం కావడం లేదు పెద్దమ్మ. నేనే వెళ్లి వస్తాను. నేనే వెళ్లాలి పెద్దమ్మ కానిస్టేబుల్ వల్ల కాదు.
భవాని: ఏంటి నాన్న ఇది నీ డిపార్ట్‌మెంట్ మీద నీకే నమ్మకం లేదా..
ముకుంద: అదికాదు మురారి ఇలా చేయడం మంచిది కాదు అని అత్తయ్య చెప్తున్నారు కదా..
భవాని: మురారి వాళ్లని రమ్మన్నావు కదా.. వాళ్లు తీసుకొని వస్తారు కదా.. ఇప్పుడు వాళ్లకి ఎదురెళ్ల ఏం చెప్పాలి అనుకుంటున్నావ్. వాళ్లని రానివ్వు. ఎందుకు ఇంత కంగారు. వాళ్లు నిజం ఏంటో చెప్పాల్సి వస్తే ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని భయపడుతున్నావా..
మురారి: పెద్దమ్మ నేను భయపడటం లేదు తొందరగా ఈ కేసు తేల్చాలి అనుకుంటున్నాను.
కృష్ణ: అంటే ఏంటి పెద్దత్తయ్య ఏసీపీ సార్‌ని అనుమానిస్తున్నారా.. వాళ్లకి ఎదురెళ్లి చెప్పకూడనిది చెప్తారు అని అనుకుంటున్నారా.. నన్ను అవమానించండి.. అనుమానించండి పడతాను. ఇలా అవమాన పడటం నాకు అలవాటు అయిపోయింది. కానీ మా ఏసీపీ సార్‌ని ఒక పిరికి వాడిలా మీరు చూడటం నాకు నచ్చట్లేదు పెద్దత్తయ్య. అసలు మీరు వద్దు వద్దు అని ఆపేస్తున్నారు అంటేనే నాకు అర్థమవుతోంది. మా చిన్నాన్న నిర్దోశి అని ఎక్కడ తెలుస్తుందో.. తెలస్తే మీ మాట చెల్లదు అనే భయంతో మీరు ఏసీపీ సార్‌ని ఆపుతున్నారు.
భవాని: ఏయ్... ఏంటి నేను భయంతో ఇలా చేస్తున్నానా.. చూశావా రేవతి.. నీ కోడలు కాని కోడలు ఏం మాట్లాడుతుందో విన్నావా.. ఇంతలో పోలీసులు ఆ వ్యక్తిని తీసుకొని వస్తారు.
కృష్ణ: చితక్కొట్టి అయినా నిజం చెప్పించండి ఏసీపీ సార్..
మురారి: ఎవరు ఉన్నారు నీ వెనక అంటూ కొడతాడు మురారి.
అనుమానితుడు: చెప్తాను సార్ చెప్తా.. మా అన్న జైలులో ఉంటాడు. నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. మా అన్న నాతో మీ ఇంట్లో పెళ్లి ఆగిపోయేలా చేయమన్నాడు సార్. మా అన్నకి పెద్దపల్లి ప్రభాకర్ చెప్పాడు అంట సార్. ఆయన కూడా జైలులో ఉంటాడు అంట.
మురారి: రేయ్ చంపేస్తా నిజం చెప్పు ఇలా చెప్పమని ఎవరు చెప్పారు చెప్పు.
కృష్ణ: ఏసీపీ సార్ అబద్ధం ఏసీపీ సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు.
భవాని: షట్ ఆప్.. కానిస్టేబుల్ తీసుకెళ్లండి. ఏయ్.. ఏమన్నావ్ నేను భయంతో అదే ఓడిపోతాను అనే భయంతో ఇలా చేస్తున్నానా.. ఇప్పుడేమంటావ్ మాట్లాడు. రేవతి ఇందాక నీ కోడలు కాని కోడలు రెచ్చిపోయి మాట్లాడితే ఒక్క మాట అన్నావా అంటే ఏమిటి అర్థం ఈమె మాట్లాడినవన్నీ నిజమనే కదా.. ఆరోజు ముకుంద బతికే ఉన్నాడని చెప్పినా కూడా తనని ఒక్కరూ మెచ్చుకోలేదు. ముకుందకు నేను సపోర్ట్ చేస్తుంటే నన్ను కూడా ఒక శత్రువుని చూసినట్లు చూశారు. దాని గురించి నేనేం బాధ పడను కానీ నిన్ను మాత్రం (కృష్ణని) ఈ జీవితంలో మర్చిపోలేను. నన్ను ఎదిరించి నేను చేయనిదాన్ని చేశాను అని నలుగురిలో నిలదీశావు చూడు దానికి నేను చాలా హర్ట్ అయ్యాను.
మురారి: పెద్దమ్మ నేను జైలుకి వెళ్లి అసలు నిజాలు ఏంటో కనుక్కుంటాను.
భవాని: ఇంకా నువ్వేం కనుక్కుంటావ్ నాన్న అయిపోయిందిగా..
మురారి: లేదు పెద్దమ్మ దీని వెనుక ఏదో కుట్ర దాగుంది. నేను వెళ్లాలి కనుక్కోవాలి..
భవాని: మురారి.. నాన్న నేను నిన్ను కనకపోయినా నా కన్నబిడ్డలా చూసుకున్నాను. ఒకసారి నిన్ను చంపాలి అని చూశారు మళ్లీ వాళ్ల దగ్గరకు నిన్ను పంపే అంత గుండె ధైర్యం నాకు లేదు నాన్న. నిన్ను మళ్లీ వాళ్లు ఏమైనా చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదు. వద్దు నాన్న వెళ్లొద్దు. ఇప్పటితో ఈ పీడకలని మర్చిపో. ఏయ్ నువ్వు ఇంకా ఇక్కడెందుకు ఉన్నావ్. వచ్చిన దారినే వెళ్లు.
మరోవైపు దేవ్ కానిస్టేబుల్‌కి 15 లక్షలు ఇస్తాడు. అందరూ పంచుకోండి అని చెప్తాడు. తర్వాత ఏం తెలీనట్లు మురారి దగ్గరకు వస్తాడు. నిజంగానే వాళ్లు అలా చేసుంటారా అని అడిగితే మురారి అడ్డుకుంటాడు. వాళ్లు అలా చేయరు అని అంటాడు. ఇక దేవ్ మొత్తం తానే చూసుకుంటాను అని ముకుందను ఒప్పించే ప్రయత్నం చేస్తా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.