అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today April 17th: కార్తీకదీపం 2 సీరియల్: నవ్వులు పూయిస్తున్న కార్తీక్, రౌడీల కాంబో.. కార్తీక్‌కు పర్మిషన్ ఇచ్చిన దీప, ఇదేనా తండ్రి ప్రేమంటే!

Karthika Deepam 2 Serial Today Episode దీపని అడిగి కార్తీక్ సౌర్యను తనతో పాటు షాపింగ్‌కి తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode పారిజాతం మేకప్ వేసుకుంటూ దీప మాటలు తలచుకొని దీపని ఎలా దారిలో పెట్టాలో అర్థం కావడం లేదని అనుకుంటుంది. ఇంతలో బంటు కనిపిస్తే పిలుస్తుంది. ఇక బంటు తాను తెలివైన పని చేశానని చెప్తాడు. దీపని భయపెట్టానని గజగజ వణికిపోయిందని అంటాడు. 

పారిజాతం: నువ్వు.. దీపని భయంతో గజగజ వణికించావ్.. ఇది నేను నమ్మాలి. 
బంటు: ఒట్టు అమ్మగారు.
పారిజాతం: పోరా పిచ్చినాయాలా.. ఈ ఇంటికి మెయిన్ పిల్లర్ లాంటి దాన్ని నన్నే అది గజగజలాడించేస్తే వీడు దాన్ని వణికించాడంట అది నేను నమ్మాలంట. పోరా పిచ్చినాయాలా. దాని దెబ్బకు నువ్వు వణికి పోకుండా ఉంటే చాలు. పోరా అల్లాలాడించాడు అంట అమ్మోరుని చూసినట్లు జడుచుకు చచ్చుంటాడు వెధవ. పోరా.. 
బంటు: మీ పెదవుల మీద చిరునవ్వు చూడటానికి ఈ బంటు ఏమైనా చేస్తాడు అమ్మగారు.

మరోవైపు కార్తీక్, జ్యోత్స్న షాపింగ్‌కు బయల్దేరుతారు. జ్యోత్న్స బావతో బావ నీకు నచ్చిన డ్రస్ తీసుకుంటా అంటే ప్యాంట్ షర్ట్ ఓకేనా అని జోక్ చేస్తాడు. ఇక సౌర్య కారును చూస్తూ ఉంటుంది. కార్తీక్ వచ్చి రౌడీ ఏంటే అలా చూస్తున్నావ్ అంటే కారుకి కిటికి ఉందని అంటుంది. ఇక సౌర్య కార్తీక్‌, జ్యోత్న్సలతో తాను కూడా బయటకు వస్తాను అంటుంది. జ్యోత్న్స మేం షాపింగ్‌కు వెళ్తున్నాం అని రావొద్దు అంటే చిన్న పిల్ల వస్తా అంటే ఎందుకు వద్దు అంటావ్ అని కార్తీక్ అంటాడు. ఇక తన తల్లికి చెప్పి రమ్మంటే నేను రాను మీరే వెళ్లండని అంటుంది. ఎందుకు అని అడిగితే మా అమ్మ పంపించదు అని అంటుంది. తన తల్లితో తనకు గొడవ అయిందని మాట్లాడటం లేదు అని చూసుకోవడం కూడా లేదు అంటుంది సౌర్య. ఇక సౌర్య తన తల్లికి చెప్పి రమ్మని అంటుంది. 

జ్యోత్న్స: వెళ్లు బావ త్వరగా చెప్పిరా లేటు అవుతుంది.
కార్తీక్: నువ్వు వెళ్లి చెప్పొచ్చు కదా.
జ్యోత్న్స: పాపని ఎక్కడికీ తీసుకెళ్లొద్దని ఆల్రెడీ నాకు చెప్పింది.
సౌర్య: నువ్వు వెళ్లు కార్తీక్.
కార్తీక్: నువ్వు నాతో రా..
సౌర్య: నేను వెళ్తే నిన్ను ఎందుకు రమ్మంటాను. 

ఇక  కార్తీక్ సౌర్య దగ్గర ఉన్న టెడ్డీని తీసుకొని వెళ్తే సౌర్య అలా కాదు టెడ్టీని ఎత్తుకొని తీసుకెళ్లు అని అంటుంది. కార్తీక్‌ నువ్వు నిజంగానే రౌడీవే అంటూ దీప ఉన్న గెస్ట్ హౌస్‌కి వెళ్తాడు. సౌర్య, జ్యోత్న్సలు కారు డోర్ వెనక దాక్కొంటారు. కార్తీక్ డోర్ కొడుతూ ఈవిడ గారు ఇప్పుడేమనుకుంటారో అని అనుకుంటాడు.

