అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today April 10th: కార్తీకదీపం 2 సీరియల్: దీపని లాగిపెట్టి ఒక్కటిస్తానన్న సుమిత్ర.. మనవరాలిని అడ్డుకున్న శివనారాయణ!

Karthika Deepam 2 Serial Today Episode తన తండ్రిని చంపిన కార్తీక్ కనిపిస్తున్న ఇంట్లో తాను ఉండలేను అని దీప అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తావ్ దీప అని సుమిత్ర అడుగుతుంది. దీంతో దీప తప్పదండి వెళ్లాలి అంటుంది. దానికి కార్తీక్ మీ గాయం ఇంకా తగ్గలేదు ఎలా వెళ్తారు అని అడుగుతాడు. ఎలాంటి గాయం అయినా భరించే శక్తి నాకు ఆ దేవుడు ఇచ్చాడండి అని దీప బదులిస్తుంది. 

కార్తీక్: మనసులో నీ నిర్ణయానికి కారణం నేనే అని తెలుసు దీప కానీ ఇప్పుడైతే నేను నిన్ను ఆపలేను దీప.
సుమిత్ర: నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్లడం లేదు దీప.
దీప: నేను వెళ్లాలి అమ్మ. 
సుమిత్ర: నువ్వు ఇలా చెప్తే వినవు.. కార్తీక్ నువ్వు సౌర్యని తీసుకొని లోపలికి వెళ్లు అంటే సౌర్య రాను అన్నా కార్తీక్ ఎత్తుకొని వెళ్లిపోతాడు. దీపని సుమిత్ర పక్కకు తీసుకొని వచ్చి ఎందుకు వెళ్లిపోతున్నావ్. ఏంటి నీ ప్రాబ్లమ్ అని అడుగుతుంది. 
దీప: నేను ఇక్కడ ఉండలేను అమ్మ. కారణం చెప్పలేను.
సుమిత్ర: బాధ చెప్పలేవు. కారణం చెప్పలేవు. ఓ కన్నీటి మూటని నెత్తిన వేసుకొని తిరుగు. నీలోపల ఓ అగ్ని పర్వతం ఉందని నాకు అర్థమవుతుంది. అది ఏదో ఒక రోజు నీ జీవితాన్ని తగలబెట్టేస్తంది.
దీప: తగల బడటానికి ఇంకేం లేదమ్మ.
సుమిత్ర: నువ్వు ఇలా మాట్లాడితేనే నాకు భయం వేస్తుంది. అది సరే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తావో అది చెప్పు.
దీప: ఇక్కడి నుంచి బయటకు.
సుమిత్ర: ఇదిగో ఇలా తెలివిగా మాట్లాడితే లాగిపెట్టి ఒక్కటి కొడతాను. 
దీప: తల్లి లాంటి దానివి కదా కొట్టినా పర్లేదు. 
సుమిత్ర: తల్లిలాంటి దాన్నే కాబట్టి కూతురి లాంటి నీ జీవితం ఏమైపోతుందా అని బాధ పడుతున్నారు. ఆ రోజు మనం కలిసి ఉండకపోతే నీ కష్టం నాకు తెలిసేది కాదు. నువ్వు ఎక్కడుంటావో నాకు తెలీదు. ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలీదు. అమ్మానాన్నలు లేరు. భర్త గురించి అడిగితే సమాధానం లేదు. ఒక పాత బ్యాగులో మూడు జతల బట్టలు పెట్టుకొని ఆరేళ్ల కూతుర్ని తీసుకొని ఆకలితో రోడ్ల మీద తిరుగుతున్నావు అంటే ఓ మనిషిగా నీ పరిస్థితి నాకు అర్థం కాదు అంటావా.. ఇంకా నేను అర్థం చేసుకునే మనిషిని కాబట్టే నీ గురించి నేను ఇలా ఆవేధన పడుతున్నాను. అర్థం చేసుకో. అంటూ ఎమోషనల్ అవుతుంది.
దీప: నా గురించి మీరు ఇంతలా ఆవేదన పడటానికి నేను మీకు ఎవర్ని అమ్మ. 
సుమిత్ర: ఈ ప్రశ్న నిన్నూ నన్నూ కలిపిన దేవుడిని అడుగు ఆయన నీకు సమాధానం చెప్తే నువ్వు వచ్చి అది నాకు చెప్పు. నువ్వు నా ప్రాణాలు కాపాడవు అన్న కృతజ్ఞతతో అడగడం లేదు. ఆ రెజు నీకు దెబ్బ తగిలినప్పుడు నువ్వు అమ్మా అన్నావు చూడు అది నా గుండెకు కాదే నా కడుపులో నా బిడ్డను కన్న పేగుకు తగిలింది. నీకు నాకు ఏ జన్మలో బంధం ఉందో తెలీదే. బంధం అయితే కచ్చితంగా ఉందే.. అందుకే అది నా గుండెల్ని చీల్చికుంటూ కన్నీటిలా వస్తుంది చూడు.
దీప: మీ ప్రేమకు మీ అభిమానానికి నేను జీవితాంతం రుణ పడి ఉంటాను అమ్మ.
సుమిత్ర: అవన్నీ కాదే నాతో ఉంటాను అని చెప్పు.
దీప: అయితే మీరు ఓ పని చేయండి. 
సుమిత్ర: చెప్పు నీ కోసం నన్ను ఏం చేయమంటావో చెప్పు.
దీప: నన్ను ఇక్కడ నుంచి వెళ్లిపోనివ్వండి. మీ నుంచి నాకు ఏ సాయం వద్దు. నన్ను వెళ్లిపోనివ్వండి. ఇదే నేను మీ నుంచి కోరుకునేది. 
సుమిత్ర: సరే నేను ఆపను. నువ్వు ఎక్కడికి వెళ్లాలి అనుకుంటే అక్కడికి వెళ్లు. కానీ ఒక్కటి చెప్తున్నా.. నీ కోసం ఈ గుమ్మం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ గుమ్మం నువ్వు దాటగలిగితే నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్లే ముందు అందరికీ చెప్పి వెళ్లు లేదంటే బాధ పడతారు.
దీప: నేను ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నానో మీతో చెప్పలేను అమ్మ. కానీ నా తండ్రి చావుకి కారణం అయిన మనిషి కళ్ల ఎదురుగా తిరుగుతూ ఉంటే నా తండ్రి శవాన్ని గుండెల మీద మోస్తున్నట్లు ఉందమ్మ. ఎవరు ఏదో ఒక మాట అంటే అది నా బిడ్డ చెవిన పడితే నాన్న నిన్ను వదిలేశాడా అమ్మ అంటే సమాధానం చెప్పలేను. ఎటు పోతానో ఎక్కడికి పోతానో నాకు కూడా తెలీదు. కానీ పోవాలి.. దూరంగా ఎక్కడికైనా పోవాలి.

