అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today June 25th: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్య కోసం దీపకు గడువు పెట్టిన నర్శింహ, కార్తీక్ సాయం చేస్తాడా.. కాంచనకు చేరిన కార్తీక్, జ్యోల పెళ్లి ప్రస్తావన! 

Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్, జ్యోత్స్నల పెళ్లి చేద్దామని కాంచనతో చెప్పడానికి శివనారాయణ, పారిజాతం కాంచన ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప కాంచనతో తన భర్త రెండో పెళ్లి గురించి చెప్పాలని వస్తుంది. శ్రీధర్ స్టోరీని మరో వ్యక్తి కథగా చెప్తుంది. అది విన్న కాంచన వాడిని పోలీసులకు పట్టించాలని వదలకూడదని అంటుంది. దీప తన భర్త రెండో పెళ్లిని ధైర్యంగా ఎదురుకుంది కానీ ఆ పరిస్థితిలో తానే ఉంటే విషం తాగి చనిపోయేదాన్నని కాంచన అంటుంది. కాంచన మాటలకు దీప నిజం చెప్పకుండా ఆగిపోతుంది. ఇక కాంచన ఆ వ్యక్తి పేరు అడిగితే దీప చెప్పదు. నిజం తెలిసినా ఏం చేయలేకపోతున్నాను అని ఏదో ఒకరోజు మీరే మీ కొడుకుకు దొరుకుతారు శ్రీధర్ గారు అని దీప అనుకుంటుంది. మరోవైపు శివనారాయణ ఇంటికి దశరథ్ ఫ్రెండ్ తన కూతురు పెళ్లి అని పెళ్లి పిలుపునకు వస్తారు. 

శివనారాయణ: సాయినాథ్ కూతురు పెళ్లి మనం దగ్గరుండి జరిపించాల్సిందే.
పారిజాతం: హా.. వెళ్లండి.. వెళ్లండి ఇంకా ఊరిలో ఎవరి కూతుళ్లకు పెళ్లిళ్లు ఉన్నాయేమో తెలుసుకొని చేయండి. ఏ ఆ సాయినాథ్‌కే కూతురు ఉందా మన దశరథ్‌కి లేదా. జ్యోత్స్న కంటే చిన్నది దానికే పెళ్లి అవుతుంటే మన మనవరాలికి పెళ్లి చేయరా. ముందు మన మనవరాలి పెళ్లి గురించి ఆలోచించండి. రేపు ఏదో జరిగి బాధ పడటం కంటే అంతా బాగున్నప్పుడే పెళ్లి చేయండి. ముహూర్తాలు వచ్చేశాయి. ఇంక ఆలస్యం చేయకుండా పెళ్లి చేయండి.
సుమిత్ర: మామయ్య గారు అత్తయ్య గారు చెప్పింది కరెక్ట్. వదిన, అన్నయ్యలో పెళ్లి గురించి మాట్లాడుదాం. 
శివనారాయణ: సుమిత్ర చెప్పింది నిజమేరా రేపు మీరిద్దరూ వెళ్లి పెళ్లి గురించి మాట్లాడండి.
సుమత్ర: ఇంటి పెద్ద మీరే మామయ్య గారు మీరే వెళ్లి మాట్లాడితే బాగుంటుందేమో. 
శివనారాయణ: సరే అమ్మ రేపే వెళ్లి పెళ్లి గురించి మాట్లాడి వస్తా.

స్వప్న తన తండ్రిని మరో ఆవిడతో చూసిన సంఘటన గుర్తు చేసుకుంటుంది. కార్తీక్, దీపల మాటలు తలచుకుంటుంది. తల్లితండ్రులు రావడంతో శ్రీధర్‌తో కొత్తగా మాట్లాడుతుంది. శ్రీధర్ స్వప్నకు చాక్లెట్ ఇస్తే చాక్లెట్ కంటే కొబ్బరి బొండాం ఆరోగ్యానికి మంచింది కదా డాడీ అంటుంది. శ్రీధర్ కాంచన గురించి గుర్తు చేసుకుంటాడు. తండ్రికి ఆ విషయం అడగాలా వద్దా అనుకుంటుంది. తన తండ్రి తల్లికి అన్యాయం చేస్తాడా అని అనుకుంటుంది. కానీ తన తండ్రి చాలా మంచోడని అనుకుంటుంది. 

కాంచన ఇంటికి శివనారాయణ, పారిజాతం వెళ్తారు. భోజనం చేస్తూ వంటలు బాగున్నాయని పొగుడుతారు. దాంతో కాంచన దీప వంటలు చేసిందని అంటుంది. తనకు ఆరోగ్యం బాలేదని కార్తీక్ చెప్పడంతో దీప వచ్చి సాయం చేసిందని కాంచన చెప్తుంది. పారిజాతం మాత్రం దీప నిన్ను బుట్టలో వేసుకోవడానికి వచ్చిందని మనసులో అనుకుంటుంది. 

పారిజాతం: మనసులో.. దీప ఈ ఇంట్లో అడుగుపెట్టిందని తెలిశాక నేను ఇక లేట్ చేయకూడదు. వీళ్లిద్దరికీ ముడి పెట్టాల్సిందే. కాంచన.. ఇంతకీ మేం ఎందుకు వచ్చామో అడగవా. అదే కాంచన పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.
కాంచన: ఓ పిల్లల పెళ్లి గుర్తు చేయడానికి వచ్చారా. ఎప్పటి నుంచో అనుకుంటుందే కదా.  
శివనారాయణ: అది సరే కానీ నీ భర్త లేకుండా ఈ పెళ్లి గురించి మాట్లాడటం బాగోదేమో. నువ్వు ఒకసారి పెళ్లి గురించి మనవడితో మాట్లాడమ్మ. 
పారిజాతం: మాట్లాడటం కాదు త్వరలోనే ముహూర్తాలు పెట్టించండి.

