అన్వేషించండి

Karthika Deepam 2 Serial July 31st: కార్తీకదీపం 2 సీరియల్: దీపని ఇంటికి తీసుకొచ్చిన సుమిత్ర.. దుమ్ము దులిపేసిన జ్యోత్స్న!

Karthika Deepam 2 Serial Episode సుమిత్ర దీపని ఇంటికి తీసుకురావడంతో జ్యోత్స్న పొడిగినట్లే అడిగి కడిగేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode అందరూ భోజనం చేస్తుంటే ఇంతలో సుమిత్రకు కార్తీక్ కాల్ చేసి అర్జెంట్‌గా హాస్పిటల్‌కి రమ్మని పిలుస్తాడు. ఎందుకు కని సుమిత్ర అడిగితే కార్తీక్ మొత్తం చెప్పి నువ్వు మాత్రమే దీపని ఆపగలవని తొందరగా రమ్మని పిలుస్తాడు. సుమిత్ర హడావుడిగా వెళ్లిపోతుంటే దశరథ్ కూడా తోడు వస్తా అంటాడు. సుమిత్ర వద్దని వెళ్లబోతే జ్యోత్స్న తింటున్న ప్లేట్ కోపంతో విసిరి కొడుతుంది.

జ్యోత్స్న: మీ అందరికీ ఏమైంది ఈ రోజు జరగాల్సిన నిశ్చితార్థం ఆగిపోయింది. దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా. మరోసారి ఇలా జరగకూడదు అని కానీ కనీసం జరిగిన దానికి మీరు కొంచెం అయినా ఫీలవుతున్నారా. ఒకరేమో రెస్టారెంట్ గురించి, మరొకరేమో ఆరోగ్య సూత్రాలు మాట్లాడుతున్నారు. ఇంకొకరేమో ఎక్కడో ఉన్న ఎవరి కోసమో మాట్లాడుతున్నారు. ఎవరికో సేవలు చేస్తున్నారు. ఇక స్వాయానా నా మాతృమూర్తి అయితే తిన్న ప్లేట్‌లో చేయి కడిగిసే ప్రపంచం ఆగిపోతుంది అన్నట్లు పరుగులు పెడుతుంది. నేను వచ్చి ఇంత సేపు అయింది ఒక్క ముద్ద నోటిలో పెట్టుకోలేదు అది ఎవరైనా గమనించారా. ఒక్కరైనా అడిగారా. పక్కనే ఉన్న కూతురు మనకు అవసరం లేదు కానీ ఎక్కడో ఉన్న దీప కావాలి.
సుమిత్ర: జ్యోత్స్న సాయం చేయడం నా ధర్మం కాదా.
జ్యోత్స్న: ప్రాణాలు కాపాడింది అన్న ఒక్క మాటతో దీప నా ప్రాణాలు తీస్తుంది. 
శివనారాయణ: జ్యోత్స్న నీ బాధ మాకు అర్థమైంది. కానీ చూపించే పద్ధతి ఇది కాదు. 

ఇక సుమిత్ర హాస్పిటల్‌కి వెళ్తుంది. ఇక శివనారాయణ, దశరథ్‌లు దీప గురించి మాట్లాడుతారు. దీప పాపకి తినిపిస్తూ తాను వెళ్లిపోతే తప్పుగా అనుకుంటారని ఉన్నా తప్పు అనుకుంటారని అనుకుంటుంది. ఇంతలో సుమిత్ర కార్తీక్ దగ్గరకు వస్తుంది. జ్యోత్స్న వచ్చి దీపని తిట్టారని చెప్తాడు. ఇక కార్తీక్‌ని ఇంటికి వెళ్లిపోమని తాను దీపని తీసుకొని వెళ్తానని అంటుంది. సుమిత్ర దీప దగ్గరకు వెళ్తుంది. కార్తీక్ బిల్లు కట్టేశాడని ఇక ఇంటికి వెళ్లడమే అని అంటుంది. దానికి దీప ఆ ఇంటికి రాను అంటుంది. జ్యోత్స్న మాటలు పట్టించుకోవద్దని దీపకు సుమిత్ర చెప్తుంది. నువ్వు నాతో రావాలి అని ఇప్పుడు వెళ్లిపోతే అందరూ తప్పుగా అనుకుంటారని అంటుంది. ఇక సుమిత్ర దీపని ఒప్పించి ఇంటికి తీసుకెళ్తుంది. 

నర్శింహ, అనసూయలు భోజనం చేస్తూ ఉంటారు. శోభ వడ్డిస్తూ దెప్పిపొడుస్తుంది. ఇక శోభని పిల్లలు లేకే ఇలా మాకు ఈ పరిస్థితి వచ్చిందని అనసూయ అంటుంది. ఇక నర్శింహ శోభకి తినిపిస్తాడు. అనసూయ కూతురు కావాలి అంటే ముందు తండ్రిగా ఆ పిల్ల మీద ప్రేమ చూపించని అంటుంది. ఇక శోభ మీ అమ్మ మాటలు పట్టించుకోవద్దని అంటుంది. ఇక దీప ఆ ఇంటికే వెళ్తుందని వేరే దాని లేదని నర్శింహ అంటాడు. ఈ సారి ఎలా అయినా తన కూతుర్ని తెచ్చుకుంటానని అంటాడు. సుమిత్ర పాప, దీపని తీసుకొని ఇంటికి వస్తుంది. ఎదురుగా జ్యోత్స్న ఉంటుంది. ఇక జ్యోత్స్న దీపతో మాట్లాడాలి అంటుంది. దీప పాపని లోపల పెట్టి వస్తుంది. నిశ్చితార్థం చెడిపోయినందుకు సారీ చెప్తుంది. దీపతో మాట్లాడుతుంటే సుమిత్ర జ్యోత్స్నని తిడుతుంది. నన్ను ఎవరూ పట్టించుకోరని నీకు ఏదైనా కష్టం వస్తే అందరూ నా దీప నా దీప అని హడావుడి చేస్తున్నారని అంటుంది. దీప తనని అపార్థం చేసుకోవద్దని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రకు బురిడీ కొట్టించిన సంయుక్త.. మిత్ర నోట లక్ష్మీ మాట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget