అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today April 23rd: కార్తీకదీపం 2 సీరియల్: నేనే దీప తల్లిని, ట్విస్ట్ ఇచ్చిన సుమిత్ర.. కార్తీక్ ఇంటి దగ్గర నర్శింహ పంచాయితీ!

Karthika Deepam 2 Serial Today Episode నర్శింహ దీపను బెదిరించి తనతో వచ్చేయ్‌మని చేయి పట్టుకోవడంతో సుమిత్ర అడ్డుకొని నర్శింహ చెంప పగలగొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప వంట చేస్తుంటే సుమిత్ర అక్కడికి వస్తుంది. ఇక సుమిత్ర దీపను తన భర్త గురించి అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటుంది. సుమిత్ర దీపకు నీ ఆ పేరు ఎవరు పెట్టారు. వంట ఎవరు నేర్పారు అని అడుగుతుంది. దీప తన తండ్రి వంట మాస్టర్ అని అలా నేర్చుకున్నానని అంటుంది. దానికి సుమిత్ర అందుకేనా నీకు పది మందికి వంట చేసి పెట్టే అలవాటు ఉంది అంటే.. మీరు అంతే కదా మీకు హోటల్స్ ఉన్నాయని దీప అంటుంది. ఇక సుమిత్ర మన ఇద్దరికి ఒకే లాంటి లక్షణం ఉందని అంటుంది. దీప సుమిత్ర కన్న బిడ్డ అని ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఈ సీన్‌ను తీర్చిదిద్దారు. 

సుమిత్ర: (సుమిత్ర కన్నీరు పెట్టుకోవడం చూసిన దీప ఏమైందని అడుగుతుంది) నీకు నాకు దగ్గరి పోలికలు ఉన్నాయి దీప. బహుశా పోయిన జన్మలో నువ్వు నా కూతురిగా పుట్టి ఉంటావ్. లేదా నువ్వు మా అమ్మవి అయి ఉంటావ్. నీకు ఎప్పుడు ఇలా అనిపించలేదా..
దీప: పుట్టుకతోనే అమ్మను పోగొట్టుకున్నదాన్ని. ఆవిడ వయసులో ఉన్న అందరిలోనూ అమ్మను చూసుకుంటున్నాను. మీలోకూడా.. 
సుమిత్ర: అవును సౌర్య వాళ్ల నాన్న ఏం చేస్తుంటాడు..
దీప: డ్రైవర్..
సుమిత్ర: ఓ మీ ఆయన డ్రైవరా.. అతను ఎక్కడ ఉన్నాడో చెప్పని అడిగితే దీప చారులో ఉప్పు చూడమని.. వంటలు అయిపోయావని కవర్ చేస్తుంది. సుమిత్ర ఎంత అడిగినా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

