Krishna Mukunda Murari Serial Today April 30th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: కృష్ణకు నిజం తెలిస్తే గుండె పగిలిపోవడం ఖాయమన్న ముకుంద.. మురారి బిడ్డను తానే కనబోతుందా!
Krishna Mukunda Murari Serial Today Episode : కృష్ణ నెలతప్పిందని అనుకున్న భవాని ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode : కృష్ణ, మురారిలు డాక్టర్ వైదేహి దగ్గరకు వస్తారు. ఆ విషయం తెలుసుకున్న ముకుంద వైదేహికి కాల్ చేసి మాట్లాడుతుంది. తన ప్లాన్ అంతా డాక్టర్‌కి చెప్తుంది. ఇక నర్స్ కృష్ణ వాళ్లని కాసేపు వెయిట్ చేయమని చెప్తుంది. కృష్ణ భవానికి ఇచ్చిన మాట గుర్తు చేసుకొని బాధ పడుతుంటుంది.
మురారి: ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్ నిర్ణయం తీసుకున్నాం కదా..
కృష్ణ: సరోగసీ గురించి నేనేం ఆలోచించడం లేదు ఏసీపీ సార్ ఇంట్లో పరిస్థితులు ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే ఎన్ని రోజులు ఈ నిజాన్ని దాయాలో.. అసలు నా జీవితం ఎటు పోతుందో ఇంకా ఎన్ని ఎదుర్కొవాలో అని తలచుకుంటేనే భయం వేస్తుంది ఏసీపీ సార్.
మురారి: కొన్ని విషయాలు ఎంత ఆలోచిస్తే అంత భయం ఎక్కువవుతుంది కృష్ణ. కానీ మనకు మిగిలిన ఆ అదృష్టం ఏంటో తెలుసా నువ్వు తొమ్మిది నెలలు మోయకపోయినా మనకు బిడ్డ పుడుతుంది. అన్నీ మర్చిపోయి పెద్దలకు ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచిద్దాం.
కృష్ణ: ఈ విషయం పెద్దత్తయ్యకు తెలిస్తే.
మురారి: తెలుస్తుంది. అసలు బిడ్డలు లేకుండా ఉండటం కంటే ఇలా అయినా బిడ్డలు పొందడం బెటర్ కదా. ఇప్పుడే చెప్తే భయం ఉంటుంది. అదే సరోగసీ సక్సెస్ అయితే నమ్మకం కలుగుతుంది. కొద్ది రోజులు ఆగి చెబుదాం. అంత వరకు ఇంట్లో ఏం జరిగినా నీకు తెలీనట్లు ఏం జరగనట్లు ఉంటేనే మంచిది.
డాక్టర్ కృష్ణ, మురారిలను లోపలికి పిలిపిస్తుంది. మరోవైపు భవాని కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి కాఫీ తీసుకొని వస్తుంది. భవాని రేవతికి కృష్ణ గురించి అడుగుతుంది. హాస్పిటల్‌కి వెళ్లిందని చెప్తుంది.
భవాని: కృష్ణ కంగారు చూస్తుంటే నెల తప్పిందేమో అనిపిస్తుంది.
రేవతి: అక్క అలాంటిది ఏమైనా ఉంటే మనకు చెప్తుంది కదా. కృష్ణ కడుపులో ఏదీ దాగదు.
భవాని: ఏమో మనకు సడెన్ సర్‌ఫ్రైజ్ ఇవ్వాలి అనుకున్నారేమో.. ఒకవేళ వాళ్లు హాస్పిటల్‌కి వెళ్లుంటే తను కచ్చితంగా నెలతప్పినట్లే. ఇక భవాని హాస్పిటల్‌కి కాల్ చేస్తుంది. కృష్ణ వాళ్లు ఎందుకు హాస్పిటల్‌కి వచ్చారు అని అడుగుతుంది. దీంతో రిసెప్షనిస్ట్ వాళ్ల ప్రెగ్నెన్సీ కోసం వచ్చారు అని చెప్తే భవాని కృష్ణ ప్రెగ్నంట్ అని ఫిక్స్ అయిపోతుంది.
భవాని: నేను చెప్పానా రేవతి. మన కృష్ణ నెల తప్పింది. ఎప్పుడెప్పుడు ఈ శుభవార్త నాకు చెప్తారా అని నేను ఎదురు చూస్తుంటే నాకు చెప్పకుండా సర్‌ఫ్రైజ్ ఇద్దామని చూస్తారా.. ఇప్పుడు చూడు. వాళ్లకి నేనే సర్‌ఫ్రైజ్ ఇస్తాను.. మధు.. మధు.. ఏంటి రేవతి కోడలు నెల తప్పింది అన్న సంతోషమే నీలో లేదు.
మధు: ఏంటి కృష్ణ నెల తప్పిందా..
రేవతి: రేయ్ నువ్వు ఉండరా.. అది కాదు అక్క. కృష్ణ నిజంగా నెల తప్పితే మనకు చెప్పకుండా ఎందుకు ఉండేది. పరుగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని మరీ చెప్పేది.
భవాని: రేవతి ఈ మధ్య పిల్లలు అలా లేరు మనల్ని ఆశ్చర్య పరచాలని రకరకాలు ప్లాన్ చేస్తున్నారు. పోనీ మనం పొరపాటు పడుతున్నాం అనుకుంటే హాస్పిటల్ వాళ్లు చెప్పారు కదా. అవన్నీ ఆలోచించకు. నా కోడలు తల్లి కాబోతుంది రేవతి. నా కోరిక నెరవేరబోతుంది. నిజమే అదంతా నువ్వేం అనుమానం పెట్టుకోకు. మనం ఇది సెలబ్రేట్ చేసుకోవాలి. నా ఫ్రెండ్స్ సరస్వతి, సుచిత్రలకు ఫోన్ చేసి ముఖం మీద కొట్టినట్లు పిలుస్తాను చూడు. అని ఫోన్ చేసి పార్టీకి రమ్మంటుంది. ఇక మధు, సంగీతలకు పార్టీ పనులు చూసుకోమని చెప్తుంది.
కృష్ణ: మేడం సరోగసీ మదర్ దొరకడానికి ఎంత టైం పడుతుంది.
వైదేహి: 2, 3 నెలలు పడుతుంది.
కృష్ణ: అన్ని నెలలా మేడం అది చాలా ఎక్కువ టైం మేడమ్. వీలైనంత తొందరగా దొరికేలా చూడండి.
మురారి: ఈరోజు రేపు దొరికినా మాకు పర్లేదు. డబ్బు ఎంత అయినా పర్లేదు.
వైదేహి: ఎందుకు అంత తొందర పడుతున్నారు. సరోగసీ అంటే ఆషామాషీ విషయం అనుకుంటున్నారా. ఒక్కోసారి ఆరు నెలలు గడిచినా మదర్ దొరకకపోవచ్చు. మీరు డాక్టర్ కదా మీకు తెలీదా.. సరే మీరు ఇంతలా తొందర పడుతున్నారు కాబట్టి ఓ పని చేస్తాను. మీలాగే ఓ జంట సరోగసీ కోసం వచ్చారు. వాళ్ల కోసం ఓ మదర్‌ని చూశాను. ఇక రెండు నెలలు ఆగమని వాళ్లని రిక్వెస్ట్ చేస్తా వాళ్లు సరే అంటే వెంటనే మీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను.
కృష్ణ: ప్లీజ్ మేడం మీరు చెప్తే వాళ్లు వింటారు. అయితే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు కదా.. సరోగసీకి ఒప్పుకుంది కదా ఆ అమ్మాయి ఎవరు మేడం. తనేవరో తెలుసుకోవాలి అని క్యూరియాసిటీగా ఉంది. మరోవైపు ముకుంద వస్తుంది.
వైదేహి: మీరు మళ్లీ డాక్టర్ అని మర్చిపోతున్నారు కృష్ణ. ఆ డిటైల్స్ చెప్పకూడదు అని మీకు తెలీదా..
కృష్ణ: అది బయట వాళ్లకు మేడం నేను డాక్టరే కదా నా వల్ల ఏ ప్రాబ్లమ్ ఉండదు. నాకు చెప్పండి.
వైదేహి: మీ వల్ల ఏ ప్రాబ్లమ్ రాదు. కానీ తన వల్ల మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే. రేపు బిడ్డని కని మీకు ఇచ్చాక ఆ బిడ్డ మీద ప్రేమతో మీ దగ్గరకు వస్తే లేనిపోని తలనొప్పులు కదా. అందుకే ఒకరి గురించి ఒకరికి చెప్పం.
కృష్ణ: సరే మేడం ఆవిడని మేం కలవం. కాని ఒక్కసారి ఆవిడని చూపించండి. బయటకు వెళ్లిన తర్వాత.. ఏసీపీ సార్ ఆవిడ ఎవరో తెలిస్తే తనని నేనే జాగ్రత్తగా చూసుకుంటా.
మురారి: ఆ అమ్మాయి ఎవరో తెలిశాక నేనే తనని నీ దగ్గరకు తీసుకొస్తా జాగ్రత్తగా చూసుకుందువులే..
ముకుంద: నిజం తెలిసిన రోజు కృష్ణ గుండె పగిలిపోవడం ఖాయం.
మరోవైపు ఇంట్లో పార్టీ హడావుడి మొదలవుతుంది. సంగీత, మధు కలిసి డ్రింక్స్ ఇస్తారు. రజిని మధుని తిడుతుంది. ఇక హడావుడి ఏంటని ఆదర్శ్ మధుని అడిగితే కృష్ణ నెల తప్పిందని పెద్ద పెద్దమ్మ పార్టీ ఇస్తుందని చెప్తాడు. ఆదర్శ్ షాక్ అయిపోతాడు. ఇక సుచిత్ర, సరస్వతి వస్తారు. మధుని ఆదర్శ్‌ని వాటి నోటి దురుసుతో మాటలు అనేస్తారు. మరోవైపు కృష్ణ, మురారిలు ఇంటికి వస్తుంటారు. దారిలో ఓ మహిళ ఎండలో మామిడి కాయలు బుట్ట పెట్టుకొని కూర్చొని ఉంటే జాలిపడి వాటిని కొనాలి అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.