అన్వేషించండి

Karthika Deepam 2 Serial September 28th: కార్తీకదీపం 2 సీరియల్: కాంచన ఇంట్లో కావేరి, భర్తని పంచుకుంటారా? బావ కావాలని వెక్కి వెక్కి ఏడుస్తున్న జ్యోత్స్న!

Karthika Deepam 2 Serial Episode శ్రీధర్ కాంచనను క్షమించమని అడగటం, కాంచన కావేరిని ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కార్తీక్ తల్లిని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. దీప కూడా వాళ్ల వెంటే వస్తుంది. ఏదో ఒకటి మాట్లాడమ్మా సైలెంట్‌గా ఉండొద్దని అంటాడు. దానికి కాంచన సొంత చెల్లికి పెళ్లి చేసి అప్పగింతలు ఇచ్చినట్లు ఉందని అన్నప్పుడే చెప్పొచ్చు కదా అమ్మ ఇది నా సొంత చెల్లి అని అంటుంది.

కాంచన: నీ స్థానంలో నేను ఉంటా అన్నప్పుడే చెప్పొచ్చు కదా దీప నీ భర్తలాగే నా భర్త కూడా రెండో పెళ్లి చేసుకున్నాడని. నేనెంత అమాయకంగా మోసపోతూ వచ్చానో నాకు ఇప్పుడు అర్థమైంది. అని దిగులుగా వెళ్లిపోతుంది. కార్తీక్ అమ్మ అని పిలిస్తే చచ్చిపోనురా. నా మనసు నాకు ఒకటి చెప్పింది అది చేయనివ్వురా.
దీప: కార్తీక్ బాబు.
కార్తీక్: మాట్లాడకు దీప నేను నీకు ముందే చెప్తా పెళ్లి సమస్యకు పరిష్కారం కాదు ఇప్పుడే చేయొద్దని అన్నా కదా. నువ్వు ముందుండి పెళ్లి చేయకపోయి ఉంటే వాళ్లకి అంత ధైర్యం ఉండేది కాదు దీప. నిప్పు చేతిలో ఉంది ఎలా ఆర్పాలి అని అడిగిన పాపానికి ఇళ్లు ఒళ్లు రెండూ కాల్చేశావ్ దీప. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నన్ను అడగాలి కదా. 
దీప: అది కాదు కార్తీక్ బాబు.
కార్తీక్: మాట్లాడకు దీప. అసలేం జరిగిందో చూశావ్ కదా కొట్టి ఇంటి నుంచి పంపేశారు. మా నాన్న చేసింది తప్పే కానీ ఏ తప్పు చేయని మా అమ్మ తల దించుకొని వచ్చేసింది. తను ఇప్పడు షాక్‌లో ఉంది. తను తేరుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటాదో తెలీదు. 
దీప: తెలుసు బాబు కానీ మీ నాన్న మీ చెల్లికి వేరే పెళ్లి చేస్తుంటే నేను ఆపాను. ఆ పెళ్లి అయ్యుంటే మీ చెల్లి చనిపోయేది. తను చనిపోయినా పర్లేదు అంటే నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటా. మీరు అలాంటి మనిషి కాదు బాబు. నాకు ఈ పెళ్లి చేయడం వల్ల నా మీదే నిందలు పడతాయని తెలుసు కానీ చేశానంటే అర్థం చేసుకోండి. మీ బాధ్యత నేను తీసుకున్నాను ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది నాతో కాదు మీ నాన్నతో లోపలికి రాలేక బయటే ఉన్నారు. శ్రీధర్ ఇంటికి వచ్చి కార్తీక్ వాళ్ల దగ్గర నిల్చొంటాడు. ఏం మాట్లాడకుండా కాంచన దగ్గరకు వెళ్లి తలుపు వేస్తాడు. కార్తీక్ దీప షాకింగ్‌గా చూస్తారు.
స్వప్న: అమ్మ ఒకసారి నాన్నతో కారులో ఎవరినో చూశాను అన్నాకదా ఆవిడ పెద్దమ్మే. డైజెస్ట్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందమ్మా. 
కాంచన: నన్ను క్షమించమ్మా.
స్వప్న: ఇప్పుడు నిన్ను క్షమించాల్సింది నేను కాదు అమ్మ పెద్దమ్మ. తాతయ్య ఎలాగూ క్షమించరని అర్థమైంది.
కాంచన: నాన్న ఎక్కడ
స్వప్న: క్యాంప్‌కి వెళ్లారు అమ్మ ఆ ఇంటికి నాన్న పెట్టిన పేరు అదే కదా. ఇంత బాధలో కూడా ఆనందమైన విషయం ఏంటో తెలుసా అమ్మ కార్తీక్ నా సొంత అన్నయ్య. మమ్మీలు వేరు అయినా నాన్న ఒక్కరే అన్నయ్యకి నేను చెల్లి అని ముందే తెలుసు. ఒకసారి ఫ్యామిలీ ఫొటో చూపించా కూడా. ఈ సారి నాన్నని చూడాలి అంటే మోహమాటంగా ఉంటుందమ్మా. కానీ అసహ్యం లేదు ఎందుకంటే ప్రతీ తప్పుకి కారణం ఉంటుంది. నేను లేచిపోయి పెళ్లి చేసుకోలేదమ్మా కానీ పెళ్లి చేసుకొని లేచిపోయా. కాశీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయల్దేరుతాం.
కాశీ: పర్లేదు ఆంటీ ఇక నుంచి మనమంతా బంధువులమే కదా
దాసు: అమ్మా మీకేం భయం లేదు కోడలిగా కాదు సొంత కూతురిలా చూసుకుంటా. 
జ్యోత్స్న: ఏడుస్తూ.. నువ్వు అన్నదే జరిగింది కానీ నేను బావ లేకుండా ఉండలేను గ్రానీ. 
పారిజాతం: కాశీకి దీప ఈ పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేసేసింది మనల్ని ముంచేసింది.

