Krishna Mukunda Murari August 21st: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్ - షాకింగ్ నిర్ణయం తీసుకున్న భవానీ- ముకుందకి నిజం చెప్పిన మురారీ, రేవతి భయమే నిజమవుతుందా?
ముకుంద ప్రేమ సంగతి భవానీకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ముకుంద ప్రేమ సంగతి బయట పడటంతో భవానీ కోపంగా తనని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్తుంది. దీంతో ముకుంద భవానీ కాళ్ళ మీద పడి తన ప్రేమని పెళ్లి తర్వాత సమాధి చేసుకున్నానని అబద్ధం చెప్తుంది. తనని అక్కడి నుంచి తీసుకెళ్లిపొమ్మని చెప్తుంది. సడెన్ గా అలా ఎందుకు అడిగారని రేవతి భవానీని అడుగుతుంది. కల్నల్ కాల్ చేశాడని కోపంగా చెప్తుంది. కృష్ణ ఒంటరిగా కూర్చుని మురారీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది. దాచుకోలేనంత ప్రేమ, మోయలేనంత బాధ, మరచిపోలేని జ్ఞాపకాలు ఇవన్నీ తలుచుకుని ఉండటమే జీవితం అంటే అని బాధపడుతుంది. అప్పుడే తన ఫ్రెండ్ వచ్చి భోజనం చేయమని చెప్తే వద్దని అంటుంది. అప్పుడే మురారీ క్యాంప్ దగ్గరకి వచ్చి తనకి ప్రేమగా అన్నం తినిపించినట్టు ఊహించుకుంటుంది. మురారీని తినమని బతిమలాడుతుంటే తన ఫ్రెండ్ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావ్ ఏమైంది నీకు అని అడుగుతుంది. అప్పుడే కృష్ణ ఊహలో నుంచి బయటకి వస్తుంది.
ఆదర్శ్ కి ముకుందతో తన ప్రేమ విషయం తెలిసే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని మురారీకి అర్థం అవుతుంది. వాళ్లిద్దరితో భవానీ మాట్లాడుతుంది.
భవానీ: అందుకే ముకుందని పెళ్లికి ముందు ప్రేమ గురించి అడిగాను
Also Read: హీరోలా ఫైట్ చేసిన వేద- కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పిన మాళవిక, యష్ విడుదల
మురారీ: ముకుంద ఏం చెప్పింది పెద్దమ్మ
భవానీ: తను పెళ్లికి ముందు ఒకతన్ని ప్రేమించానని చెప్పింది. ఇప్పటికీ అతన్నే ప్రేమిస్తున్నావా అని అడిగితే మాత్రం లేదని చెప్పింది. కానీ తను అబద్ధం చెప్పిందని అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అర్థం అయ్యింది ముకుంద ఇన్నాళ్ళూ బాధపడింది ఆదర్శ్ కోసం కాదు తను ప్రేమించిన వాడి కోసం. అది తెలిసే ఆదర్శ్ ఇంటికి రావడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే మన ఆదర్శ్ ఎప్పటికీ తిరిగి రాడు. తను జీవితంలో విఫలమై వెళ్ళిపోయాడు. ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలి వాడికోసం ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ముకుంద నువ్వు ఫ్రెండ్స్ కదా తను ఎవరిని ప్రేమించిందో నువ్వే అడిగి తెలుసుకో. ఆదర్శ్ తో ముకుందకి విడాకులు ఇప్పించి తను ప్రేమించిన వాడితో తనకి పెళ్లి జరిపిద్దాం
మురారీ: పెద్దమ్మ నన్ను క్షమించు నేను ఒకప్పుడు ముకుందని ప్రేమించిన మాట నిజమే. కానీ ఆదర్శ్ ముకుందని ప్రేమించాడని తెలిసి నేను తనని ఎప్పుడూ ప్రియురాలిగా చూడలేదు. నన్ను క్షమించు పెద్దమ్మ అని చెప్పినట్టు ఊహించుకుంటాడు.
భవానీ: ముకుంద ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తే ఆదర్శ్ తిరిగివస్తాడు. అప్పుడు తను కూడా హ్యపీగా ఉంటుంది. మన ఆదర్శ్ మన కళ్ళ ముందు ఉంటాడు
ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరుగుతుందని రేవతి ఏడుస్తుంది. వెంటనే ముకుంద ప్రేమించిన వ్యక్తిని తెలుసుకునే పనిలో ఉండమని చెప్తుంది. తనకి క్యాంప్ ఉందని ఆ పనిలో ఉండాలని మురారీ చెప్పి తప్పించుకుంటాడు. భవానీదేవికి తన ప్రేమ సంగతి తెలిసినందుకు ముకుంద హ్యాపీగా ఉంటుంది. అప్పుడే మురారీ వస్తాడు.
ముకుంద: ఏమైంది ఎందుకంత డల్ గా ఉన్నావ్
మురారీ: దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో
Also Read: లక్కీని ముద్దు చేస్తూ తులసికి దొరికిపోయిన నందు- తల్లీకూతుళ్ల దెబ్బకి విలవిల్లాడుతున్న తోడు దొంగలు
ముకుంద: నీకోసం నేను ఇంతగా ఆరాటపడుతుంటే నన్ను ఎందుకు నొప్పిస్తున్నావ్. ఏడాదిగా మనకి మనశ్శాంతి లేకుండ పోయింది. ఇన్నాళ్ల తర్వాత నాకు నువ్వు నీకు నేను ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం వచ్చింది. నువ్వేమో నన్ను వెళ్లిపొమ్మని చెప్తున్నావ్
మురారీ; పెద్దమ్మ నిన్ను పిలిచి ఎవరినైనా ప్రేమించావని అడిగితే నిజం ఎందుకు చెప్పలేదు
ముకుంద: ఆ విషయం చెప్పి నిన్ను బాధపెట్టడం ఎందుకని చెప్పలేదు. నీలాగా నిజం చెప్పలేక తల వంచుకోలేదు. దారి తప్పిన నిన్ను ప్రేమతో మళ్ళీ నిన్ను నా దారిలోకి తెచ్చుకున్నాక ఎన్ని నిందలు అయినా మోస్తాను. నీ ప్రేమ కోసం ఏమైనా చేస్తాను. ప్రేమకి బాధ్యతకి తేడా తెలుసుకో. నిజమైన ప్రేమని తెలుసుకో. మన ప్రేమని బతికించుకోవడానికి ఇదే మంచి అవకాశం
మురారీ: ఆదర్శ్ ఆచూకీ తెలిసింది