Karthika Deepam 2 September 14th: కార్తీకదీపం 2 సీరియల్: ఇంట్రస్టింగ్‌గా దీప, కార్తీక్ ముచ్చట్లు.. అయ్యో పారు నువ్వు పనిమనిషివా దేవుడా!
Karthika Deepam 2 Serial Episode శౌర్య దేవుడికి దండం పెడుతుంటే పారిజాతం వచ్చి తిట్టడం అనసూయ రావడంతో పారు తనని కూడా తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప కార్తీక్‌తో ఈ రోజు తేదీ మీకు గుర్తుందా అంతా అనుకున్నదని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ రోజు మీరు పెళ్లి కొడుకు అయ్యేవారని అంటుంది. పెళ్లి కొడుకుగా చూడాల్సిన మిమల్ని మంచం మీద చూస్తున్నాం ఇదంతా నా వల్లే కదా అని దీప అంటుంది.
కార్తీక్: అదే కత్తి నీకు గుచ్చుకొని మీరు చనిపోయి ఉంటే శౌర్యకి ఎవరు ఉన్నారు.
దీప: మీరు ఉన్నారు కదా బాబు. నా తర్వాత నా బిడ్డని అమ్మలా చూసుకునే మనిషి మీరున్నారని నాకు నమ్మకం ఉంది బాబు.
కార్తీక్: నా బిడ్డ జోలికి రావొద్దు అన్న మనిషే నా బిడ్డకు మీరున్నారు కదా అని అంటే చాలా ఆనందంగా అనిపించింది. నేను ఎప్పుడూ మీ శ్రేయాభిలాషినే దీప. ఇప్పుడు నాకు ఏం కాదు దీప మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి నేను కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాను. ఎందుకంటే మీ రక్తమే నాలోనూ ఉంది. అన్నట్టు మీకు ఒక విషయం చెప్పలేదు దీప. రాత్రి స్వప్న కాల్ చేసి ఇంటికి వస్తాను అడ్రస్ చెప్పు అంది. నాలాగే మొండిది. సడెన్‌గా వచ్చేయ్ గలదు.
దీప: నేను మాట్లాడనా బాబుగారు..
కార్తీక్: అన్నట్లు శౌర్యని ఏం తీసుకురాలేదు. శౌర్య జాగ్రత్త దీప.
దీప: మీరు మా అత్తయ్య శౌర్య విషయంతో అంత జాగ్రత్త ఎందుకు చూపిస్తున్నారు. శౌర్యకి ఏమైనా అయిందా అందుకే నాకు ఏం చెప్పడం లేదా నా దగ్గర ఏమైనా దాస్తున్నారా.
కార్తీక్: అలా ఏం లేదు దీప. అది చిన్న పిల్ల కదా అందుకే అలా అన్నాను. కానీ రౌడీ మీకంటే స్ట్రాంగ్. మనసులో శౌర్య గుండె విషయం మీకు తెలీకుండదు దీప అది గాజు బొమ్మ దాన్ని పదిలంగా కాపాడుకుంటాను.
శ్రీధర్: రెండో ఇంటికి వస్తూ.. ఏ ఇంట్లోనూ ప్రశాంతత లేదు. అక్కడ కొడుకు మాట వినడం లేదు. ఇక్కడ కూతురు మాట వినడం లేదు. అక్కడా పెళ్లి గోలే ఇక్కడా పెళ్లి గోలే. ఆ పెళ్లి ఆగిపోయింది ఇది మాత్రం ఆగడానికి వీల్లేదు. స్వప్న ఏం చేస్తున్నావ్ వాడి కోసం చావడానికి రెడీ అయిపోయావ్ కానీ అమ్మానాన్నల్ని మాత్రం అర్థం చేసుకోవడం లేదు.
కావేరి: ఏం జరిగిందండీ.
స్వప్న: నేను ఫ్యాన్ తుడుస్తుంటే ఉరి వేసుకుంటున్నానని నాన్న అనుకున్నాడు మమ్మీ. నీ కూతురు చనిపోయే అంత పిరికిది కాదు. అయినా సూసైడ్ చేసుకునే అంత తప్పు నేను చేయలేదు. మీరు కాశీ ఒక్కటే అని నేను చెప్పను కానీ మీ దగ్గర ఉంటే ఎలా ఉంటానో ఎంత ధైర్యంగా ఉంటానో అలాగే కాశీతో ఉన్నప్పుడు ఉంటుంది.
శ్రీధర్: ఆ సెక్యూరిటీ నాకు శ్రీకాంత్ మీద కలిగింది.
స్వప్న: ఒకసారి కాశీతో మాట్లాడు డాడీ మీ అభిప్రాయం మారుతుందేమో.
కావేరి: నేను మా నాన్నకి ఇవ్వని అవకాశం నా కూతురు మీకు ఇచ్చింది. ఆలోచించండి.
శౌర్య బయట ఆడుకుంటుంది. ఇంతలో తులసి కోట దగ్గర దీపం ఆగిపోతుంటే వెళ్లి చేతులు అడ్డుపెడుతుంది. కార్తీక్కి తగ్గాలని కోరుకుంటుంది. మా అమ్మ నా ఫ్రెండ్ని దగ్గరుండి చూసుకుంటుందని అంటుంది. ఇక పారిజాతం వచ్చి అదేనా మా ఖర్మ. గాయాలు చేసేది మీరే సేవలు చేసేది మీరే తగ్గాలని కోరుకునేది మీరే అని అంటుంది. ఆ మాటలు విన్న అనసూయ కార్తీక్‌కి పొడిచిందని నర్శింహ అని పారిజాతం చెప్పేస్తుందేమో అని టెన్షన్ పడతుంది. పారిజాతం చెప్పబోయే టైంకి అనసూయ ఆపేస్తుంది. ఇంట్లో ఉండనిచ్చినందుకు మాకు తగిని బుద్ధి చెప్పారని అంటుంది. మిమల్ని తప్పు పడతామని నీ కోడల్ని అక్కడికి పంపావని అంటుంది పారిజాతం. దానికి అనసూయ జరిగిన దానికి ఎవరి కాళ్లు పట్టుకుంటానని అంటే పారిజాతం కోప్పడుతుంది. మా అమ్మని ఏమైనా అంటే కార్తీక్‌కి ఫోన్ చేసి చెప్తానని అంటుంది. నా మనవడి అండ చూసుకొని కూటికి గతిలేని వాళ్లు కూడా మాటలు అంటున్నారని పారిజాతం అంటుంది. గతి లేక మా ఇంటికి వచ్చారు కదా అని అంటుంది. అనసూయ మాకు గతి లేదు అనొద్దని అంటుంది. దానికి పారిజాతం అంత పౌరుషం ఉంటే ఇక్కడి నుంచి వెళ్లిపోమని అంటుంది. కోపంతో అనసూయ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
శివనారాయణ మొత్తం వింటాడు. పారిజాతంలో అనసూయకు గతిలేదు అని అన్నావ్ నీ బతుకు ఎలా ఉందో గుర్తుందా అని శివనారాయణ అంటే పారిజాతం గతంలోకి వెళ్తుంది. గతంలో పారిజాతం పని మనిషిగా చేసిన సీన్ గుర్తు చేసుకుంటుంది. శివనారాయణ పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు. ఇక కావేరి స్వప్న ప్రేమ గురించి ఆలోచించమని భర్తకి చెప్తుంది. ఆలోచించిన శ్రీధర్ ఒకసారి కాశీతో మాట్లాడుతానని చెప్తాడు. స్వప్న వచ్చి అడ్రస్ అంతా చెప్తుంది. స్వప్న చాలా సంతోషంతో తల్లిని ముద్దాడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: ఇంట్లో ఇద్దరు విశాల్‌లు అందరి ఫ్యూజులు అవుట్.. గాయత్రీ నువ్ సూపర్ తల్లీ!