అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today January 24th: కార్తీకదీపం 2 సీరియల్: రోడ్ల మీద తిరుగుతూ పిచ్చోడిలా ఏడుస్తున్న కార్తీక్.. 2 రోజుల్లో ఆపరేషన్.. శౌర్య బతుకుతుందా! 

Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్ పాప ఆపరేషన్‌కి డబ్బు సర్దుబాటు చేయలేక వెక్కి వెక్కి ఏడుస్తూ తల్లితో విషయం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ దీపతో పాపని తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ బాగా చూసుకుంటుందని పది రకాల వంటలతో భోజనం చేసిందని తన గురించి ఆలోచించొద్దని చెప్తాడు. అందరినీ భోజనం చేయమని చెప్తాడు. తర్వాత కార్తీక్‌కి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చి మిగతా డబ్బు కట్టమని చెప్తారు. కార్తీక్ కట్టేస్తా అని చెప్తున్నప్పుడు దీప గదిలోకి వచ్చి కార్తీక్ వెనకాలే నిల్చొంటుంది. 

దీప: డబ్బు ఎవరికి కట్టాలి బాబు. రెస్టారెంట్ కోసం ఆ డబ్బు ఇచ్చాను అన్నారు.
కార్తీక్: మనసులో ఒక పక్క డబ్బు కట్టాలి అనే బాధ మరోవైపు దీపకి తెలుస్తుందనే బాధ. ఇది వేరే దీప. తాతతో ఛాలెంజ్ చేసి బయటకు వచ్చా కదా టిఫెన్ సెంటర్‌తో కుదరదు కదా. ఇవన్నీ కాదని నేను ఓ గట్టి ప్రయత్నం చేస్తున్నా పెట్టుకున్నా సంకల్ప గట్టిది ప్రాణాలు పెట్టి అయినా కాపాడుకోవాలి. 
దీప: ఎవరిని.  
కార్తీక్: నా సంకల్పాన్ని. లక్ష సమస్యలు ఒకటే సమాధానం డబ్బు. ప్లీజ్ దీప ఈ రెండు రోజులు నేను ఎలా ఉన్న పట్టించుకోకు. నవ్వు అడుగు ముందుకు వేయడానికి కాస్త టైం ఉంది అప్పటి వరకు నన్ను వదిలేయ్.
అనసూయ: బయటకు  వెళ్తున్న కార్తీక్‌తో బాబు చంటిదానికి ఎలా ఉంది నాకు అయినా నిజం చెప్పు బాబు. మీ ప్రవర్తన చూస్తే నాకు అనుమానంగా ఉంది.

కార్తీక్ పాపకి ఏం కాలేదని అనసూయకి చెప్పి మరోసారి ఇలా అడగొద్దని దీపకి తెలిస్తే దీప మంచం పట్టేస్తుందని అంటాడు. ఇక కార్తీక్ ఓ సేటు దగ్గరకు వెళ్లి డబ్బు అడుగుతాడు. 45 లక్షలు కావాలి అంటే తాకట్టుకు ఏం తీసుకొచ్చావ్ అంటాడు. ఏం లేదని కార్తీక్ చెప్తాడు. తాకట్టు లేకపోతే ఏం ఇవ్వను అని అంటారు. నన్ను నేను తాకట్టు పెట్టుకోవడం తప్ప ఇంకేం లేదని కార్తీక్ అనుకొని సైకిల్ మీద తిరుగుతూ డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. కార్తీక్ ఇక హాస్పిటల్‌కి వెళ్తాడు. అక్కడ కాశీ బయట కూర్చొని వర్క్ చేస్తుంటే కార్తీక్ కాశీ నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నా కదా అని అంటాడు. ఇక పాపని చూడటానికి వెళ్తాడు. పాప పక్కనే ఫొటో పెట్టుకోవడం చూసి ఎమోషనల్ అవుతాడు.

