Karthika Deepam 2 Serial Today January 21st: కార్తీకదీపం 2 సీరియల్: మరోసారి కన్నతండ్రిని చంపడానికి ప్రయత్నించిన జ్యోత్స్న.. ఉలిక్కిపాటు.. దీపకి అనుమానం!
Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న మరోసారి దాసుని చంపాలని ప్రయత్నించడం దాసు కళ్లు తెరవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దాసుని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు. పారిజాతం కొడుకు దుస్థితికి ఏడుస్తుంది. నిన్ను ఇలా ఎవరు చేశారో వాళ్ల చేతులు కాలు విరిగిపోవాలి అని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. జ్యోత్స్న బిత్తరపోతుంది. నానమ్మని ఆపుతుంది. నాన్నకి ఏం ప్రమాదం లేదు ఊరుకో అని కాశీ నానమ్మకి చెప్తాడు. చీమని కూడా హాని చేయని తన కొడుకుని ఎవరు ఇలా కొట్టారని పారిజాతం ఏడుస్తుంది. ఇక కాశీ అందరినీ బయటకు రమ్మని పిలిస్తే జ్యోత్స్న ఉంటాను రాను అంటుంది. పారిజాతం జ్యోత్స్నని ఉండనివ్వమని అంటుంది. పారు చూసినప్పుడు జ్యోత్స్న కన్నీరు పెడుతుంది. దాంతో పారు మనసులో జ్యోత్స్నకి తండ్రి మీద చాలా ప్రేమ ఉందని అనుకుంటుంది. అందరూ బయటకు వెళ్లిపోతారు.
జ్యోత్స్న: నా ప్రియమైన తండ్రి నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నావా. నిన్ను అప్పుడే కొంచెం గట్టిగా కొట్టి ఉంటే ఈ పాటికి హ్యాపీగా స్మశానంలో రెస్ట్ తీసుకునేవాడిని. నిన్ను బతకనిస్తే దీప శివనారాయణ వారసురాలని చెప్పేస్తావ్. అక్కడితో ఆగకుండా నిన్ను చంపాలని ప్రయత్నించిందిని నేను అని చెప్తావ్. వారసురాలు కాదు కాబట్టి నన్ను బయటకు గెంటేస్తారు. నిన్ను చంపాలని ప్రయత్నించినందుకు జైలుకి పంపుతారు. లేదంటే నువ్వే జైలుకి పంపుతావ్. ఇవన్నీజరగకూడదు అంటే నువ్వు బతకకూడదు. వాళ్లు వచ్చేలోపు చంపేయాలి అనుకొని తలగడ తీస్తుంది.
ఇంతలో దాసు కళ్లు తెరుస్తాడు. దాంతో జ్యోత్స్న షాక్ అయి తలగడ విసిరేసి అరుస్తుంది. అందరూ అక్కడికి వచ్చి ఏమైంది జ్యోత్స్న అని అడుగుతారు. మళ్లీ దాసు కళ్లు మూసేస్తాడు. జ్యోత్స్న అందరితో బాబాయ్ కళ్లు తెరిచాడు అని చెప్తుంది. కాశీ తండ్రి దగ్గరకు వెళ్లి ఏడుస్తాడు. కార్తీక్ ఓదార్చుతాడు.
దీప: బాబాయ్ కళ్లు తెరిస్తే సంతోషపడాలి కానీ నువ్వెందుకు అంత గట్టిగా అరిచావు. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్.
జ్యోత్స్న: ఏం లేదు.
స్వప్న: పిల్లో కింద పడింది ఎందుకు.
జ్యోత్స్న: తల కింద పెడదామని తీశాను. కళ్లు తెరిచే సరికి ఉలిక్కి పడి అరిచాను కింద పడిపోయింది.
కార్తీక్: అలవాటు లేని ప్రేమలు అంతే.
పారు: కొన్ని ప్రేమలు అంతేలేరా.
జ్యోత్స్న: దాసు బాబాయ్ మా గ్రానీ కొడుకు మాకు బాధ్యత ఉంటుంది. గ్రానీ బాబాయ్‌ని మన ఇంటికి తీసుకెళ్దాం.
కార్తీక్: మీ తాతని దృష్టిలో పెట్టుకొనే ఇలా అంటున్నావా.
జ్యోత్స్న: మా తాత నా మాట కాదు అనడు.
కార్తీక్: ఇలా వెనకేసుకొచ్చే నిన్ను గాడిదలా చేసేశాడు.
పారు: ఏంట్రా అన్నావ్.
కార్తీక్: మీరు అంతా కలిస్తే అదే మాకు సంతోషం అంటున్నా
కాశీ: సారీ అక్క నాన్నని మేం చూసుకుంటాం మీ దగ్గరకు పంపించము.
పారు: అరే దాసు త్వరగా కోలుకోరా నీకు ఉన్నది ఒక్కడే కొడుకు నాకు ఉన్నది నువ్వు ఒక్కడివే కొడుకువి మాకు ఉన్నది నువ్వేరా నీకు ఏమైనా అయితే మేం తట్టుకోలేం.
కార్తీక్ వాళ్లు కూడా బయల్దేరుతారు. కార్తీక్ దాపు మీద చేయి వేసి మాట్లాడగానే దాసు చేయి కదులుతుంది. తర్వాత కార్తీక్ వాళ్లు వెళ్లిపోతారు. దశరథ్ తన ఫ్రెండ్ డాక్టర్‌కి కాల్ చేసి ఎవరికీ తెలీకుండా తన తమ్ముడు దాసుని కాశీకి అప్పగించినందుకు థ్యాంక్స్ చెప్తాడు. ఇక ఈ విషయం గురించి ఎవరు ఏం అడిగినా చెప్పొద్దని అంటాడు. ఇంతలో పారిజాతం, జ్యోత్స్న వస్తారు. దాసుని ఎవరో చంపబోయారని పారు అంటే దానికి జ్యోత్స్న తాగి ఎక్కడో పడిపోయింటాడని అంటుంది. దశరథ్ మాటలకు జ్యోత్స్న డాడీ నిజం తెలిసి మాట్లాడుతున్నావా లేక కావాలనే సింగ్ అవుతున్నాయా అని అనుకుంటుంది. ఇక పారిజాతం జ్యోత్స్న దగ్గర ఉన్నప్పుడు దాసు కళ్లు తెరిచాడని జ్యోత్స్న ఉలిక్కి పడిందని చెప్తుంది. దశరథ్ నిజాలు అన్నీ బయట పడతాయని అంటాడు. జ్యోత్స్న భయపడుతుంది. కార్తీక్ దీపలు నడుచుకుంటూ వెళ్తుంటారు దీప మనసులో జ్యోత్స్న ప్రవర్తన మీద అనుమానంగా ఉందని కానీ జ్యోత్స్నకి అంత అవసరం ఏంటి అనుకుంటుంది. ఎవరో దాసుని కొట్టారని అనుకుంటారు. ఇంతలో కార్తీక్‌కి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. స్పెషలిస్ట్ వచ్చారని వెంటనే రమ్మని డాక్టర్ కార్తీక్‌తో చెప్తే కార్తీక్ దీపని వెళ్లిపోమని చెప్పి ఆటో ఎక్కించేస్తాడు. దీప కార్తీక్‌ని అనుమానిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ని అనుమానిస్తూ ప్రశ్నించిన దీప.. దాసు దుస్థితికి ఏడుస్తున్న పారు.. జ్యో దొరికిపోతుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

