Krishna Mukunda Murari July 26th: కృష్ణ మనసు ముక్కలు చేసిన మురారీ- పట్టరాని ఆనందంలో ముకుంద
కృష్ణ, మురారీని విడదీసేందుకు ముకుంద ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ స్టేజ్ మీద మాట్లాడుతూ మురారీ మీద తనకున్న ప్రేమని ఇన్ డైరెక్ట్ గా చెప్తుంది. కానీ ముకుంద మాత్రం మురారీని తప్పుదారి పట్టించేలా మాట్లాడుతుంది. కృష్ణకి నువ్వేం ప్రత్యేకం కాదని ముకుంద ఎక్కిస్తుంది.
మురారీ: కృష్ణ నన్ను ఆరాధిస్తుంది అంతే కానీ నన్ను ప్రేమించడం లేదని సన్మానం నుంచి వెళ్ళిపోతాడు. తను అనుకున్నది జరిగినందుకు ముకుంద సంతోషపడుతుంది. ఈ సన్మానం ఏసీపీ సర్ చేతుల మీదుగా జరిగితే హ్యపీగా ఫీలవుతానని కృష్ణ అందరినీ అడుగుతుంది. మురారీ కనిపించకపోయే సరికి గట్టిగా ఏసీపీ సర్ ఎక్కడున్నారు, మీరు స్టేజ్ మీదకు రావాలని మైక్ లో గట్టిగా పిలుస్తుంది. మురారీ బయట నిలబడి ఆ మాటలు వింటూ ఉంటాడు. అందరూ మురారీ కోసం చూస్తారు. ఇంకెక్కడ మురారీ నీ సన్మానంలో నుంచే కాదు నీ మనసులో నుంచి కూడా వెళ్లిపోయాడని ముకుంద సంతోషపడుతుంది.
కృష్ణ: ఏసీపీ సర్ మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు ప్లీజ్ స్టేజ్ మీదకి రండి
భవానీ: రేవతి ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు ఏమైంది వీడికి ఎక్కడికి వెళ్ళాడు
రేవతి: తెలియదక్కా ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు
కృష్ణ: ఏసీపీ సర్ మీరు రాకపోతే నేను ఈ అవార్డు తీసుకోను. మీరు లేని ఈ సన్మానం నాకు అక్కర్లేదు
Also Read: 'గుప్పెడంత మనసు' సీరియల్: పైకి ఈగో, లోపల మాత్రం చెప్పలేనంత ప్రేమ- శైలేంద్ర నోరు మూయించేసిన జగతి
పరిమళ కృష్ణకి నచ్చ జెప్పడానికి చూస్తుంది కానీ కృష్ణ తన వల్ల కాదని వెళ్లిపోతుంటే భవానీ సర్ది చెప్తుంది. మన కోసం వాళ్ళని అవమానించడం తప్పు నిన్ను ఎప్పుడు నేనేది అడగలేదు నా మాట విను ప్లీజ్ కృష్ణ అంటుంది. వాడు ఏమి నీకు శాశ్వతంగా దూరం అవడం లేదు కదా ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళాడు.
కృష్ణ: ఏసీపీ సర్ మనసులో నేను లేను ఆ డైరీ అమ్మాయే ఉంది అందుకే సన్మానం నుంచి వెళ్లిపోయారని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అత్తయ్య ఈ సన్మానం మీ చేతుల మీదుగా జరిపించండి
భవానీ చేతుల మీదుగా కృష్ణకి సన్మానం జరుగుతుంది. ఇక మురారీ రోడ్డు మీద ఒంటరిగా నిలబడి కృష్ణతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అటు ఇంట్లో కృష్ణ కూడా అదే ఆలోచిస్తుంది. భవానీ మురారీ వచ్చాడా అని ఇంట్లో వాళ్ళని అడుగుతుంది. రాలేదని ప్రసాద్ చెప్తాడు. అప్పటి వరకు అక్కడే ఉన్న వాడు అంతలోనే ఎలా మాయం అయ్యాడని భవానీ ఆలోచిస్తుంది. రేవతిని పిలిచి మురారీకి ఫోన్ చేయిస్తుంది. అప్పుడే మురారీ ఇంటికి వస్తాడు.
భవానీ: ఎక్కడికి వెళ్లావ్
మురారీ: ఏమర్జెన్సీ కాల్ వస్తే వెళ్లాల్సి వచ్చింది
భవానీ: నీకోసం అది పిచ్చిదానిలా అంత గొప్పగా చెప్తుంటే నువ్వు రాకపోయే సరికి మా అందరి తలలు తీసేసినట్టు అయ్యింది. అసలు నువ్వు లేకుండా సన్మానమే చేసుకొనని అంది. అక్కడ ఉన్న పెద్దవాళ్ళని కాదని నీ చేతుల మీదగా చేయించుకోవాలని అనుకుంది కానీ నువ్వు సన్మానం మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయావ్. అంత ఎమర్జెన్సీ కాల్ ఏంటి?
మురారీ: ఒక అమ్మాయి కాల్ చేసి తనని రౌడీలు తరుమురున్నారని కాపాడమని చెప్పింది. అందుకే ఆపదలో ఉన్న తనని రక్షించేందుకు వెళ్ళాను
కృష్ణ: తప్పించుకోవడానికి ప్రొఫెషన్ ని అడ్డం పెట్టుకుంటున్నారు
భవానీ: నువ్వు అబద్ధం చెప్తున్నావ్ మురారీ
Also Read: ముకుంద కుట్రతో సన్మానం నుంచి వెళ్ళిపోయిన మురారీ - కృష్ణ దూరం కాక తప్పదా?
కృష్ణ; వదిలేయండి అత్తయ్య ఆయన అబద్దం చెప్పరు, అది మీతో ఎప్పుడు చెప్పరు. అంతగా చెప్తున్నారంటే నిజమే
భవానీ: అక్కడ నువ్వు అంతగా బాధపడి ఇక్కడ తనని వదిలేయమని అంటున్నావ్. ఏంటి ఇది మీ ఇద్దరి మధ్య అన్యోన్యత లేదంటే ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ నా? అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య?
ముకుంద: ఏమైంది మురారీ మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? మీరు బాగానే ఉంటున్నారు కదా మనం నైట్ మాట్లాడుకున్నప్పుడు కూడా గొడవ పడుతున్నట్టు చెప్పలేదు కదా
రేవతి: వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు ముకుంద.. బాగుంటారు కూడ
ముకుంద: బాగుంటే సన్మానంలో ఎందుకు స్టేజ్ మీదకి రాలేదు. కృష్ణని డాక్టర్ ని చేయాలని మురారీ ఎంత ట్రై చేశాడు. అలాంటప్పుడు తను స్టేజ్ మీదకు రాకపోతే మన కుటుంబం పరువు పోయినట్టే కదా. మీ ఇద్దరికీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి. అంతే కానీ మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదని నలుగురిలో బహిర్గతం చేయడం ఏంటి? అందరూ మన ఫ్యామిలీ గురించి ఏమనుకుంటారు? మీ మధ్య అన్యోన్యత లేదని నలుగురిలో తెలిసేలా చేయడం ఏంటి?
మురారీ: ముకుంద ఆపుతావా? సోరి పెద్దమ్మ
భవానీ: ఆగు మురారీ తప్పించుకోవాలని చూడకు