అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today November 8th: కార్తీకదీపం 2 సీరియల్: అమ్మ వద్దని ఇంటి నుంచి వెళ్లిపోతానన్న శౌర్య.. ఎమోషనల్ అవుతూ అందర్ని ఏడిపించేసిన పాప!

Karthika Deepam 2 Serial Today Episode శౌర్య తల్లిని ఫంక్షన్‌కి ఒప్పించడానికి ఎమోషనల్‌గా మాట్లాడి దీపని ఆలోచనలో పడేలా చేసి ఫంక్షన్‌కి ఒప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్, దీపలు ఒకర్ని ఒకరు ఢీ కొట్టుకోవడంతో శౌర్య మరోసారి తల కొట్టుకోవాలని లేదంటే కొమ్ములు వస్తాయని చెప్పి ఇద్దరినీ ఢీ కొట్టుకునేలా చేసి ఫోటో తీస్తుంది. తర్వాత కాంచన, అనసూయలకు ఆ ఫోటో చూపిస్తుంది. అనసూయ, కాంచన చాలా సంతోషపడతారు. ఇక దీప వచ్చి ఆ ఫొటో ఎప్పుడు తీశావ్ అని ఆ ఫొటో డిలీట్ చేయమని అంటుంది. శౌర్య డిలీట్ చేయనని అంటే దీప వెళ్లిపోతుంది.

అనసూయ: మీ అమ్మతో మాట్లాడి ఫంక్షన్‌కి ఒప్పించవే. రేపు ఫంక్షన్‌ జరగకపోతే మీ అమ్మానాన్న విడిపోతారు.
శౌర్య: అమ్మో అమ్మానాన్న విడిపోతారు.
అనసూయ: అవును నువ్వేం చేస్తావో చేయ్ మీ అమ్మని అయితే ఒప్పించు. 
కాంచన: పాపం చంటి దానితో అలా అన్నావ్ ఏంటి అనసూయ.
అనసూయ: చంటిది తల గుద్దుకోవడానికి ఒప్పించింది అంటే ఫంక్షన్‌కి కూడా ఒప్పిస్తుందమ్మా.

స్వప్న, కాశీలు ఫంక్షన్‌ గురించి మాట్లాడుకుంటారు. దీప ఒప్పుకుంటుందా అని అంటే శౌర్య వదిలి పెట్టదని అంటుంది స్వప్న. ఇక మామయ్య, చిన్నత్తయ్య వస్తుందా అని కాశీ అడిగితే ఇంటికి వెళ్లి చెప్పాం కదా వస్తారని అంటుంది. ఇక కాశీ కావేరికి కాల్ చేయమని స్వప్నతో చెప్తాడు. స్వప్న చేస్తుంది. శ్రీధర్ చూసి కావేరికి పిలిచి కాల్ లిఫ్ట్ చేస్తాడు. కాశీ మాట్లాడటంతో కావేరికి ఫోన్ ఇచ్చి కాల్ చేసింది నా కూతురు కాదు నీ అల్లుడు అని అంటాడు. కావేరి ఫోన్ తీసుకొని అల్లుడుగారు అని అంటే శ్రీధర్ అల్లుడు గారు అంట ఏంటీ నాకీ ఖర్మ అని అనుకుంటాడు. ఇక కాశీ మామయ్య గారికి తీసుకురమ్మని అంటే కచ్చితంగా తీసుకొస్తా అని చెప్తుంది.

కావేరి: ఏవండీ రేపు మనం రిసెప్షన్‌కి వెళ్తున్నాం మీరు సూట్ వేసుకోండి.
శ్రీధర్: ఏ మనకు కూడా పక్కన రిసెప్షన్ ఏర్పాటు చేశారా చేసినా చేస్తాడులే నీ అల్లుడు అలాంటి వాడే. ఇది పొరపాటున ఎప్పుడైనా లోకల్‌ పేపర్ వాడు చూస్తే ఏం రాస్తాడో తెలుసా.. రెండో పెళ్లావిడిన పెళ్లి చేసుకున్న కొడుకు.. రెండో పెళ్లి చేసుకున్న తండ్రి అని రాస్తారు. 
కావేరి: ఇలా భయపెట్టే నన్ను ఇంట్లో పిరికి దానిలా కూర్చొపెట్టారు. అల్లుడు కూతురు పిలిచారు మనం వెళ్తున్నాం అంతే.
శ్రీధర్: నా బొంద వెళ్తున్నాం పిండా కూడు వెళ్తున్నాం మళ్లీ జన్మంటూ వెళ్తే రెండో పెళ్లి కాదు అసలు పెళ్లే చేసుకోకూడదు. మనసులు బాగా భరితెగించేశారు. వీళ్లు రిసెప్షన్ చేస్తా అంటే ఆ దీప ఎలా ఒప్పుకుందో. నేను వెళ్లాలా వద్దా నా భార్యని నా కొడుకుని నాకు దక్కకుండా చేయడం కారణం దీపనే కదా అలాంటి దీపని అవమానించాలి నిన్ను బాధ పెట్టడానికి అయినా నేను వస్తాను దీప వస్తాను.
దీప: నేను రిసెప్షన్ చేసుకుంటే జ్యోత్స్న ఊరుకుంటుందా. జ్యోత్స్న విషయం పక్కన పెడితే కార్తీక్ బాబు పక్కన నేను భార్యగా ఎలా ఉండగలను. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికైనా వెళ్లిపోవాలి అని ఉంది. 

అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే దీపని వడ్డించడానికి అనసూయ పిలుస్తుంది. శౌర్యని పిలవడానికి అనసూయ వెళ్తుంది. శౌర్య కనిపించదు. దాంతో అందరూ శౌర్య ఎక్కడుందా అని అనుకుంటారు. దీప తిట్టడం వల్లే ఇలా అయిందని అనసూయ దీపని తిడుతుంది. 

కార్తీక్: పాప కోసమే బతుకుతున్నా అంటావ్ దీప కానీ అది అబద్ధం. నువ్వు స్వార్థపరురాలివి ఎవరు ఏదో అంటారు అని ఊహించుకొని దానిలోనే బతకుతావ్. నన్ను అన్నట్లే దాన్ని ఏదో ఒక మాట అనుంటావ్ అది తట్టుకోలేక ఏ మూలో కూర్చొని ఏడుస్తుంటుంది. పద వెళ్లి వెతుకుదాం. మనకి ఇది అలవాటే కదా. అది బాధపడకూడదు అని నీకు ముందే చెప్పాను దీప. దానికి మాత్రం ఏమైనా అయితే నిన్ను క్షమించను దీప. నాకు శౌర్య కంటే ఎవరూ ఎక్కువ కాదు. 
కార్తీక్: ఓ చోట శౌర్య ఏడుస్తుండటం చూసి ఇక్కడున్నావేంటి అమ్మ నీ కోసం అందరం వెతుకుతున్నాం నీకు ఏం కావాలి చెప్పు.
శౌర్య: నాకు ఇది కావాలి. అని తల్లీదండ్రులతో కలిసి ఉన్న డ్రాయింగ్ చూపిస్తుంది. నాకు అమ్మానాన్న కావాలి. వీళ్లు నా అమ్మానాన్న కాదు. అమ్మానాన్న అంటే ఇలా కలిసి ఉండాలి. వీళ్లు అలా ఉన్నారా. మా అమ్మానాన్న ఇలా లేరు. నాకు ఎప్పుడూ అమ్మే ఉండేది నాన్న కావాలి అని ఉండేది. కానీ ఇప్పుడు నాకు నాన్న ఉన్నారు కానీ అమ్మ కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. 
దీప: నేను ఉన్నా కదా.
శౌర్య: ఉన్నావమ్మా కానీ ముందులా లేవు. ప్రేమగా లేవు. తినిపించడం లేదు. ఇంతకు ముందు ఏమైనా అడిగితే తిట్టేదానివి తర్వాత ఇచ్చేదానివి ఇప్పుడు మాత్రం నేను ఏం అడిగినా తిట్టేసి నన్ను వదిలేసి వెళ్లిపోతున్నావు. నేను ఏడుస్తున్నా అమ్మానీకు తెలుసా. నాతో ప్రేమగా ఉండు అమ్మా. నా ఫ్రెండ్స్ అమ్మానాన్నలు ఉన్నట్లు మీరు ఉండాలి అమ్మ. నేనంటే నీకు ప్రేమ లేదు. నేను అంటే నీకు ప్రేమ ఉంటే ఫంక్షన్కి ఒప్పుకో అమ్మ. నాకు అమ్మా నాన్న వద్దు. శౌర్యకి ఎవరూ లేరు. శౌర్య కోసం ఎవరూ ఏం చేయరు. మీ దగ్గర ఉంటే ఇలాగే ఏదో ఒకటి అడుగుతాను అందుకే నేను ఎక్కడికైనా వెళ్లిపోతాను. 
దీప: ఇంకోసారి ఆ మాట అడిగితే చెంప పగలగొట్టేస్తా చెప్తున్నా నువ్వు వెళ్లిపోతే నేను ఎవరి కోసం బతకాలి. 
శౌర్య: అయితే ఫంక్షన్‌కి ఒప్పుకో అమ్మ.
దీప: సరే శౌర్య. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 Also Read: 'త్రినయని' సీరియల్: విశాల్ వెనుక త్రినేత్రి పరుగులు.. ఒకేలాంటి చీరల్లో నయని, త్రినేత్రి.. బలి కాబోతుంది ఎవరో?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget