అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today April 27th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: జీవితంలో పిల్లలు పుట్టరని గుండె పగిలేలా ఏడ్చిన కృష్ణ.. మురారికి సరోగసి ఐడియా ఇచ్చిన ముకుంద!

Krishna Mukunda Murari Serial Today Episode హాస్పిటల్‌కి వచ్చిన కృష్ణకు నిజం తెలిసి పోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode కృష్ణ హాస్పిటల్‌కి వస్తుంది. డాక్టర్ పరిమళ అమెరికా వెళ్లిపోయిందని తెలుసుకొని బాధపడుతుంది. ఇక మురారికే అడిగి నిజం తెలుసుకుంటాను అనుకుంటుంది. ఇక పరిమళ సడెన్‌గా యూఎస్ వెళ్లిందేంటా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మరోసారి కృష్ణకు కడుపునొప్పి వస్తుంది. హాస్పిటల్‌లోనే కుప్పకూలిపోతుంది. భరించలేకపోతున్నా అని అంటుంది. గైనిక్ మహేశ్వరి దగ్గరకు తనని తీసుకెళ్లమని అంటుంది.  

మరోవైపు రేవతి కృష్ణని పిలుస్తుంది. మురారి కనిపించడంతో కృష్ణ గురించి అడుగుతుంది. కృష్ణ గుడికి వెళ్తానని చెప్పిందని వెళ్లుండొచ్చని మురారి అంటాడు. దాంతో రేవతి ఒక్కదాన్నే ఎందుకు వదిలావని తీసుకురమ్మని చెప్తుంది. దాంతో మురారి మనసులో తాను కృష్ణ దూరంగా ఉంటేనే మంచిదని లేదంటే తాను కృష్ణకు నిజం చెప్పేస్తానని మురారి అనుకుంటాడు. ఇక మురారికి ఫోన్ వస్తుంది. కృష్ణ గురించి చెప్తే మురారి షాక్ అయిపోతాడు. 

కృష్ణ: మళ్లీ టెస్టులు ఎందుకు చేస్తున్నారు. మొన్ననే కదా పరిమళ మేడం టెస్టులు చేసి ఏ ప్రాబ్లమ్ లేదని చెప్పారు. 
మహేశ్వరి: నీకు అబద్ధం చెప్పారు.
కృష్ణ: ఏంటి డాక్టర్ పరిమళ మేడం నాకు అబద్దం చెప్పడం ఏంటి. 
మహేశ్వరి: నిజం నీ దగ్గర దాచినట్లున్నారు. 
కృష్ణ: ఏమైంది డాక్టర్ వాళ్లు నా దగ్గర నిజం దాయడం ఏంటి. అసలు నాకు ఏమైంది. ఆ రిపోర్ట్స్‌లో ఏముంది. ఒకసారి ఇవ్వండి. 
మహేశ్వరి: నీ గర్భసంచి పూర్తిగా పాడైంది కృష్ణ ఇక నీకు పిల్లలు పుట్టకపోవచ్చు. ఇంత వరకు ఎందుకు తెచ్చుకున్నావ్ కృష్ణ డాక్టర్‌వే కదా..
కృష్ణ: ఏడుస్తూ మనసులో.. ఏసీపీ సార్ బాధ పడటానికి కారణం ఇదా. నిజం చెప్తే నేను ఏమైపోతానని చెప్పకుండా పాపం ఒక్కరే ఎంత కుమిలిపోయి ఉంటారో. 
మహేశ్వరి: డాక్టర్స్‌గా మనమే ఎంత మందికి ధైర్యం చెప్తాం మనం ధైర్యం కోల్పోతే ఎలా కృష్ణ. 
మురారి: కృష్ణ ఏమైంది. మళ్లీ కడుపు నొప్పి వచ్చిందా.. గుడికి వెళ్తా అన్నావ్ కదా హాస్పిటల్‌కి ఎందుకు వచ్చావ్. ఇప్పుడు ఎలా ఉంది. డాక్టర్ ఎలా ఉంది ఇప్పుడు కృష్ణకి.  
కృష్ణ: ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఏసీపీ సార్. నా గర్భసంచి పోయింది ఏసీపీ సార్. గర్భ సంచి తీసేయాలి. పిల్లలు పుట్టరు అంతే కదా ఏసీపీ సార్.. అని గట్టిగా ఏడుస్తుంది. మనం ఎవరికి ఏం అన్యాయం చేశాం సార్. దేవుడు ఎందుకు మనకు ఇంత శిక్ష వేశాడు.
ముకుంద: తనలో తాను.. నాకు అన్యాయం చేశావ్ కదే అందుకే నీకు దేవుడు నా ద్వారే ఈ శిక్ష వేశాడు. 
కృష్ణ: కానీ ఈ బాధ కంటే ఈ నాలుగు రోజులు మీరు ఎంత బాధపడ్డారో అని తలచుకుంటేనే బాధ ఎక్కువైపోతుంది. ఏ చిన్న విషయం నాకు చెప్పకుండా దాచలేని మీరు ఇంత పెద్ద విషయం ఎలా దాచారు. 
మురారి: నిజంగా అద్భుతం కృష్ణ. బిడ్డలను కంటేనే స్త్రీ జీవితం పరిపూర్ణం అవుతుంది అని తెలిసి కూడా నాకోసం ఆలోచిస్తున్నావ్ అంటే ఇది చాలు కృష్ణ ఎంత కష్టం అయినా భరించేస్తాను. మిగతా టెన్షన్స్ అన్నీ ఎలా అయినా మ్యానేజ్ చేస్తాను. 
కృష్ణ: నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లండి ఏసీపీ సార్. అక్కడ మీరు నేనే ఉండాలి. ప్రశాంతంగా మాట్లాడుకునే చోటు కావాలి. మనసులో ఉన్న బాధ కంటే కడుపులో ఉన్న నొప్పి వల్ల వచ్చే బాధ ఎక్కువేం కాదు. 