కార్తీక్ డోర్ కొట్టగానే దీప సౌర్య అనుకొని అలిగి వెళ్లిపోయావ్ కదా మళ్లీ ఎందుకొచ్చావో అంటుంది. కార్తీక్ మళ్లీ డోర్ కొడితే.. వినిపించింది లోపలికి రా అని అంటుంది. అయినా కార్తీక్ మళ్లీ డోర్ కొడతాడు. తలుపు తీసిన దీప కార్తీక్‌ని చూసి షాక్ అవుతుంది. అప్పటి వరకు జరిగిన అన్నీ గుర్తు చేసుకుంటుంది. ఎందుకు వచ్చారని దీప కార్తీక్‌ను అడుగుతుంది. షాపింగ్‌కు తీసుకెళ్తాను అని అడుగుతాడు. దీప ఒప్పుకోదు. అయినా కార్తీక్ ఎంతకీ వదలకపోవడంతో దీప సరే అంటుంది. అయితే సౌర్య కోసం ఏమీ కొనొద్దు అని కండీషన్ పెడుతుంది.

కార్తీక్: ఇంత త్వరగా ఒప్పుకుంటారు అని నేను అనుకోలేదు.
దీప: మీరు ఇక్కడ నుంచి త్వరగా వెళ్లాలి అంటే ఒప్పుకోక తప్పలేదు.
కార్తీక్: వెళ్తున్నా..
దీప: ఆగండి.. నా కంటూ చెప్పుకోవడానికి దేవుడు మిగిల్చిన ఆకరి బంధం అదొక్కటే. పాప జాగ్రత్త.
కార్తీక్: ఎవరైనా కొట్టినా కూడా ఇంత బాధ అనిపించదు దీప. ఏనాటికి అయినా అర్థం చేసుకొని క్షమిస్తావు అని చిన్న ఆశ.
దీప: మీరు ఇక వెళ్లొచ్చు.
సౌర్య: కార్తీక్ అమ్మ ఒప్పుకుందా..
కార్తీక్: మనం అడిగితే అమ్మ కాదు అంటుందా అడగ్గానే ఒప్పుకుంది. 
సౌర్య: అడగ్గానే ఒప్పుకుంటే ఇంత సేపు ఏం చేశావ్. కార్తీక్ దిక్కులు చూస్తాడు.
జ్యోత్స్న: అవును బావ అది కరెక్టే. ఇంత సేపు ఏం మాట్లాడావ్.
కార్తీక్: నీ తరఫున సారీ చెప్పా. కానీ మీ అమ్మ క్షమించలేదు. 
సౌర్య: అమ్మో మాట్లాడను అనడం అంత పెద్ద తప్పా..
దీప: ఇది రోజు రోజుకు ఇక్కడ అందరికీ దగ్గరైపోతుంది. దీన్ని నేను ఆపగలనా..

మరోవైపు జ్యోత్స్న కార్ డ్రైవింగ్ చేస్తుండగా.. సౌర్య సన్ రూఫ్‌లో నిల్చొని బయటకు చూస్తుంది. మరోవైపు అనసూయ మల్లేశ్ ఇంటి దగ్గర బూజులు దులుపుతుంది. మల్లేశ్‌కి తమలపాకులు అడిగినా మల్లేశ్ ఇవ్వకుండా ఇంటిని వేలం వేస్తాను అంటాడు. రెండు రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే వేలం వేస్తాను అని మిమల్ని రోడ్డు మీదకు లాగేస్తానని అంటాడు. ఇక అనసూయ కోడల్ని తిట్టుకుంటుంది. సౌర్య తండ్రిని చూసే ఉంటుంది. అని తండ్రితో హైదరాబాద్‌లో షికారు చేస్తుంటుంది అనుకుంటుంది. ఇక కార్తీక్ వాళ్లు షాపింగ్ చేస్తుంటారు. 

డ్రస్‌లు చూద్దామని జ్యోత్స్న కార్తీక్‌ని తీసుకొని వెళ్తుంది. ఇక సౌర్య ఓ పాప దగ్గరకు వెళ్తుంది. ఆ పాపని తన తండ్రిని ఎత్తుకొని బట్టలు చూపిస్తారు. అప్పుడు దీప తన తండ్రిని తలచుకొని బాధ పడుతుంది. అప్పుడే కార్తీక్ సౌర్యని ఎత్తుకొని డ్రస్సులు చూపిస్తాడు. దీంతో సౌర్య చాలా సంతోష పడుతుంది. ఇక కార్తీక్‌ సౌర్యకు నచ్చిన డ్రస్ తీసుకుంటాడు. మరోవైపు అదే మాల్‌లో నర్శింహ రెండో భార్య శోభ ఉంటుంది. శోభ, సౌర్య ఎదురు పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: అరియానా కూడా గులాబీ శారీ ట్రెండ్ ఫాలో అయిపోయిందిగా.. చీరలో అందంగా ముస్తాబై ఫోజులిచ్చిన బిగ్​బాస్ బ్యూటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Embed widget