Prema Entha Madhuram August 7th: అను పిల్లలను టార్గెట్ చేసిన కిడ్నాపర్స్.. ఆర్యను భయపెట్టిస్తున్న ఆడ శత్రువు?
ఇద్దరు కిడ్నాపర్స్ అను పిల్లలను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram August 7th: అను పిల్లలకు అన్నప్రసన చేయించడానికి వారిని ఉదయాన్నే లేపి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి రెడీ చేస్తుంది. ఇక మధ్య మధ్యలో ఆర్యను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆర్య వచ్చి పిల్లలతో ఆడుకుంటున్నాడన్నట్లు ఊహించుకుంటుంది. ఇక పిల్లలిద్దరిని చూసి బాధపడుతూ ఉండగా అక్కడికి రేష్మ, ప్రీతి వచ్చి ఏం జరిగింది అని అంటారు.
దాంతో అను పిల్లలకు ఈ తంతు మామూలుగా చేస్తున్నాను అని.. అదే ఆర్య సార్ ఉంటే గ్రాండ్ గా పెద్దగా చేసేవాడు అని.. ఈ విషయంలో పిల్లలను చాలా బాధ పెడుతున్నాను అని.. కనీసం వాళ్ళ దగ్గర కూడా లేరని బాధపడటంతో అప్పుడే రేష్మ నువ్విలా బాధపడతావని ఆర్య సార్ ని కూడా పిలిచాము అని అంటుంది. దాంతో అను థాంక్స్ అని చెప్పి సంతోషపడుతుంది.
అదే సమయంలో బయట ఇద్దరు కిడ్నాపర్స్ అను పిల్లలను టార్గెట్ చేసి వాళ్లని కిడ్నాప్ చేయాలని చూస్తారు. ఇక వాళ్ళ హెడ్ కూడా ఫోన్ చేసి ఎలాగైనా కిడ్నాప్ చేయాలి అని చెబుతారు. దానితో వాళ్ళు సరే అంటారు. మరోవైపు ఆర్య రెడీ అవుతుండగా జిండే అక్కడికి వస్తాడు. ఇవాళ తొందరగా వచ్చావు ఏంటి అని ఆర్య తనని అడగటంతో.. ఇవాళ ప్రీతి వాళ్ళ ఇంట్లో అను, రేష్మ పిల్లల అన్నప్రసన్న ఉంది కదా అక్కడికి వెళ్లి ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్లాలి అని అంటాడు.
దాంతో ఆర్యకు తన పిల్లలు గుర్తుకు రావటంతో వారిని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. తన పిల్లలు కూడా దగ్గరుంటే ఎన్నో చేసే వాడినని చెప్పుకుంటూ బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి ఫంక్షన్ కి వెళ్లడానికి అంజలి దంపతులు కూడా వస్తారు. ఇక ఆర్య బాధపడుతున్నట్టు కనిపించడంతో వెంటనే అంజలి ఏం జరిగింది అని అంటుంది. దానితో జిండే ఏమి లేదని ఇవాళ బిజినెస్ టెండర్ ఉంది కదా దాని గురించి ఆలోచిస్తున్నాము అని అనటంతో.. ఆ బిజినెస్ టెండర్ కచ్చితంగా మనకే వస్తుంది అని వాళ్లు అంటారు.
అప్పుడే ఈశ్వర్ ఫోన్ చేసి తమ బిజినెస్ టెండర్ క్యాన్సిల్ అయింది అని అనటంతో ఆర్య షాక్ అవుతాడు. ఇక వాళ్లకు కూడా తెలియటంతో వాళ్లు కూడా షాక్ అవుతారు. ఎంతకు డీల్ ఓకే అయ్యిందని అడగటంతో తాము పెట్టిన దానికంటే వెయ్యి రూపాయలు తక్కువ అని చెప్పడంతో ఆర్య ఆలోచనలో పడతాడు. దాంతో తమను రీచ్ అయ్యే వాళ్ళు ఎవరు అని.. ముఖ్యంగా తమ టెండర్ కోడ్ ఎవరికి తెలుసు అని ఆలోచిస్తుంటారు.
మరోవైపు అను పిల్లలు వస్తువులు తాకటానికి ఎదుట కొన్ని వస్తువులు పెడుతుంది. రేష్మ కు వాటి గురించి వివరిస్తూ ఉంటుంది. అప్పుడే కిడ్నాపర్లు అను ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ఏదో ఒకలా వెళ్లి పిల్లల్ని ఎత్తుకు రావాలని అనుకుంటారు. ఇక ఏం జరిగిందో తెలుసుకోవడానికి అంజలి దంపతులు ఆఫీస్ కి బయలుదేరుతారు.
ఇక టెండర్ ఆఫీస్ దగ్గరకు జిండే, ఆర్య కారులో బయలుదేరుతారు. అప్పుడే ఆర్య శత్రువైన ఒక ఆవిడ ఫోన్ చేసి ఆ బిజినెస్ కోడ్ తనే తెలుసుకున్నాను అని.. ఆ టెండర్ తనకే దక్కింది అన్నట్లుగా చెబుతుంది. అంతేకాకుండా భవిష్యత్తు దాని గురించి కూడా చెప్పి భయపెట్టిస్తూ ఉంటుంది. దాంతో ఆర్య ఫోన్ కట్ చేసి తను ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. అప్పుడే ప్రీతీ ఫోన్ చేసి ఫంక్షన్ కి రమ్మని చెబుతుంది.
also read it : Krishnamma kalipindi iddarini August 5th: నిజం చెప్పి గౌరీకి షాకిచ్చిన ఈశ్వర్.. మరో నిప్పు పెట్టడానికి సిద్ధమైన సౌదామిని?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial