అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today November 14th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్, దీపలను దూరం చేయమని తల్లితో చెప్పిన జ్యోత్స్న.. మనసు విప్పి మాట్లాడుకున్న దీప, కార్తీక్‌లు!

Karthika Deepam 2 Serial Today Episode తన మెడలో తాళి విప్పేసి జ్యోత్స్నని పెళ్లి చేసుకోమని దీప కార్తీక్‌కి చెప్పడం నీ భర్తని త్యాగం చేస్తావా అని కార్తీక్ అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్‌తో సంతోషంగా కాపురం చేస్తానని మాట  ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటానని అనసూయ దీపతో అంటుంది. తిండి కోసం నేను ఇక్కడ ఆగలేదే నువ్వు సంతోషంగా ఉంటే చూసి పోదామని ఉన్నానే అని అంటుంది. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు అని దీప అంటే కాంచన వచ్చి అర్థం చేసుకుంది కాబట్టే  మాట అడుగుతుందని అంటుంది. 

కాంచన: నా కొడుకు నీ మెడలో మూడు ముళ్లు వేసింది నీ కూతురి కోసమే కాదు నీ కోసం కూడా వాడికి అన్నీ తెలిసే తన జీవితాన్ని నీకు ఇచ్చాడు. పోనీ నేను ఏమైనా నిన్ను ఓ మాట అన్నానా లేదు కదా నాకు కావాల్సింది నా కొడుకు సంతోషం. నేను నిన్ను కోడలు అనుకున్నా నీ కూతుర్ని నా మనవరాలిగా చూసుకుంటున్నా కానీ నువ్వు నన్ను అత్తగా చూడటం లేదు కార్తీక్‌ని భర్తగా చూడటం లేదు. ఈ ఇంటి సంతోషం నీ చేతుల్లోనే ఉంది దీప. మా ఆశల్ని నువ్వే నిలబెట్టాలి. రా అనుసూయ దీపని ఒంటరిగా వదిలేయ్. 
అనసూయ: నీ సంతోషం  కోసం ఆలోచించే వారిని బాధ పెట్టడం మంచిది కాదే. నాకు మాట ఇవ్వకపోయినా పర్లేదు నువ్వు మారితే అంతే చాలు.

దీప మొత్తం ఆలోచిస్తూ ఏడుస్తుంది. ఇక కార్తీక్ శౌర్యని తీసుకొని బయటకు వెళ్తాడు. శౌర్య కార్తీక్‌తో తాతయ్య ఎందుకు మనతో ఉండటం లేదు అని అడుగుతుంది. చిన్న నానమ్మ దగ్గర ఎందుకు ఉన్నారు అని అడిగితే దానికి కార్తీక్ ఏం చెప్పాలో తెలీక చిన్న నానమ్మకి సాయంగా వెళ్లారని చెప్తాడు. ఇంకెప్పుడూ తాతయ్య గురించి అడగొద్దని చెప్తాడు. ఇక శౌర్య జ్యో ఎందుకు నిన్ను అమ్మని తిడుతుంది. అమ్మ బాధ పడుతుంది. మనం సంతోషంగా ఉండటం వాళ్లకి ఇష్టం లేదా నాన్ని అని శౌర్య కార్తీక్‌ని అడుగుతుంది. పెద్ద వాళ్ల విషయాలు నీకు ఎందుకే అని కార్తీక్ అంటాడు. దాంతో శౌర్య మనం ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదామా అలా అయితే  వాళ్లు రారు నాన్న అని అంటుంది. దాంతో కార్తీక్ జ్యోత్స్నని ఎలా కంట్రోల్ చేయాలో తెలీడం లేదని జ్యోత్స్నతో మాట్లాడాలి అనుకుంటాడు.

సుమిత్ర: కార్తీక్‌ని తప్పు నువ్వు ఏం అడిగినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను జ్యోత్స్న.
జ్యోత్స్న: అయితే దీప బావ జీవితంలో లేకుండా చేయ్ న కూతురి కోసం ఏం చేయడానికి అయినా రెడీ అన్నావు కదా. 
సుమిత్ర: దీప ఇప్పుడు కార్తీక్ భార్య అది నీకు ఎప్పటికీ దక్కదు
జ్యోత్స్న: నేను దక్కించుకుంటా దీప లేకపోతే సాధ్యమవుతుంది. 
సుమిత్ర: దీప జోలికి వెళ్లకు వెళ్తే దాని చేతిలో నువ్వు దెబ్బలు తింటావు. దీప నీ చెంప మీద కొడితే ఆ దెబ్బ నా గుండె మీద తగులుతుంది.
జ్యోత్స్న: దీప నన్ను కొట్టిందని నీకు ఎలా తెలుసు. తాతకు తెలీదు నేను చెప్పలేదు మరి నీకు ఎలా తెలుసు అంటే నువ్వు రిసెప్షన్‌కి వచ్చావా. 
సుమిత్ర: అవును వచ్చాను. దశరథ్ వినేస్తాడు. 
జ్యోత్స్న: విన్నావా గ్రానీ మమ్మీ మరోసారి దీప మీద ప్రేమ చాటుకుంది. ఎవరైనా కన్న కూతురికి అన్యాయం చేసిన మనిషి మీద పగ పెంచుకుంటారు కానీ నువ్వు దీర్ఘసుమంగళీ భవ అని దీవించడానికి వెళ్లావ్ నీకు ఇంత పక్షపాతం ఎందుకమ్మా. నీ కూతురిగా జ్యోత్స్న ఉండటం ఇష్టం లేదా అదే అయితే దీపని దత్తత తీసుకో. 
సుమిత్ర: ఇంక చాలు ఆపు. 

జ్యోత్స్నని కొట్టడానికి సుమిత్ర చేయి ఎత్తితే పారిజాతం అందరూ కొట్టండి దీన్నే కొట్టడం మీ అందర్నీ చూస్తే దీన్ని బతకనిచ్చేలా లేరని అంటుంది. ఇక పారిజాతానికి సుమిత్ర తన కూతురికి దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. దశరథ్ సుమిత్రతో నువ్వు రిసెప్షన్‌కి వెళ్లకుండా ఉండాల్సింది అంటాడు. నాకు చెప్పకుండా ఎప్పుడూ ఇలా చేయొద్దని చివరి వార్నింగ్ ఇస్తాడు. దీప, కార్తీక్, పాప ఒకే బెడ్ మీద పడుకుంటారు. కార్తీక్ దీపని పిలుస్తాడు. ఇంత జరిగిన తర్వాత నువ్వు ప్రశాంతంగా పడుకోవని తెలుసని అంటాడు. 

కార్తీక్: దీప ఈ రిసెప్షన్ వల్ల మంచే జరిగింది. మన పెళ్లి గురించి పది మందికి తెలిసింది. నన్ను ఏమైనా అంటే నువ్వు ఊరుకోవని జ్యోత్స్న, పారులకు తెలిసింది. ఒక మనిషి నా సొంతం అని ఇంత కంటే గొప్పగా ఎలా చెప్పగలం. 
దీప: సమస్యలతో ఒంటరిగా పోరాడుతున్న మనిషికి సాయం చేసిన వారు దేవుడే కార్తీక్ బాబు నా మనసులో మీరు అంతే గొప్ప స్థానంలో ఉన్నారు. నన్ను చేరదీసిన సుమిత్రమ్మ గారిని తల్లి అనుకున్నా ఆ తల్లి కోరిక ఒకటే మీకు జ్యోత్స్నకి పెళ్లి జరగాలి అని కానీ మీరు నాకు ఆ అవకాశం లేకుండా చేశారు. ఎవరు అవును అన్నా కాదు అన్నా నేను మీకు భార్యనే మీరు నాకు భర్తే కానీ ఈ మాట నా మనసు ఒప్పుకోవడం లేదు బాబు. నా మెడలో ఉన్న తాళి విప్పి జ్యోత్స్న మెడలో కట్టండి బాబు. కట్టగలరా.
కార్తీక్: నీ భర్తని నువ్వు త్యాగం చేయాలి అనుకుంటున్నావా
దీప: ఇది త్యాగం కాదు బాబు ధర్మం జ్యోత్స్న మీ కోసమే బతుకుతుంది. మిమల్ని తప్ప వేరే పెళ్లి చేసుకోలేదు. మిమల్ని దక్కించుకునే వరకు వదలదు. 
కార్తీక్: జ్యోత్స్నని పెళ్లి చేసుకోవాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. నీతో పెళ్లి వల్ల నేను సంతోషంగా ఉన్నాను నువ్వు ఉండొచ్చు కదా. 