కార్తీక్: పారు నువ్వు చెప్పకపోతే నాకు తెలీదు అనుకుంటున్నావా.. జ్యోత్స్నకు నాకు వచ్చే ముహూర్తంలోనే పెళ్లి అని వాళ్లు అనుకుంటే నువ్వేం చేస్తున్నావ్. పక్కనుండి గులాబి పూలు అందిస్తున్నావా.. 
పారిజాతం: అంటే ఈ రోజు దాని పుట్టినరోజు కదా నువ్వు గులాబి ఇస్తే అది హ్యాపీగా ఫీలవుతుంది కదా.
కార్తీక్: ఈరోజు హ్యాపీగా ఉంటుందని గులాబి ఇప్పించావ్.. రేపు బాధ పడుతుందని తాళి కట్టిస్తావా.. పారు మీరందరూ అనుకున్నట్లు జ్యోత్స్న నా జీవితంలోకి రాదు. నేను తనని పెళ్లి చేసుకోను. నువ్వు ఎలాగూ చెప్పవని నేనే మా అమ్మతో చెప్పాలి అనుకున్నా కానీ వాళ్ల మాటలు విని ఆగిపోయా.
పారిజాతం: మరి పెళ్లి చేసుకోవచ్చు కదా..
కార్తీక్: ఇష్టం లేని అమ్మాయితో కాసేపు నడవటమే కష్టం. అలాంటిది జీవితాంతం నడవటం అంటే నరకమే..
పారిజాతం: జ్యోత్స్న నీకు ఎందుకు నచ్చడం లేదో నాకు అర్థం కావడం లేదు.
కార్తీక్: నువ్వు మళ్లీ మొదటికి వస్తావ్ ఏంటి. నాకు అత్తమామయ్య, నువ్వు తాతయ్య ఎలాగో జ్యోత్స్న అలాగే. చేతులు పట్టుకొని తిరగడానికి చిటికెన వేలు పట్టుకొని తిరగడానికి చాలా తేడా ఉంది పారు. మేం కలిసి పెరిగాం కదా. భార్యాభర్తలం అవ్వలేం. మీరంతా కలిసి దాని మైండ్‌ని చిన్నప్పుడు నుంచి చెడగొట్టారు. నువ్వు పెళ్లి ముహూర్తాలు ఆపి అసలు విషయం అందరితో చెప్పే నేను ఆగుతా లేకపోతే నేనే చెప్తా.. నువ్వు చెప్తావా నేనే చెప్పాలా..
పారిజాతం: ఈ నాలుగు రోజులు ఆగు నేను చెప్తా..
కార్తీక్: ప్లీజ్ పారు వీలు అయిన అంత తొందరగా చెప్పు. 
పారిజాతం: కొంచెం ఓపిక పట్టు కార్తీక్.. మీ ఇద్దరికీ పెళ్లి జరగకుండా ఆపే బాధ్యత నాది..(పిచ్చి మనవడా నా మాటలు నీటిలో రాతలు.. మీ ఇద్దరికీ పెళ్లి జరగకుండా చూస్తా అన్నానా.. నిజానికి మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది..)

మరోవైపు జ్యోత్స్న, దశరథ, సుమిత్రలకు దీప పాయసం వడ్డిస్తుంది. ముగ్గురు దీపని తెగ పొగిడేస్తారు. ఇంతలో కార్తీక్ లోపలకు వస్తే సుమిత్ర పిలిచి పాయసం ఇస్తుంది. కార్తీక్ కూడా పాయసాన్ని పొగిడేస్తాడు. ఇక సుమిత్ర, దశరథలు కార్తీక్ కొత్త హోటల్‌లో దీపని చెఫ్‌గా పెట్టమని అంటుంది. కార్తీక్ కూడా సరే అనేసరికి దీప అడ్డుకొని తనకు పనులు ఉన్నాయని అంటుంది. సుమిత్ర దీపని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. జీవితం మారిపోతుందని సలహా ఇస్తుంది. ఇక పారిజాతం వచ్చి అడ్డుకుంటుంది. శివనారాయణ పారిజాతాన్ని తిట్టి నోరు మూయిస్తాడు. 

జ్యోత్స్న: బావ తనని నేను ఒప్పిస్తాను..
దీప: వద్దు జ్యోత్స్న.. నాకంటూ వేరే జీవితం ఉంది. నేను వెళ్లిపోవాలి. 
పారిజాతం: నాకు కావాల్సింది నువ్వు వెళ్లిపోవడమేగా..
సుమిత్ర: సారీరా దీప ఒప్పుకుంటుంది అనుకున్నాను. కాసేపటి తర్వాత నేను మాట్లాడుతాను.
కార్తీక్: వద్దు అత్త తనని ఇబ్బంది పెట్టొద్దు. 
సుమిత్ర: మనసులో.. దీపకు ఏదో రూపంలో సాయం చేయాలి అనుకుంటున్నాను. కానీ తను వెళ్లిపోతా అంటుంది. ఇప్పుడు దీపని ఎలా ఆపాలి. 

మరోవైపు సౌర్య భయంగా పరుగెత్తుకుంటూ వచ్చి అమ్మా దాక్కుందాం పద బూచోడు వచ్చాడు అంటుంది. ఎవరని దీప అడిగితే నర్శింహ గురించి చెప్తుంది. దీప షాక్ అవుతుంది. తనని పిలిచాడని భయంతో పారిపోయి వచ్చానని దీప అంటుంది. దీంతో దీప సౌర్యను సుమిత్ర దగ్గరకు పంపి తాను నర్శింహ దగ్గరకు వెళ్తుంది. 

