Karthika Deepam 2 Serial Today March 1st: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్య, దీపలు కిడ్నాప్.. జ్యోత్స్న కర్కశత్వం.. తల్లీకూతుళ్ల చావు తప్పనట్లే!
Karthika Deepam 2 Serial Today Episode దీప, శౌర్యలను జ్యోత్స్న కిడ్నాప్ చేయించడం జ్యోత్స్నను శౌర్య చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్‌కి దీపే తన ప్రాణ దాత అని తెలిసిపోతుంది. సంతోషంలో ఉబ్బితబ్బిబైపోతాడు. ఫొటో పట్టుకొని ఇక దీంతో పని లేదని అనుకుంటాడు. ఫొటోని గుండెలకు హత్తుకొని చాలా సంతోషపడతాడు. నువ్వు నాకు ఇవ్వాలి అనుకున్న సర్‌ఫ్రైజ్ కంటే నేను నీకు పెద్ద సర్‌ఫ్రైజ్ ఇస్తాను అనుకుంటాడు. వస్తున్నా దీప అని బయల్దేరుతాడు.
దీప పాపని తీసుకొని స్కూల్ నుంచి వస్తుంది. జ్యోత్స్న దూరం నుంచి చూస్తుంది. జ్యోత్స్న వస్తే కారు ఎక్కొద్దని శౌర్యతో చెప్తుంది. ఇంతలో శౌర్య ఐస్ క్రీమ్ తింటానని వెళ్తుంది. రౌడీలు దీపని పొడవడానికి వస్తే దీప వాళ్లని చితక్కొట్టేస్తుంది. మరో రౌడీ దీప తల కొట్టేస్తాడు. దీప వాడి మీద ఎదురు తిరుగుతుంది. ఇక దీపని రౌడీలు పట్టుకుంటారు. శౌర్య చూసి షాక్ అయిపోతుంది. దీప పాపని పారిపో మని చెప్తుంది. పాప పరుగులు పెడుతుంది. ఇక దీపని జ్యోత్స్న రుమాలుతో మత్తు మందు పెట్టడం శౌర్య చూస్తుంది. జ్యో ఏంటి ఇలా చేసిందని అనుకుంటుంది శౌర్య. ఇక శౌర్య పరుగులు పెడతూ షూ వదిలేస్తుంది. రౌడీలు శౌర్య మెడలో కీ చైన్ లాగేస్తారు.
సుమిత్ర భర్తతో జ్యోత్స్నతో మార్పు వచ్చిందని భర్తతో చెప్తుంది. మన కూతురు ఎలాంటిదో నీకు తెలీదు సుమిత్ర సడెన్‌గా ఇంత మార్పు అంటే ఏదో జరుగుతుందని దశరథ్ మనసులో అనుకుంటారు. ఇక జ్యోత్స్న వాళ్లు దీపని ఎవరూ లేని ప్లేస్‌కి తీసుకెళ్తారు. శౌర్య ఓ చోట దాక్కుంటుంది. జ్యోత్స్న రౌడీలకు కాల్ చేసి పాప కనిపించిందా అంటే రౌడీలు లేదని అంటారు. పాప తప్పించుకోకూడదని చెప్తుంది. ఇక పాప కనిపించిందని రౌడీలు చెప్తే దాన్ని వదలొద్దని ఇదే చివరి రోజు కావాలని అంటుంది. జ్యోత్స్న దీపతో సారీ దీప ఈరోజు నిన్ను చంపేస్తున్నా నీకు పుట్టిన పాపానికి నీ కూతురు కూడా బలి అయిపోతుందని అంటుంది.
జ్యోత్స్న గన్ తీసి దీపని కాల్చే టైంకి కార్తీక్ వస్తాడు. కార్తీక్‌ని చూసి జ్యోత్స్న ఆగిపోతుంది. ఇక కార్తీక్ శౌర్య బ్యాగ్ చూసి ఆగుతాడు. ఇదేంటి శౌర్య బ్యాగ్ రోడ్డు మీద పడి ఉందని అనుకుంటూ వెళ్తే దీప చెప్పు కింద పడి ఉండటం చూస్తాడు. జ్యోత్స్న బావకి అనుమానం వచ్చేసిందని ఇక్కడుంటే ప్రమాదం అని దాక్కుంటుంది. ఇక చుట్టూ వెతుకుతాడు. ఓ చోట దీప నేల మీద కుప్పుకూలి ఉండటం చూసి షాక్ అయి పరుగులు తీసి దీపని లేపుతాడు. దీప తప్పించుకుంది శౌర్యని చంపాలని జ్యో వెళ్తుంది. దీపకి మెలకువ వస్తుంది. శౌర్య గురించి అడిగితే దీప దారి చూపిస్తుంది. దీపని అక్కడే వదిలి శౌర్యని కాపాడాలని వెళ్తాడు. దారిలో శౌర్య వస్తువులు చూస్తాడు. జ్యోత్స్న రౌడీలకు కాల్ చేసి శౌర్యని వెతుక్కుంటూ కార్తీక్ వస్తున్నాడని చెప్తుంది. ఇక పాపని రౌడీలు పట్టుకోగానే కార్తీక్ కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

