Karthika Deepam 2 Serial Today March 29th: కార్తీకదీపం 2 సీరియల్: దీప తప్పు చేసిందన్న కార్తీక్.. ఫ్యామిలీకి జ్యోత్స్న ఎందుకు సారీ చెప్పింది!!
Karthika Deepam 2 Serial Today Episode దీప వల్లే తన జీవితం నాశనం అయిందని తాత పరువు పోయిందని జ్యోత్స్న ఏడుస్తూ ఇంట్లో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న సుమిత్రమ్మ గారి కూతురి కాబట్టి సుమిత్రమ్మ అంటే నాకు అంత ఇష్టం కాబట్టి చాలా సార్లు జ్యోత్స్నని ఏం అనకుండా కాపాడాను అని అంటుంది. తల్లి లేని నాకు సుమిత్రమ్మ, జ్యోత్స్నల్ని చూస్తే ఆ తల్లీకూతుళ్ల బంధం చూసి బాధ పడ్డాను అని అంటుంది. ఎవరికైనా అన్యాయం జరిగితే చూసి తట్టుకోలేని నేను సుమిత్రమ్మ కూతురికి అన్యాయం జరిగితే ఎలా ఊరుకుంటాను అందుకే నిశ్చితార్థం ఆపాను అని అంటుంది.
కార్తీక్: ఇప్పటికీ నీదే తప్పు అని చెప్తున్నా దీప. నిశ్చితార్థం ఆపడం గౌతమ్‌ని కొట్టడం కాదు నాతో చెప్పాల్సింది. గౌతమ్ రింగు తొడిగినా మూడు ముళ్లు వేసినా వేసిన ముళ్లు విప్పించి మరీ కొట్టుకుంటూ స్టేషన్‌కి తీసుకెళ్లేవాడిని.
దీప: నేను చేసింది అదే కదా బాబు.
కార్తీక్: నువ్వు అదీ చేశావ్ కానీ సాక్ష్యం ఏది. పైగా వాడు అందరీకీ తెలుసు. నువ్వు చెప్పింది కాసేపు నేను నమ్మలేకపోయా. వాడు చాలా తెలివిగా నింద నీ మీద వేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు చెప్పు తప్పు ఎవరిది. అక్కడ ఏం జరిగిందో అనసూయ గారికి తెలీదు కాబట్టి అత్త తిడుతున్నా ఓ మాట అడ్డు వేశారు కానీ మేం జరిగింది చూశాం కాబట్టి ఏం అనలేకపోయాం.
కాంచన: అవును దీప నిశ్చితార్థం ఆగిపోయింది దాని నుంచి తేరుకోవడానికి చాలా టైం పడింది. నువ్వు చేసింది తప్పు అని అనను కానీ చేసిన విధానం తప్పు దీప. పైగా వాడికి శిక్ష కూడా పడలేదు. చివరిగా మా అన్నయ్య నన్ను క్షమించమ్మా అన్న ఒక్క మాట జీవితంలో మర్చిపోలేను దీప. మర్చిపోలేను.
కార్తీక్: ఇక ఇప్పుడు మనం ఏం చేయలేం దీప జరిగింది మర్చిపో.
అనసూయ: సుమిత్రమ్మ నన్ను తిట్టింది కరెక్టే నేను ఎప్పుడూ నిన్ను మనిషిలా కూడా చూడలేదు. నీ విషయంలో చాలా తప్పులు చేశాను కానీ మరో నిజం కూడా ఉంది నువ్వు నీ కూతురి కోసం బతుకుతున్నట్లే నేను నీ కోసం బతుకుతున్నానే. ఈ ప్రపంచం అన్నా తప్పు పట్టినా నాకు మాత్రం నువ్వు చేసింది కరెక్టే నీ కోసం మాట అడ్డు వేయడం కాదు. ప్రాణం కూడా అడ్డు వేస్తా. నీ ఆవేశం వల్ల చెడ్డవాడికి న్యాయం జరిగింది మంచి వాళ్లకి శిక్ష పడింది.
దీప: ఇప్పుడు నేను ఆ ఇంటికి ఆ మనుషులకు శత్రువు అయిపోయాను. పాపం చేసిన మనిషిలా అయిపోయాను.
శ్రీధర్ ఇంటికి సంతోషంగా గెంతులేస్తూ వస్తాడు. ఏమైంది అందరూ మిమల్ని గెంటేశారా ఇలా అయిపోయారు అని కావేరి అడిగితే నిశ్చితార్థం ఆగిపోయిందని జరిగింది చెప్తాడు. కావేరి షాక్ అయిపోతుంది. దీపని అందరూ ఛీ అన్నారని సంతోషంగా ఉన్నానని అంటాడు. జ్యోత్స్న బాధగా ఉంటే అయిపోయిన దాన్ని మర్చిపోమని అందరూ చెప్తారు. కానీ జ్యోత్స్న అందరి ముందు ఏడుస్తుంది.
పారు: జ్యోత్స్న జరిగిన దాంట్లో నీ తప్పు లేదు కదా.
జ్యోత్స్న: కానీ ఆగిపోయింది నా నిశ్చితార్థం కదా.
దశరథ్: ఏం జరిగినా మన మంచికే జరిగింది జ్యోత్స్న మీ ఇద్దరికీ రాసి పెట్టిలేదని అనుకోవడమే.
జ్యోత్స్న: ప్రతీ సారి ఇలాగే అనుకోవాలా నాన్న. బయటి నుంచి చూసిన ప్రతీ ఒక్కరికీ నా జీవితం గొప్పగా కనిపిస్తుంది కానీ నిజం ఏంటి అంటే గత కొన్ని నెలలుగా నేను బాధ పడని రోజే లేదు. మిస్ హైదరాబాద్‌గా నేను గెలిచినప్పుడు మీరంతా గర్వంగా ఫీలవ్వడం చూశా తర్వాత నా వల్ల మీరంతా బాధ పడటం చూశా. ఇదంతా నాకే కరెక్ట్ కాదు అనిపించింది నేను ఏదేదో ఊహించుకొని కలల వెంట పరుగెడుతున్నాననిపించి మీ అందరి కోసం ఆగిపోయా. కొత్త జీవితం మొదలు పెట్టాలి అనుకున్నా కానీ దీప ఇక్కడ కూడా నాకు కన్నీరు మిగిల్చింది. చిత్రం ఏంటి అంటే నేను పడుతున్న ప్రతీ బాధకి దీపే కారణం తన వల్లే నేను ఏడుస్తున్నా. కానీ నేను ఎప్పుడూ తనని ఏడిపించలేదు. తను హ్యాపీగా ఉంది. సారీ డాడీ సారీ మమ్మీ. సారీ గ్రానీ. మీ అందరినీ నేను హ్యాపీగా ఉంచలేకపోయాను. నేను అందరి కంటే ఎక్కువ తాతకి సారీ చెప్పాలి. తాతకి పరువు అంటే ప్రాణం దీప కారణంగా ఈ రోజు అది లేకుండా పోయింది. దీప జరిగింది తలచుకొని ఏడుస్తుంటే కార్తీక్ భోజనం తీసుకొని వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