నేను ఉండలేను అని దీప బెడ్ మీద నుంచి వెళ్లిపోబోతుంటే కార్తీక్ ఆపి నువ్వు వెళ్లడం నాకు ఇష్టం లేదు అంటాడు. దాంతో దీప తన గదికి వెళ్లి దుప్పటి చాప తెచ్చుకొని కింద పడుకుంటుంది. నీ బాధని పోగొడతాను దీప అని కార్తీక్ అంటాడు. ఇక దీప కార్తీక్‌తో సంతోషంగా ఉండాలి అని ఉంది కానీ ఉండలేకపోతున్నా అని తాళి పట్టుకొని అనుకుంటుంది. ఇక కార్తీక్ వైపు చూస్తుంది కార్తీక్ తన వైపు చూడగానే ముఖం తిప్పేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర, మనీషా మధ్య మల్లెపూల చిచ్చు పెట్టిన లక్ష్మీ.. ఇరువురి భామల మధ్య ఇరుక్కుపోయిన మిత్ర!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
Ind Vs Aus Semi Final Live Score Update: ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
DVV Danayya Daughter Jahnavi: నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?
నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Aus Semi final Preview | Champions Trophy 2025 లోనైనా ఆసీస్ ఆ రికార్డు బద్ధలు అవుతుందా | ABPTravis Head vs India | హెడ్ మాస్టర్ ని ఆపగలిగితే Champions Trophy 2025 ఫైనల్ కి మనమే | ABP DesamInd vs Aus Semis 1 Preview | Champions Trophy 2025 లో కంగారూలను టీమిండియా కుమ్మేస్తుందా.? | ABPOscar 2025 | 97వ ఆస్కార్‌ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన అనోరా సినిమా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
Ind Vs Aus Semi Final Live Score Update: ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
ఆసీస్ డీసెంట్ స్కోరు.. స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భార‌త్ ముందు ఊరించే టార్గెట్
DVV Danayya Daughter Jahnavi: నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?
నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?
KTR : రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ - సారీ చెప్పిన కేటీఆర్
రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ - సారీ చెప్పిన కేటీఆర్
SSMB29: రాజమౌళి, మహేశ్ మూవీలో 'ప్రియాంక చోప్రా' - ఆమె మదర్ ఏం చెప్పారంటే?
రాజమౌళి, మహేశ్ మూవీలో 'ప్రియాంక చోప్రా' - ఆమె మదర్ ఏం చెప్పారంటే?
Andhra MLC Elections: కలసి ఉంటే కలదు విజయం -ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని కూటమి - కళ్లు తిరిగే మెజార్టీలు
కలసి ఉంటే కలదు విజయం -ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని కూటమి - కళ్లు తిరిగే మెజార్టీలు
  ఇద్దరు పిల్లలు వద్దు....గంపెడు పిల్లలే ముద్దు.  తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు.
  ఇద్దరు పిల్లలు వద్దు....గంపెడు పిల్లలే ముద్దు.  తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు.
Embed widget