కృష్ణ తన పెద్దమ్మతో చెప్పిన మాటలు తలచుకొని మురారి బాధ పడతాడు. ఇక మురారి దగ్గరకు ముకుంద వస్తుంది. మీరు ఎందుకు వచ్చారని మురారి అడిగితే కంగారుగా మీరు హాస్పిటల్‌కి రావడం చూసి నేను కంగారుగా వచ్చానని అంటుంది. కృష్ణ గురించి తెలిసిపోయిందేమో అని మురారి  టెన్షన్ పడతాడు. తాను హాస్పిటల్‌కి వచ్చాను అని నీకు ఎలా తెలుసని ముకుందను అడిగితే పరిమళ కాల్ లిఫ్ట్ చేశానని ముకుంద చెప్తుంది. 

ముకుంద: ఆవిడ చెప్పిందంతా విన్నాను. కృష్ణ పరిస్థితి తెలిసి మీరు ఎంత కంగారుగా వచ్చారో నేను అంతే కంగారుగా వచ్చాను. ఇక్కడికి వచ్చి మొత్తం విన్నాక..
మురారి: ఇంట్లో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు కదా.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. 
ముకుంద: నేను ఎవరికీ చెప్పను మురారి గారు. చెప్తే ఇంట్లో అందరూ ఎంత కంగారు పడతారు కదా..
మురారి: ఇంట్లో ఎవరికీ చెప్పను అని నాకు మాట ఇవ్వండి.
ముకుంద: చెప్పను మురారి గారు. ఈ నాలుగు రోజులు మీరు ఎంత నరకం అనుభవించారో నాకు తెలుస్తుంది. ఇంట్లో వాళ్లకి విషయం తెలిస్తే ఎంత బాధపడతారో అనే కదా మీరు చెప్పలేదు. ఇప్పుడు ఈ కుటుంబం పట్ల నాకు అంతే బాధ్యత ఉంది. అప్పటి నుంచి ఆలోచిస్తున్నా కృష్ణ అంటే ఏదో మొండి ధైర్యంతో తట్టుకుంది కానీ ఈ విషయం భవాని మేడంకి తెలిస్తే ఎలా తట్టుకుంటారో..
మురారి: అదే నాకు భయం వేస్తుంది. ఈ నిజం ఎన్నో రోజులు దాయలేం. అప్పుడు పెద్దమ్మ ఎలా తట్టుకుంటారో అని నాకు భయం వేస్తుంది.
ముకుంద: నా దగ్గర ఓ ఐడియా ఉంది. కృష్ణ తొమ్మిది నెలలు బిడ్డని మోయకపోయినా మీ పెద్దమ్మకు వారసుడిని ఇవ్వొచ్చు. 
మురారి: దత్తత తీసుకోమంటున్నావా..
ముకుంద: నోనో.. దత్తత కాదు.. మీ పెద్దమ్మకు కావాల్సింది వారసత్వం మీ రక్తం. 
మురారి: అక్కడ కృష్ణకు గర్భసంచి తీసేయాలి అనుకుంటే పిల్లల్ని కనడం ఎలా అవుతుంది. 
మురారి: అవుతుంది దానికి ఓ మార్గం ఉంది. అదే సరోగసీ. అవును గర్భాన్ని అద్దెకు తీసుకోవడం. కృష్ణ గర్భంలో బిడ్డ పెరిగే అవకాశం లేదు కాబట్టి వేరే ఎవరైనా గర్భం అద్దెకు తీసుకొని అందులో మీ బిడ్డను పెంచడం. అది మీ బిడ్డే అవుతుంది.
మురారి: బాగానే ఉంది. కానీ..
ముకుంద: ఎక్కువ ఆలోచించకండి మురారి. ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితిలో ఇదే బెస్ట్ సొల్యూషన్. మనసులో.. కృష్ణ తప్పకుండా ఒప్పుకుంటుంది. ఒప్పుకోవాలి. అప్పుడే కదా కథ కొత్త మలుపు తిరుగుతుంది. నా కంట్రోల్‌లో ఉంటుంది.

మరోవైపు తనకు ఇంత పెద్ద శిక్ష ఏంటని కృష్ణ ఏడుస్తుంది. మురారి కృష్ణకు జ్యూస్ తీసుకొని వచ్చి ఇస్తాడు. సరోగసి గురించి కృష్ణకు చెప్పాలా వద్దా అని మురారి ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమను అల్లాడించిన గుర్రపు హోరు, గుండె పట్టుకొని విలవిల్లాడిన వైనం.. విశాలాక్షి వస్తేనే పరిష్కారం!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget