Karthika Deepam 2 Serial Today February 28th: కార్తీకదీపం 2 సీరియల్: ప్రాణదాతే దీపని తెలుసుకున్న కార్తీక్.. తల్లిని నమ్మించి దీప, శౌర్యలను చంపడానికి జ్యో ప్లాన్!
Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్‌ని చిన్నప్పుడు కాపాడిన తన ప్రాణదాతే దీప అని కార్తీక్ తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. దాసు కోలుకుంటే నిజం అందరికీ తెలిసిపోతే తాను జైలు పాలు అవ్వాల్సి వస్తుందని.. బావ దక్కక.. ఆస్తి లేక జైలుకి పోతే ఇక ఎందుకు బతకాలి అనుకుంటుంది. తాతయ్య పెళ్లి అంటున్నాడు. డాడీ దాసు లేచేవరకు ఆగమంటున్నాడు. ఇదంతా నా చావుకి వచ్చినట్లుందని దాసు లేచే టైంకి దీప చనిపోతే అన్ని సమస్యలకు ఇది ఒక్కటే పరిష్కారం అని ఈ సారి పక్కా ప్లాన్‌తో దీప అంతు చూడాలని అనుకుంటుంది.
వెంటనే ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుంది. రేపు తన కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండమని అంటుంది. దీప ఈ భూమ్మీద ఉండకూడదని అనుకుంటుంది. ఉదయం దీప తండ్రి ఫొటో దగ్గర దీపం పెడుతుంది. శౌర్యని కార్తీక్ స్కూల్‌కి రెడీ చేస్తాడు. దీప తండ్రి ఫొటో దగ్గర దీపం వెలిగిస్తుంది. దీపం ఆరిపోతుంది. దాంతో దీపం ఏదో కీడు జరగబోతుందని నాన్న నాతో చెప్తున్నారని అనుకొని కంగారు పడుతుంది. జ్యోత్స్న పడుకొని ఉంటే పారిజాతం కాఫీ తీసుకెళ్తుంది. జ్యోత్స్న తనని ఇబ్బంది పెట్టొద్దని తల నొప్పి అని పారుని కసిరేస్తుంది. పారిజాతం సుమిత్రకు విషయం చెప్తుంది. సుమిత్ర జ్యోత్స్న దగ్గరకు వెళ్లి ఏమైంది జ్యోత్స్న రాత్రంతా పడుకోలేదా అంటే లేదని జ్యోత్స్న చెప్తుంది.
జ్యోత్స్న: సారీ మమ్మీ నేను నిన్ను డాడీని తాతయ్యని అందరినీ బాధపెడుతున్నాను. పెళ్లి కొడుకుతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. తాతని బాధ పెట్టాను కదా. కనీసం సారీ చెప్పాల్సింది కదా. షేమ్‌గా ఉంది మమ్మీ. రియల్లీ సారీ మమ్మీ.
సుమిత్ర: పర్లేదు ముందు పడుకో తర్వాత మాట్లాడుకుందాం.
జ్యోత్స్న: గ్రానీ ఇబ్బంది పెడుతుంది చెప్పు మమ్మీ రావొద్దని.
సుమిత్ర: నా గదిలో పడుకో నిన్ను ఎవరూ డిస్ట్రబ్ చేయరు.
జ్యోత్స్న తనుకు నచ్చినట్లు మారుతుందని సుమిత్ర సంతోషపడుతుంది. జ్యోత్స్న నేను నిన్ను మభ్యపెట్టేలా మారానమ్మా అని తలగడలు పేర్చి శౌర్య, దీపని చంపడానికి వెళ్తున్నా అనుకొని ఎవరూ చూడకుండా ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. ఇక కార్తీక్ కాంచన గురించి అనసూయని అడిగితే స్వప్నతో మాట్లాడుతుందని చెప్తుంది. ఇక దీప గురించి అడిగితే శౌర్యని తీసుకురావడానికి వెళ్లిందని కార్తీక్ చెప్తాడు. కార్తీక గదిలోకి వెళ్లి ఫైల్స్ చూస్తుంటాడు. ఇంతలో కింద పడి ఉన్న దీప చిన్న నాటి ఫొటో కనిపిస్తుంది. అది చూసి ఈ అమ్మాయి అని మళ్లీ మళ్లీ చూసి చిన్నతనంలో తనని కాపాడిన విషయం గుర్తు చేసుకుంటాడు. ఈ ఫొటో తన ప్రాణ దాతదే అనుకొని మెడలో లాకెట్ కూడా ఉందని చూస్తాడు. ఈ ఇంట్లో ఈ ఫొటో ఎందుకు ఉందని అనుకుందని ఎవరు తెచ్చారా అనుకొని అనసూయ దగ్గరకు పరుగులు తీసి ఫొటో చూపించి ఎవరు తెలుసా అని అడుగుతాడు. దానికి అనసూయ నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నారు అంటే మీ ఆవిడ ఫొటో పట్టుకొని ఎవరు అంటే నవ్వనా అంటుంది. ఇది దీప ఫొటో అని చెప్తుంది.
కార్తీక్ షాక్ అయిపోతాడు. నా దీపే నా ప్రాణదాత అనుకొని కార్తీక్ సంతోషంతో కన్నీరు పెట్టుకుంటాడు. ఫొటో చూస్తూ ఎగ్జైట్ అవుతాడు. ఇన్నాళ్లు నేను ఎదురు చూస్తున్న మనిషి నాతోనే ఉందా అని సంతోషపడతాడు. ఈ విషయం దీపకి తెలుసా లాకెట్ చూపించి స్టోరీ మొత్తం చెప్పాను కదా ఎందుకు చెప్పలేదని దీప నన్ను మర్చిపోయిందా అని అనుకుంటాడు. దీప తనకి నిజం తెలిసే చెప్పలేదని తాత మీద గెలిచిన తర్వాత రెండు కుటుంబాలు కలిసిన తర్వాత దీప చెప్పాలని విషయం ఇదే అయింటుందని అనుకుంటాడు. దీప నువ్వు ఎవరితో నాకు తెలిసిపోయిందని వెంటనే నీతో మాట్లాడాలి అని ఫోన్ తీస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గౌతమ్‌ని కుర్చీకి కట్టి కొరడాతో చితక్కొట్టిన సీత.. మహాలక్ష్మీ అధికారం పాయే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

