అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today February 21st: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆదర్శ్‌తో శోభనాన్ని ఆపేందుకు ముకుంద కుట్ర, కనిపెట్టేసిన కృష్ణ!

Krishna Mukunda Murari Serial Today Episode ఆదర్శ్‌తో శోభనం ఇష్టం లేక కాలు బెనికినట్లు ముకుంద నాటకం ఆడటం వల్ల కృష్ణకి అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode ఆదర్శ్‌తో శోభనాన్ని తప్పించుకోవడానికి ముకుంద పువ్వు అని చెప్పి వస్తుంది. బయట నిల్చొని కాలయాపన చేస్తుంది. తాను ఎవర్ని మోసం చేయడం లేదు అని తన ప్రేమని బతికించుకోవాలనే ఇలా చేశాను అని తనలో తాను అనుకుంటుంది. మురారిని ఎంతో గొప్పగా ప్రేమించాను అని అనుకుంటుంది. తనది స్వచ్ఛమైన ప్రేమ అని ఆ ప్రేమను ఒదులు కోను అని అంటుంది. 

మురారి: కృష్ణ నువ్వు ఇక్కడుండు మేం వెళ్లి ముకుందని తీసుకొని వస్తాం. 
ఆదర్శ్: రేయ్ ముకుంద కాదురా మిసెస్ ఆదర్శ్. 
కృష్ణ: ముకుంద పిచ్చి కాకపోతే ఈ టైంలో పువ్వు అంటూ బయటకు వెళ్తుందా.. అయినా అది ఒకందుకు మంచిదేలే తన మీద ఎంత ప్రేమ ఉందో ఆదర్శ్‌కు అర్థమవుతుంది. 
ఆదర్శ్: ముకుంద.. ముకుంద..
ముకుంద: నేను శోభనానికి ఏర్పాట్లు చేశాను అని ఆదర్శ్‌ అనుకుంటున్నాడు. ఏం చెప్పినా తప్పించుకోవడం కుదరదు. ఉన్నది ఒకటే దారి నన్ను క్షమించు.. అంటూ పువ్వు కోసం ఎగిరి కింద పడిపోయినట్లు నటిస్తుంది. 
ఆదర్శ్: ముకుంద ఏమైంది.. చూసుకోవాలి కదా అయినా వద్దు అని అందుకే చెప్పాను. విన్నావా బయటకు వచ్చావ్. ముకుంద పద రూంకి వెళ్దాం.
ముకుంద: వద్దు..
మురారి: వద్దు ఏంటి అసలు నడిచే పొజిషన్‌లో ఉన్నావా లేదు కదా. ఆదర్శ్‌ ఎత్తుకో.. ఆదర్శ్‌ ఎత్తుకుంటే ముకుంద మురారి ఎత్తుకున్నట్లు ఊహించుకుంటుంది.  

మరోవైపు దేవ్ ముగ్గురు రౌడీలను పంపించి కృష్ణని కిడ్నాప్ చేయమంటాడు. వాళ్లు పవర్ కట్ చేస్తారు. దేవ్ సార్ చెప్పినట్లు కృష్ణని కిడ్నాప్ చేయాలి అనుకుంటారు. వాళ్లు వచ్చినప్పుడే పవర్ వస్తుంది. దీంతో కృష్ణకి ఎవరో ఉన్నట్లు అనిపించి ఎవరూ ఎవరూ అని బయటకు వస్తుంది. డోర్ ఎవరు తీశారు అనుకొని ఏసీపీ సార్ అని అనుకుంటుంది. 

ఇక రేవతి ముకుంద గురించి మధు చెప్పినప్పటి నుంచి కంగారుగా ఉందని అంతా మంచే జరగాలి అని దేవుణ్ని కోరుకుంటుంది. ఇక మధు అక్కడికి వస్తాడు. మనం ఏం చేస్తాం పెద్దమ్మ అందరి కంటే ముకుందని  కృష్ణ ఎక్కువ నమ్ముతుంది అని అంటాడు. ఇక రేవతి మురారితో మాట్లాడావా అని అడిగితే మధు లేదు అని తాను ఏం మాట్లాడినా వాళ్లు కామెడీగా తీసుకుంటున్నారు అని బాధపడతాడు. 

కృష్ణ: ఏమైంది..
మురారి: పువ్వు అందలేదు అని జంప్ చేసింది కాలు బెనికింది.
కృష్ణ: చూసుకోవాలి కదా ముకుంద అయినా ఒక్కదానివే ఎందుకు వెళ్లావ్. 
ముకుంద: అది ఆదికి ఇష్టమైన పువ్వు ఇవ్వాలని వెళ్లాను కానీ బ్యాడ్ లక్ తీసుకురాలేకపోయాను. సారీ ఆదర్శ్‌. 
ఆదర్శ్‌: అరే నీ కాలికి దెబ్బ తగిలింది అని నేను కంగారు పడుతుంటే నువ్వు కంగారు పడతావేంటి. ఆదర్శ్‌ కాలిని తాకడానికి చూస్తే ముకుంద ముందే అరుస్తుంది. 
ముకుంద: అంటే ఇప్పటి వరకు చేసిన సేవలు చాలు కాలు పడితే ఇబ్బందిగా ఉంటుంది.
కృష్ణ: మీ ఆయనే కదా తప్పేముంది. 
ముకుంద: తప్పొప్పులు కాదు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనసులో.. ఇప్పటికే మోసం చేస్తున్నాను అనే గిల్ట్‌ ఫీలింగ్‌తో చచ్చిపోతున్నాను. ఇక సేవలు చేయించుకోవడం కూడానా..
మురారి: సరే కృష్ణ దెబ్బ గట్టిగా తగిలిందేమో చూడు. అవసరం అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్దాం. 
కృష్ణ: బోన్ ఫ్యాక్చర్ ఏం లేదు ఏసీపీ సార్. నిజంగా కాలు బెనికిందా లేదా ఆదర్శ్‌తో రాత్రి కలిసి ఉండలేక కాలు బెనికినట్లు నాటకం ఆడుతుందా.. కాలు బెనికితే పాదం మొత్తం నొప్పి ఉండదే. ఒకవేళ నొప్పి ఉంటే ఇందాక అంత ఈజీగా కాలు కదపదే. 
ఆదర్శ్‌: కృష్ణ ఏం చేద్దాం హాస్పిటల్‌కి వెళ్దామా..
కృష్ణ: ఏం పర్లేదు వేడి నీళ్లు కాపడం పెడితే సరిపోతుంది. నేను వెళ్లి మెడిసిన్ తీసుకొస్తా..
ముకుంద: కృష్ణ నువ్వు వెళ్లొద్దు ఇక్కడే ఉండు. 
కృష్ణ: ఆదర్శ్‌ ఉన్నాడు కదా ముకుంద.
ముకుంద: లేదు నువ్వే ఉండు. ఏదైనా అవసరం వస్తే ఆదితో చేయించుకోవడం కష్టంగా ఉంటుంది.కృష్ణ ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండు..
మురారి: నేను ఆదర్శ్‌ ఆ రూంలో ఉంటాం. నీకు ఏం అవసరం అయినా చెప్పండి.
ముకుంద: ఇంటికి వెళ్లే వరకు కృష్ణని వదలకూడదు. 
కృష్ణ: ఆదర్శ్‌తో శోభనంలో హాయిగా ఉండాల్సిన దానివి. ఇలా బెడ్ మీద ఉన్నావ్.
ముకుంద: శోభనం తప్పించుకోవడానికే ఇలా నాటకం ఆడుతున్నది. ఇంతలో కృష్ణ వేడి నీరు తీసుకురావడానికి బయటకు వెళ్తే ముకుంద ఫోన్ తీసుకోవడానికి లేస్తుంది. అది కృష్ణ చూసేస్తుంది. కృష్ణ చూడటంతో ముకుంద కాలు నొప్పి అన్నట్లు నాటకం ఆడుతుంది.
కృష్ణ: నిజంగానే కాలు బెనికిందా లేక ఆదర్శ్‌తో ఈ రాత్రి ఇక్కడ ఉండటం ఇష్టం లేక నాటకం ఆడుతుందా.. ముకుందా.. 
ముకుంద: కృష్ణ కాలికి దెబ్బ తగిలింది అని మర్చిపోయి అలవాటు ప్రకారం లేచేశాను.
కృష్ణ: ఏం కాదులే ముకుంద. 
మురారి: ముకుందకి ఎలా ఉంది.
కృష్ణ: బాగానే ఉంది ఏసీపీ సార్. మనసులో అసలు ఏమైనా అయితే కదా రాత్రి తగిలినది అసలు దెబ్బే కాదు కానీ ఎందుకు అంతలా నటిస్తుందో నాకు అర్థం కావడం లేదు. శోభనం నుంచి తప్పించుకోవడానికి అయినా ఆదర్శ్‌ అంటే ఇష్టమే కదా ఎందుకు అలా తప్పించుకుంటుంది. అంత సీరియస్ కండీషన్ ఏం కాదు ఏసీపీ సార్. ముకుంద ఎప్పుడు అనుకుంటే అప్పుడు నయం అవుతుంది.
మురారి: ముకుంద అనుకుంటే నయం కావడం ఏంటి. 
కృష్ణ: అదే ముకుంద తట్టుకునే శక్తి బట్టి ఉంటుంది. ఏసీపీ సార్‌కి ఏదీ చెప్పకుండా దాచే అలవాటు లేదు కానీ ఈ అనుమానాన్ని మాత్రం చెప్పకుండా దాయాల్సిందే. ముకుంద శోభనం ఇష్టం లేక ఇలా చేసిందో లేక ఆదర్శ్‌ అంటే ఇష్టం లేక ఇలా చేసిందో తెలియడం లేదు. 

ఇంతలో ముకుంద, ఆదర్శ్‌ వస్తారు. ముకుందని చూసిన కృష్ణ రాత్రి అంత పెద్ద దెబ్బ తగిలినందుకు ఇప్పుడు కాలు నేల మీద పెట్ట లేదు. అలాంటిది ఇలా ఎలా నడిచి వస్తుంది అనుకుంటుంది. ముకుందకు ఇంకా కొన్ని పరీక్షలు పెట్టి తన అనుమానం తీర్చుకుంటాఅని అంటుంది. ఇక ఆదర్శ్‌ ముకుంద ఇంటికి వెళ్లిపోదాం అంటుంది అని చెప్తాడు. దానికి సరే వెళ్లి పోదాం అని కృష్ణ అంటుంది. ఇక కారులో ఆదర్శ్‌కి దగ్గరగా కూర్చొ అని కృష్ణ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్ ఫిబ్రవరి 21st: నయని, విశాల్‌లను చంపేందుకు తిలోత్తమ కుట్ర, అక్క మీద కోపంతో విషం కలిపిన సుమన!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget