అన్వేషించండి

Karthika Deepam 2 September 11th: కార్తీకదీపం 2 సీరియల్: 99 శాతం కోమాలోకి వెళ్లిన కార్తీక్.. శౌర్య పిలుపుతో స్పృహలోకి.. బావ పరిస్థితికి జ్యోత్స్న ఎమోషనల్!

Karthika Deepam 2 Today Episode దీప వల్లే కార్తీక్‌కి ఇంత ప్రమాదం జరిగిందని దీప ఇంట్లో ఉండటానికి వీల్లేదని జ్యోత్స్న తల్లిదండ్రులతో గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శౌర్యని తీసుకొని దీప హాస్పిటల్‌కి వెళ్తుంది. డాక్టర్లు కార్తీక్‌ని స్పృహ నుంచి లేపడానికి ప్రయత్నిస్తారు. కార్తీక్ లేవకపోవడంతో బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు వచ్చి పిలవమని మీ గొంతు వింటే లేస్తాడేమో అని అంటారు. అందరూ వచ్చి కార్తీక్‌ని లేపుతారు. ఏడుస్తారు. జ్యోత్స్న కూడా బావ నిన్నూ ఇలా చూడటం నా వల్ల కావడం లేదు బావ నా కోసం లే అంటూ ఏడుస్తుంది. అయినా ప్రయోజనం ఉండదు. ఇక డాక్టర్ మరోసారి కార్తీక్‌ని చెక్ చేసి కోమాలోకి వెళ్లిపోతున్నాడు అని అంటారు. 

కార్తీక్‌కి ఇక పిలిచినా వినిపించదని 99 శాతం కోమాలోకి వెళ్లిపోయాడని చెప్తారు. ఇక కార్తీక్ స్పృహలోకి వచ్చే అవకాశమే లేదు అని చెప్తాడు. అందరూ గట్టిగా ఏడుస్తారు. జ్యోత్స్న ఏడుస్తూ అక్కడుండలేక బయటకు వెళ్లిపోతుంది. అక్కడికి పారిజాతం వస్తుంది.

పారిజాతం: ఇదంతా  నీ చేతులారా నువ్వు చేసుకున్నదేనే. మనుషుల జీవితాలు మారిపోయేది హాస్పిటల్‌లోనేనే. ఒకప్పుడు స్వార్థంతో నేను చేసిన పాపం నీకు శాపం అయింది. చాలా కలలు కన్నాను ఆ కలలు అన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయే.
జ్యోత్స్న: నువ్వు అలా అనొద్దు గ్రానీ. ఎందుకంటే నేను ఎవరికి పుట్టాలో నేను అనుకోలేదు. ఎవరి దగ్గర పెరగాలో అని నేను అనుకోలేదు. నా జీవితంలో నేను ఏదైనా అనుకున్నది ఉంది అంటే అది బావని పెళ్లి చేసుకోవడమే. దీప మీద నాకు ఉన్న కోపం ఎంత నిజమో బావ మీద నాకు ఉన్న ప్రేమ అంతే నిజం. బావకి ఏమైనా జరిగింది అంటే అంతకు ముందు నేను చచ్చిపోతాను.
పారిజాతం: 99 శాతం చాన్స్ లేదు అని డాక్టర్లు చెప్తున్నారు కదే.
జ్యోత్స్న: 1 శాతం ఉంది కదా గ్రానీ ఆ ఒక్క శాతం బావని నా కోసం బతికించడానికి ఏదైనా అద్భుతం జరగొచ్చు కదా.
పారిజాతం: అద్భుతం జరగాలి అంటే ఆ దేవుడే ఎవరో ఒకర్ని పంపాలి.

శౌర్య కార్తీక్ కార్తీక్ అని పరుగున వస్తుంది. కార్తీక్ దగ్గరకు వెళ్తానని శౌర్య అంటుంది. మీ వల్లే ఈ పరిస్థితి కార్తీక్‌కి వచ్చిందని ఇక కార్తీక్ మీద ఆశలు వదులుకోవాలని పారిజాతం అంటూ శౌర్యని వెళ్లనివ్వకుండా పట్టుకుంటే శౌర్య పారిజాతం చేయి కొరికి కార్తీక్ దగ్గరకు పరుగులు తీస్తుంది. కార్తీక్ లే ఏమైంది కార్తీక్ అంటూ కార్తీక్ చేయి పట్టుకొని ఏడుస్తుంది. ఇక డాక్టర్ శౌర్యతో నీ పిలుపు వినగానే అతనిలో కదలిక వచ్చిందని నువ్వు మాత్రమే పిలువు అని శౌర్యతో చెప్తాడు. దాంతో శౌర్య కార్తీక్ నాతో మాట్లాడు మనం ఇంటికి వెళ్లిపోదాం లే కార్తీక్ అని పిలిచి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇప్పుడు నువ్వు చూడకపోతే నీతో నా ఫ్రెండ్ షిప్ కట్ అని శౌర్య అనగానే కార్తీక్ కళ్లు తెరుస్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు. కార్తీక్ కోమా నుంచి తేరుకోవడానికి శౌర్యనే కారణం అని డాక్టర్ అంటాడు. 

కార్తీక్‌ని తీసుకొని ఇంటికి వస్తారు. రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే లేచి నడుస్తావని సుమిత్ర ధైర్యం చెప్తుంది. దానికి కార్తీక్ మీరంతా నా దగ్గర ఇలా ఏడుస్తూ జాలిగా ఉంటే రెండు నెలలు అయినా నేను కోలుకోలేనని అంటాడు. తాను తొందరగా కోలుకోవాలి అంటే మీరంతా ముందు ఇంటికి వెళ్లిపోండి అని తనని చూడటానికి ఎవరూ రావొద్దని కోలుకున్న తర్వాత నేనే వస్తాను అని అంటాడు. కార్తీక్ కోసం అందరూ వెళ్లిపోతారు. నేను వెళ్లను అని జ్యోత్స్న అంటుంది. నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు వస్తాను అని అంటుంది. 

కార్తీక్‌కి స్వప్న ఫోన్ చేస్తుంది. నీ అడ్రస్ చెప్పు నీకు ప్రమాదం జరిగిందని వస్తాను అని అంటాడు. స్వప్న వస్తాను అంటే కార్తీక్ వద్దని అంటే ఇద్దరి తండ్రి ఒకరే అని తెలిసిపోతుందని అనుకొని రావొద్దని అంటాడు. తానే కోలుకున్నాక వస్తాను అంటే మీ ఇంటికి వచ్చే అర్హత నాకు లేదా అని ఫీలవుతుంది. దీప కూడా విషయం చెప్పి రావొద్దని అందని చెప్తుంది. దాంతో స్వప్న ఫీలవుతుంది. త్వరగా కోలుకుంటే కలుద్దామని అంటుంది. జ్యోత్స్న ఇంటి దగ్గర కార్తీక్, దీపల మాటలు తలచుకొని బాధ పడుతుంది. బావ అడ్డుపడకుండా ఉంటే తన అడ్డు తొలగిపోయేది అని అనుకుంటుంది. ఇక పారు వచ్చి బాధ పడకు కార్తీక్ దగ్గరకు వెళ్దామని అంటుంది. 

జ్యోత్స్న సుమిత్ర, దశరథ్‌ల దగ్గరకు వెళ్తే గ్రానీ కొడుకుని బాబాయ్ అని పిలిస్తే తాతయ్య ఎందుకు తిట్టాడని అడుగుతుంది. దానికి సుమిత్ర ఏదో తప్పు చేశాడని అంటుంది. దాంతో జ్యోత్స్న తప్పు చేసిన వాళ్లకి ఈ ఇంట్లో స్థానం లేదు. దీప వల్లే ఇంత ప్రమాదం జరిగితే అయినా ఇంకా ఎందుకు తనని పంపించడం లేదని అడుగుతుంది. ఇక పారిజాతం నీ మేనల్లుడు చావు అంచుల వరకు వెళ్లి వచ్చినా నీకు అవసరం లేదు అని కార్తీక్‌కి ఏమైనా అయితే నీ కూతురు ప్రాణాలు తీసుకునేదని ఈ గోల అంతా పెళ్లి ఆగిపోయిందని అంటున్నాం అని మీరు అనుకుంటున్నారు కానీ దీప వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఎవరికీ మనస్శాంతి లేదని ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని అంటుంది. ఎందుకు గొడవ చేస్తున్నారు అని సుమిత్ర అడిగితే జ్యోత్స్న తనని పోలీసులు అరెస్ట్ చేయడం ఎవరి వల్ల నిశ్చితార్థం ఆగిపోవడం ఎవరి వల్ల అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయిగారు సీరియల్: ముత్యాలుకి కిడ్నీ ఇచ్చి కాపాడింది అమ్మాయిగారే అని చెప్పేసిన రాజు.. మొత్తం నాశనం చేసిన విజయాంబిక!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Squid Game Season 2 Teaser: స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Embed widget