దీప: ఎందుకు వచ్చావ్.. 
నర్శింహ: నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావ్.. ఈ ఇంటికి నీకు ఏంటి సంబంధం..
దీప: సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ముందు నువ్వు బయటకు వెళ్లు. 
నర్శింహ: పోనీ నేను చెప్పనా.. నువ్వు నన్ను గుడి దగ్గర మొన్న ఒకడితో కొట్టించావ్ చూడు. ఇది వాడి ఇళ్లే. వాడితో నువ్వు షాపింగ్‌లు షికారులు.. నా కూతురికి వాడేదో తండ్రి అయినట్లు ఎత్తుకొని తిరగడాలు. కథ చాలా దూరం పోయింది. నా కూతుర్ని కూతురిగా చూసుకున్నట్లే.. నా పెళ్లాన్ని పెళ్లంగా చూసుకుంటున్నాడా.. ఏంటి చూసుకుంటున్నాడా..
దీప: చెప్పు తీసి పళ్లు రాలగొట్టకముందే ఇక్కడి నుంచి బయల్దేరు. ఇంతకు మించి నా బతుకు అల్లరి చేయడానికి ఏమీ మిగలలేదు. దయచేసి బయటకు వెళ్లు. 
నర్శింహ: అసలు నువ్వు వాడి ఇంట్లో ఎందుకు ఉంటున్నావే..
దీప: నిజాలకు నిజాయితీకి విలువ లేని నీలాంటి దారినపోయే కుక్క దగ్గర నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు.
నర్శింహ: అవునే నేను కుక్కనే పిచ్చి కుక్కనే.. నిన్ను కరవడానికే వచ్చాను. నీ యవ్వారాలు.. నీ యాషాలు చూస్తుంటే నువ్వు ఇక్కడి నుంచి పోయేలా కనిపించడం లేదు. నువ్వు ఉంటే నా శోభ నాతో ఉండను అంటుంది.
దీప: ఛీ..
నర్శింహ: చీదరించుకోవడమే కాదు నువ్వు ఉమ్మేసినా నేను పట్టించుకోను. నువ్వు వెంటనే ఇక్కడనుంచి వెళ్లిపో.. నువ్వు బయల్దేరు. ముందు నిన్ను బస్ ఎక్కిస్తే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను. నువ్వు ఇక్కడ ఉంటానికి వీల్లేదు.
దీప: నువ్వు వద్దు అనుకొనే కదా వచ్చేశాను. మళ్లీ నా వెంట ఎందుకు పడుతున్నావ్. నువ్వేమీ నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదుపో.. 

నర్శింహ దీప చేయి పట్టుకొని పద.. మర్యాదగా రాకపోతే చంపేస్తా అంటే సుమిత్ర నర్శింహ చెంప పగలగొడుతుంది. దీప షాక్ అయిపోతుంది. నర్శింహతో నువ్వు ఎవడివో.. దీప చేయి ఎందుకు పట్టుకొని ఎందుకు లాక్కెత్తున్నావో చెప్పకపోతే చంపేస్తా అని అంటుంది. దీంతో నర్శింహ ఏంటి దీప అందరికీ నేనే చెప్పాలా నీ మెడలో తాళి కట్టిన భర్త అని చెప్పు అని అంటే సుమిత్ర షాక్ అయిపోతుంది. దీపని తీసుకెళ్లడానికి నర్శింహ ముందుకొస్తే నర్శింహని సుమిత్ర అడ్డుకుంటుంది. దీంతో మీరెవరూ దీపని అడ్డుకోవడానికి అని నర్శింహ అంటే సుమిత్ర నేను దీప తల్లిని అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీ జాడ తెలియకుండా అడ్డుకున్న హాసిని, పావనామూర్తి.. సుమన సూటి ప్రశ్నలకు నయని షాక్!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Embed widget