(Source: ECI/ABP News/ABP Majha)
Krishna Mukunda Murari Serial Today February 6th - కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆదర్శ్‌కు ఆ విషయం చెప్పేసిన ముకుంద.. గుడిలో కృష్ణకు మరో అపశకునం!
Krishna Mukunda Murari Serial Today Episode: బెస్ట్ కపుల్ కాంపిటేషన్‌లో పాల్గొనడం తనకు ఇష్టం లేదు అని ముకుంద ఆదర్శ్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారంది.
Krishna Mukunda Murari Today Episode: కృష్ణ మృత్యుంజయ మంత్రం చదువుకొని దేవుడి ముందు హారతి వెలిగిస్తుంది. అయితే గుడిలో కూడా హారతి ఆరిపోతుంది. మరోసారి కృష్ణ చాలా భయపడి ఎందుకు ఇలా జరిగింది అని పంతుల్ని అడుగుతుంది. దీంతో ఏం జరుగుతుందా అని పరీక్షించడానికి కావాలనే కర్పూరం వెలిగించమన్నాను అని కానీ అది ఆరిపోతే ఏం కాదు అని పంతులు చెప్పారు.
కృష్ణ: అంటే దీపం ఆరిపోతే ఆశుభం అంటారు. కదా పంతులుగారు. అది కీడు కలిగిస్తుంది కదా..
పంతులు: మనసులో.. నిజమే అమ్మా కానీ నీ జీవితంలో ఇంకా ఏదో కీడు జరగబోతుంది అని చెప్పి నిన్ను ఇంకా భయపెట్టలేను.
కృష్ణ: చెప్పండి పంతులు గారు మీరు ఏదో దాస్తున్నారు ఎందుకు ఇలా పదే పదే జరుగుతుంది. ఇదంతా దేనికి సందేశం.. నాకు చాలా భయంగా ఉంది.
పంతులు: ఏం కాదు అమ్మా భయపడకు. జీవితం అన్నాక కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. ఆ భగవంతున్ని నమ్ముకుని ఆయన మీద భారం వేస్తే బాధల నుంచి తప్పించుకునే మార్గం చూపిస్తాడు. కృష్ణ వెళ్లిపోయిన తర్వాత.. మీ దాంపత్య జీవితానికి ఏదో ఇబ్బంది రాబోతుంది అనిపిస్తుంది.
ముకుంద: మనసులో.. ఆదర్శ్‌తో కలిసి ఒకే గదిలో ఉండటమే నరకంలా ఉంది అంటే ఆ కాంపిటేషన్ ఒకటి.. అందరి ముందు కలిసి ఉండటం.. డ్యాన్సులు చేయడం.. ఎలా తప్పించుకోవాలి..
ఆదర్శ్: గులాబీల బొకే తీసుకొని వచ్చి మోకాలి మీద నిల్చొని ఐ లవ్ యూ ముకుంద అని చెప్తాడు. ముకుంద రెస్పాన్స్ లేదు ఏంటి. ఐ లవ్ యూ టూ అని చెప్పు. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే.. ఏమైంది ముకుంద ఎందుకు అంత చిరాకుగా ఉన్నావ్..
ముకుంద: ఆదర్శ్ ఇప్పుడు వ్యాలెంటైన్స్ డే ఏంటి..
ఆదర్శ్: ఓ అదా ప్రాక్టీస్ చేస్తున్నా.. బెస్ట్ కపుల్ కాంపిటేషన్‌లో ఇవన్నీ ఉంటాయి కదా.. అందుకే.. ఎలా అయినా మనమే గెలవాలి అని ఇంట్లో అందరూ కోరుకుంటున్నారు. బెస్ట్ కపుల్ అనిపించుకోవాలి. మనం ఇందుకు బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను కొన్ని డ్యాన్స్ స్టెప్పులు చూశాను ఒకసారి ట్రై చేద్దామా అని పిలిస్తే ముకుంద రాదు.
ముకుంద: ఆదర్శ్ ప్లీజ్ ఇప్పుడు నాకు డ్యాన్స్ చేసే మూడ్ లేదు. అసలు నాకు ఈ పోటీలో పార్టిసిపేట్ చేయాలి అనే లేదు ఆదర్శ్.
ఆదర్శ్: ఎందుకు లేదు.. కాంపిటేషన్‌లో నాకు అందరూ ప్రశ్నిస్తే నేను ఫిలవుతాను అని నువ్వు అనుకుంటున్నావ్ కదా.. నా గురించి నువ్వు ఇంత ఆలోచిస్తున్నావ్ కదా నాకు అది చాలు. అయినా మురారి ఏం అన్నాడో విన్నావ్ కదా. బెస్ట్ కపుల్ అంటే ఎన్నాళ్లు కలిసి ఉన్నారు అని కాదు. ఉన్న దూరాన్ని అధిగమించి ఎలా కలిసి ఉన్నారు అనేది. మనం కచ్చితంగా గెలుస్తాం.
ముకుంద: నాకు అసలు ఈ కాంపిటేషనే ఇష్టం లేదు. అందరి ముందు అలా చెప్పలేక నిన్ను కారణంగా చూపించాను.
ఆదర్శ్: ఏమైంది ముకుంద ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్.. నువ్వు మారావ్ అని చెప్తే కదా నేను వచ్చాను. ముకుంద ఒక విషయం చెప్పు నువ్వే కృష్ణ, ముకుందలను పంపించావ్ కదూ.. మన మధ్య దూరం చెరిగిపోయింది అనుకుంటే మళ్లీ నువ్వు అదే దూరాన్ని మెంటైన్ చేస్తావు ఏంటి. నా పక్కన నిల్చోవడం ఇష్టం లేకే కదా ఇదంతా చేస్తున్నావ్.
ముకంద: అయ్యో అదేం లేదు ఆదర్శ్. నేను అందరి ముందు అలా డ్యాన్స్‌లు అవి చేయలేను. అందరు అమ్మాయిలూ ఒకేలా ఉండరు ఆదర్శ్. మన కృష్ణ ఉంది తనకి కొత్తపాత ఉండదు. అందరితో కలిసి పోతుంది. కానీ నేను అలా కాదు. నా కంటూ ఒక లోకం సృష్టించుకొని అందులోనే బతకడం అలవాటు అయిపోయింది. మీరు లేని ఈ రెండేళ్లలో ఆ ఒంటరి తనం మరీ ఎక్కువ అయిపోయింది. దానిలో నుంచి బయటకు రావడం చాలా కష్టం. టైం పడుతుంది.
ఆదర్శ్: బయటకు వెళ్దాం అంటే డెస్ట్ అలర్జీ అంటావ్. కాంపిటేషన్ అంటే అందరి ముందు చేయలేను అంటావ్. కానీ ఇవేవి నువ్వు అందరి ముందు చెప్పవు నా ముందు చెప్తే ఎలా..
ముకుంద: ఇవన్నీ వాళ్ల ముందు చెప్తు ఇష్టం లేక షాక్ చెప్తున్నా అనుకుంటారు. ఏదో ఒకటి చేసి ఈ కాంపిటేషన్‌కి మనం వెళ్లకుండా చేయండి.
కృష్ణ, మురారిలు టిఫెన్ చేయడానికి హొటల్‌కి వస్తారు. కృష్ణ హారతి ఆరిపోయి మూడ్‌లోనే ఉంటుంది. అక్కడ జరిగింది మురారికి చెప్తుంది. మురారి కృష్ణని నచ్చజెప్తాడు. టెన్షన్ పడొద్దు అని చెప్తాడు. ఇక ఇద్దరూ టిఫిన్ చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.