శివనారాయణ హాల్లో ఉన్న ఫ్యామిలీ ఫొటో విసిరేస్తాడు. ఫొటోలో కూడా తను ఉండకూడదని అంటాడు. ఇక జ్యోత్స్న తాతతో తాను నేను బావ లేకుండా ఉండలేను నాకు నువ్వు ఇచ్చిన మాట తప్పితే నేను బతకలేను.. ఇక శివనారాయణ, దశరథ్‌ని తీసుకొని కార్తీక్ ఇంటికి బయల్దేరుతాడు.. మరోవైపు శ్రీధర్ కాంచన కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్తాడు. దానికి కాంచన మీరు తప్పు చేయలేదు నాకు నమ్మక ద్రోహం చేశారని అంటుంది. ఎన్నో జన్మల పాపం చేస్తే తప్ప మీలాంటి భర్త రారని అంటుంది. కావేరిని పెళ్లి చేసుకోవడానికి శ్రీధర్ కారణం చెప్పబోతే కాంచన ఒప్పుకోదు. ఏం చెప్పొద్దని అంటుంది. కావేరికి కూడా నాకు పంచినట్లే ప్రేమ పంచారు కదా రెండు ప్రేమలు నిజమేనా అని అడుగుతుంది. ఇక నేను ఒక నిర్ణయం తీసుకున్నానండీ అని కాంచన అంటుంది. 

మరోవైపు కావేరి కూడా కార్తీక్ వాళ్లు ఇంటికి వస్తుంది. దీప, కార్తీక్ షాక్ అవుతారు. మీరు ఇక్కడికి అని కార్తీక్ అంటే మీ అమ్మ పిలిచారని చెప్తుంది. ఇక కాంచన శ్రీధర్‌కి తలుపు తీయమని అంటుంది. శ్రీధర్ కావేరిని చూసి షాక్ అవుతాడు. ఇక కాంచన కూడా హాల్‌లోకి వస్తుంది.  కాంచన కావేరితో మా ఆయనకు పెళ్లి అయిందని మీకు తెలుసా.. తెలిసే పెళ్లి చేసుకున్నావా అని అడుగుతుంది. కావేరి అవును అంటుంది. ఇక దీపతో కాంచన చీర, పూలతో తాంబూళం తీసుకొచ్చి తనకి ఇమ్మని అంటుంది. కావేరిని పిలిచి నా పసుపు కుంకుమలు పంచుకున్నావ్ కదా కావేరి ఒట్టి చేతులతో పంపొద్దని ఇలా చేస్తున్నానని బొట్టు పెడుతుంది. కావేరికి తాంబూలం ఇస్తుంది. కావేరి కాంచన కాళ్లు పట్టుకుంటుంది. కార్తీక్‌తో గదిలో సూట్ కేసు ఉంది తీసుకొచ్చి మీ నాన్న దగ్గర పెడుతుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: సత్యభామ సీరియల్: రౌడీని చంపేసి సత్యకు ట్విస్ట్ ఇచ్చిన మహదేవయ్య.. అదిరిపోతున్న మామకోడలి చదరంగం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Embed widget