ఇక కాశీ డబ్బు గురించి అడిగితే ప్రయత్నాలు చేస్తున్నా అని కార్తీక్ అంటాడు. ఇక కాశీని ఇంటి వెళ్లమంటాడు. పర్లేదు అని కాశీ అంటే మామయ్య సంగతి తెలిసి నిన్ను ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదని పంపుతాడు.  రాత్రి రోడ్డు మీద ఎవరూ లేని టైంలో కార్తీక్ గుండె బాధుకొని డబ్బు పుట్టడం లేదని ఎలా బతికించుకోవాలని ఏడుస్తాడు. రాత్రి ఇంటి బయట కూర్చొని ఏడుస్తుంటే కాంచన, అనసూయలు కార్తీక్ కోసం వెతుకుతూ బయటకు వస్తారు. కార్తీక్‌ని చూసి ఏమైందని అడుగుతారు. శౌర్య ఏ హాస్పిటల్‌లో ఉందని అడిగితే కార్తీక్ చిన్న పిల్లాడిలా తల్లి ఒడిలో పడుకొని ఏడుస్తాడు. పాపకి ఆపరేషన్ చేయాలని లేదంటే బతకదు అని మొత్తం చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తాడు. కాంచన, అనసూయ షాక్ అయి ఏడుస్తారు.

ఆపరేషన్‌కి డబ్బులు లేవని ఏడుస్తాడు. 50 లక్షలు కావాలి అని చెప్పగానే కాంచన, అనసూయ నోరెళ్లబెడతారు. ఉదయం నుంచి తిరుగుతున్నా అప్పు దొరకడం లేదని రెండు రోజుల్లో ఆపరేషన్  అని కాశీ దగ్గర 5 లక్షలు తీసుకొని కట్టానని ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదని ఏడుస్తాడు. ఇవన్నీ దీపకు తెలీకూడదని కార్తీక్ అంటాడు. ఇంతలో దీప వచ్చి నిల్చొంటుంది. ముగ్గురు దీపని చూసి షాక్ అయిపోతారు. ఎన్ని రోజులు అని దాస్తారు మాట్లాడండి కార్తీక్ బాబు అని దీప అంటుంది. దీపకి విషయం తెలియకపోవడంతో అందరూ కవర్ చేస్తారు. ఏం జరిగిందని దీప అడిగితే ఏం లేదని కార్తీక్ వెళ్లిపోతాడు. దీప వెళ్లిపోయిన తర్వాత కాంచన, అనసూయ వెక్కి వెక్కి ఏడుస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: రోడ్లు ఊడుస్తున్న సత్య.. పాపం అని చేస్తుందా.. ప్రచారం కోసం చేస్తుందా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Jubilee Hills by-election : 42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
Advertisement

వీడియోలు

Proud India | భారతదేశంపై అమెరికా అక్కసు వెనక కారణం ఇదే | ABP Desam
Jubilee Hills By Election Counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు భారీ భద్రత ! | ABP Desam
రోహిత్, కోహ్లీల కెరీర్‌లో విలన్‌గా మారిన బీసీసీఐ!
సంజూ కోసం జడ్డూని వదిలేస్తారా? CSKకి పిచ్చి పట్టింది: శడగొప్పన్ రమేష్
నితీష్‌కి బీసీసీఐ అన్యాయం.. మండిపడుతున్న తెలుగు ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Jubilee Hills by-election : 42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
Pawan Kalyan vs Mithun Reddy: డిప్యూటీ సీఎం పవన్‌కు మిథున్ రెడ్డి ఘాటు హెచ్చరిక - క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు
డిప్యూటీ సీఎం పవన్‌కు మిథున్ రెడ్డి ఘాటు హెచ్చరిక - క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు
America shutdown ends:  43 రోజుల కష్టాలకు చెక్ -  అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ తాత్కాలిక ముగింపు - ట్రంప్ సంతకం పూర్తి
43 రోజుల కష్టాలకు చెక్ - అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ తాత్కాలిక ముగింపు - ట్రంప్ సంతకం పూర్తి
Alluri Seetharamaraju district: ఊరికి స్కూల్ వచ్చిందని గిరిజనులు ఉత్సాహం- థింసా నృత్యాలతో సంబరాలు- అధికారులకు సన్మాం చేసిన ఆదివాసీలు!
ఊరికి స్కూల్ వచ్చిందని గిరిజనులు ఉత్సాహం- థింసా నృత్యాలతో సంబరాలు- అధికారులకు సన్మాం చేసిన ఆదివాసీలు!
Red Fort Blasts Conspiracy: 32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
Embed widget