మరోవైపు అనసూయ దీప గురించి టెన్షన్‌ పడుతుంది. ఫోన్ చేయడం లేదు అని చేస్తే కలవడం లేదు అని అనుకుంటుంది. దీప తన కొడుకును కలిసి ఉండి ఉంటే ఈ పాటికి ఏదో ఒక విషయం తెలిసేది అనుకుంటుంది. ఇంతలో మల్లేశ్ వచ్చి దీపకు నర్శింహ ఇంకా ఎన్ని రోజులు అయినా దొరకడు అని తన ఇంట్లో చాకిరి నీకు తప్పదు అని మల్లేశ్ అనసూయతో అంటాడు. అనసూయ కంగారు పడుతుంది. 

దీప ఇంట్లో అందరికీ చెప్పి బయల్దేరుతుంది. దీపని ఎలా ఆపాలో అర్థం కావడం లేదని కార్తీక్ అనుకుంటాడు. ఇక దీపని డ్రాప్ చేస్తామంటే దీప వద్దనేస్తుంది. ఇక పారిజాతం దీప ఎప్పుడు వెళ్లిపోతుందా అని అనుకుంటుంది. ఇక కార్తీక్ తనకు నిజం చెప్పుకునే అవకాశమే రాలేదు అని దీప వెళ్లకపోతే బాగున్ను అనుకుంటాడు. ఇంతలో శివనారాయణ వచ్చి దీపని ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు అంటాడు. ఉగాది పండగ ఉందని బయట వాళ్లని పిలుస్తామని ఇంట్లో వాళ్లని ఎలా వెళ్లనిస్తానని అంటాడు. ఉగాది పండగ మనం అందరం సంతోషంగా కలిసి జరుపుకుంటామని నీ ప్రయాణం గురించి పండగ తర్వాత చూద్దామని అంటాడు. పారిజాతం దీపకు ఏమైనా పనులు ఉంటాయేమో ఆపొద్దు అంటుంది. 

శివనారాయణ: ఏ సౌర్య నువ్వేమంటావ్..
సౌర్య: ఉండటానికి బట్టలు లేవుగా. అందరూ డల్ అయిపోతారు. నాకు మూడు జతలే ఉన్నాయి ఇదే లాస్ట్. మరి పండగకు ఏం వేసుకోను.
దీప: సౌర్య..
శివనారాయణ: కార్తీక్ వీళ్లని తీసుకెళ్లి బట్టలు తీసుకో..
దీప: వద్దు పెద్దయ్య గారు నేను ఎలాగూ బట్టలు తీసుకుంటా అనుకున్నా కదా తీసుకుంటా..
సౌర్య: అమ్మా బట్టలు తీసుకొని ఇక్కడికి వస్తామా ఊరు వెళ్లిపోతామా.. 
సుమిత్ర: అది కరెక్ట్‌ గానే అడిగింది. మనసు మార్చుకొని అటునుంచి అటే వెళ్లి పోకుండా తిరిగి రండి.
శివనారాయణ: మనకు చెప్పకుండా వెళ్లిపోతుందా అప్పుడు నేను ముత్యాలమ్మ ఊరు వెళ్లి తీసుకొస్తా.. 
సుమిత్ర: బాగా ఆత్మాభిమానం కలది మామయ్య గారు.
శివనారాయణ: పాపం తనకు ఏం ఇబ్బందులు ఉన్నాయో ఏంటో అన్నీ మనకు చెప్పకోలేదు కదా.. కార్తీక్ తన తాతయ్యకు థ్యాంక్స్ చెప్తాడు. మరో వైపు సౌర్యకి దీప క్లాస్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: ఇంటి దొంగని పట్టిచ్చిన హనుమాన్ వాలా.. చెల్లిని కనిపెట్టే ఇంట్లో అడుగుపెడతానని శపథం చేసిన లలితాదేవి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Constable Physical Events: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Embed widget