దీప హోటల్‌లో ఉంటే నర్శింహ దీపకు కాల్ చేస్తాడు. దీప కాల్ లిఫ్ట్ చేసి నీకు నా నెంబరు ఎలా తెలుసు. ఎందుకు ఫోన్ చేశావు అని అంటుంది. నా కూతురిని నాకు ఎప్పుడు ఇస్తున్నావ్ అని నర్శింహ అడుగుతాడు. దీప బయటకు వెళ్లి మాట్లాడుతుంది. తమని వదిలేయ్ అని అంటుంది. ఎవరో ఒకర్ని దత్తత తీసుకోమని అంటుంది. దానికి నర్శింహ అలా అయితే శౌర్య నాకు పుట్టిన కూతురు కాదు అని చెప్పని అప్పుడు ఓ అనాథని పెంచుకుంటానని అంటాడు. నర్శింహ మాటలకు దీప ఏడుస్తుంది. ఇక దీపకు నర్శింహ రేపు సాయంత్రం వరకు టైం ఇస్తాడు. తనకు సంబంధించినవి ఏవో నీ దగ్గర ఉండకూడదని నర్శింహ అంటాడు. తన కూతుర్ని నర్శింహ బారి నుంచి ఎలా కాపాడుకోవాలి అని దీప ఏడుస్తుంది. ఇంతలో కార్తీక్ దీప ఏడ్వటం చూస్తాడు.  దీప దగ్గరకు వచ్చి ఏమైందని అడుగుతాడు. దీప చెప్పదు.  సమస్య శౌర్యది అయితే తనకు చెప్పమని తనకు కూడా బాధ్యత ఉందని కార్తీక్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: త్రినయని సీరియల్ జూన్ 25 ఎపిసోడ్: హర్ష ఆత్మ అని, తనని ఎవరో హత్య చేశారని ఇంట్లో వాళ్లకి చెప్పిన నయని.. అక్కకి ఎఫైర్ అంటగట్టిన సుమన!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
Andhra Politics: నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా?  సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా? సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
Jublihills Byelections: జూబ్లిహిల్స్ గెలుపు కోసం కేసీఆర్ రూట్ మ్యాప్ - ఫామ్ హౌస్‌లో కీలక నేతలతో సమావేశం !
జూబ్లిహిల్స్ గెలుపు కోసం కేసీఆర్ రూట్ మ్యాప్ - ఫామ్ హౌస్‌లో కీలక నేతలతో సమావేశం !
WhatsApp warning:  యూజర్లకు వాట్సాప్  అలర్ట్  - నిర్లక్ష్యం చేస్తే తర్వాత బాధపడతారు !
యూజర్లకు వాట్సాప్ అలర్ట్ - నిర్లక్ష్యం చేస్తే తర్వాత బాధపడతారు !
Advertisement

వీడియోలు

Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
New Zealandతో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైట్‌.. టీమ్‌లో కీలక మార్పులు
1987 Opera House Jewelry Heist | 40 సంవత్సరాలుగా దొరకని దొంగ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
Andhra Politics: నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా?  సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా? సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
Jublihills Byelections: జూబ్లిహిల్స్ గెలుపు కోసం కేసీఆర్ రూట్ మ్యాప్ - ఫామ్ హౌస్‌లో కీలక నేతలతో సమావేశం !
జూబ్లిహిల్స్ గెలుపు కోసం కేసీఆర్ రూట్ మ్యాప్ - ఫామ్ హౌస్‌లో కీలక నేతలతో సమావేశం !
WhatsApp warning:  యూజర్లకు వాట్సాప్  అలర్ట్  - నిర్లక్ష్యం చేస్తే తర్వాత బాధపడతారు !
యూజర్లకు వాట్సాప్ అలర్ట్ - నిర్లక్ష్యం చేస్తే తర్వాత బాధపడతారు !
Saudi Arabia: భారత వలస కార్మికులకు పండగే- సౌదీలో కఫీల్ అరాచకాలకు చెక్ -కఫాలా వ్యవస్థ రద్దు !
భారత వలస కార్మికులకు పండగే- సౌదీలో కఫీల్ అరాచకాలకు చెక్ -కఫాలా వ్యవస్థ రద్దు !
Telangana Govt: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో టెండర్ల రచ్చ - మంత్రితో వివాదాలతో ఐఏఎస్ వీఆర్ఎస్ !
తెలంగాణ ఎక్సైజ్ శాఖలో టెండర్ల రచ్చ - మంత్రితో వివాదాలతో ఐఏఎస్ వీఆర్ఎస్ !
IND vs AUS: ఆడిలైడ్‌లో భారత్ ఓటమి, 2 వికెట్ల తేడాతో రెండో వన్డే గెలుచుకున్న ఆస్ట్రేలియా; కెప్టెన్‌గా తొలి సిరీస్ కోల్పోయిన గిల్
ఆడిలైడ్‌లో భారత్ ఓటమి, 2 వికెట్ల తేడాతో రెండో వన్డే గెలుచుకున్న ఆస్ట్రేలియా; కెప్టెన్‌గా తొలి సిరీస్ కోల్పోయిన గిల్
Dude Box Office Collection: 6 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి 'డ్యూడ్' - హ్యాట్రిక్ కొట్టేసిన కోలీవుడ్ స్టార్ ప్రదీప్...
6 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి 'డ్యూడ్' - హ్యాట్రిక్ కొట్టేసిన కోలీవుడ్ స్టార్ ప్రదీప్...
Embed widget