Karthika Deepam 2 Serial Today December 2nd: కార్తీకదీపం 2 సీరియల్: దీపే అసలైన వారసురాలని తెలుసుకున్న జ్యోత్స్న.. నాన్న దగ్గర ఎమోషనల్ డ్రామా!
Karthika Deepam 2 Serial Today Episode దీపే అసలైన వారసురాలని దాసు జ్యోత్స్నతో చెప్పడం జ్యోత్స్న కన్నీరు పెట్టుకొని దాసుని నిజం చెప్పకుండా ఆపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దాసుని శివనారాయణ ఇంటి నుంచి పంపేస్తాడు. జ్యోత్స్న దాసు వెంట వెళ్లి మా అమ్మానాన్నలతో నీకు ఏంటి పని అని అడుగుతుంది. దీప తండ్రి గురించి అడిగితే చెప్పలేదు అనసూయతో ఏంటి మాట్లాడావ్ అని అడుగుతుంది. దానికి దాసు నిజం చెప్పాలని వచ్చానని అంటాడు.
జ్యోత్స్న: ఏంటి ఆ నిజం.
దాసు: వారసురాలు దొరికింది.
జ్యోత్స్న: వారసురాలు దొరికిందా.
దాసు: అవును.. ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరో తెలిసింది.
కార్తీక్: చిన్నప్పటి నుంచి తనతో ఉన్న లాకెట్ పట్టుకొని మొత్తం గుర్తుచేసుకుంటాడు. నీ గురించి మర్చిపోలేదని నన్ను రక్షించిన ప్రాణాన్ని మర్చిపోలేదు ఏ నాటికైనా నీ రుణం తీర్చుకుంటాను. ఎక్కడున్నావ్. ఇప్పటికైనా నాకు కలుస్తావా.
ఇంతలో దీప వస్తుంది. దీప రాగానే కార్తీక్ లాకెట్ దాచేస్తాడు. దీప చేతిలో ఏంటని ప్రశ్నిస్తే కార్తీక్ ఏం లేదని తన ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నానని చెప్తాడు. దాంతో దీప కాఫీ తీసుకొస్తానని చెప్పి వెళ్లిపోతుంది. దీప వెళ్లిపోగానే కార్తీక్ లాకెట్ చూసి ఈమెను కలిసి నీ ముందు నిలబెడతానని తాను నన్ను కాపాడిందని నీతో చెప్తానని అనుకుంటాడు. రాత్రి జ్యోత్స్న దాసుని కలుస్తుంది. వారసురాలు ఎవరో తనకు తెలియాలి అని దాసుని అడుగుతుంది. నీకు చెప్పనని దాసు అంటాడు.
దాసు: చెప్తే నువ్వు తట్టుకోలేవు. నేను అన్నయ్యా వదినతోనే చెప్తాను.
జ్యోత్స్న: నువ్వు శాడిస్టివి నువ్వు మాటలతో హింసిస్తావు. అసలైన వారసురాలు చనిపోయింది.
దాసు: లేదు అసలైన వారసురాలు బతికే ఉంది అది ఎవరో కాదు దీప. శివన్నారాయణ మనవరాలు, సుమిత్ర, దశరథ్‌ల కూతురే దీప. దీప కుభేర కన్న బిడ్డ కాదు. అని పారిజాతం చేసిన కుట్ర మొత్తం జ్యోత్స్నతో చెప్తాడు. అదంతా తానే చూశానని కుభేర్ ఆ బిడ్డని తీసుకెళ్లడం చూశాను. ఐశ్వర్యంలో పెరగాల్సిన దీప పేదింట్లో పెరిగింది పేదింట్లో పెరగాల్సిన నువ్వు ఆ ఐశ్వర్యం అనుభవిస్తున్నావు. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అప్పుడు నేను వాటిని అన్న వదినలకు చూపించి నిరూపిస్తా.
జ్యోత్స్న: దీప అసలైన వారసురాలా.
దాసు: నా స్థానంలో ఉన్నావని దీపని ఇన్నాళ్లు అన్నావు కదా నువ్వు దీప స్థానంలో ఉన్నావు. కాంచన నీ కూతుర్ని నా కొడుకుకి ఇవ్వు అని కోరింది. ఆ మాట ఎంత బలమైంది అంటే నీతో కాకుండా దశరథ్ అన్నయ్య అసలైన కూతురితోనే దేవుడి కార్తీక్ మెడలో తాళి కట్టించాడు. నిజం తెలియక అందరూ బాధపడుతున్నారు కానీ ఈ నిజం తెలిస్తే అందరూ సంతోషంగా ఉంటారు.
జ్యోత్స్న: అప్పుడు నేనేమవుతాను.
దాసు: ఈ దాసు కూతురిగా నాతోనే ఉంటావు.
జ్యోత్స్న: నేను అలా బతకలేను.
దాసు: నిజం తెలిసిన తర్వాత మీ తాత నీ మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు ఎందుకంటే నువ్వు ఈ దాసు కూతురివి కాబట్టి.
జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది. తన పరిస్థితి ఏంటి అని బాధ పడుతుంది. నిజం చెప్తే నాకే అన్యాయం జరుగుతుందని దాసుకి చెప్తుంది. దాంతో దీప దాసు కాళ్ల మీద పడి నాకు అన్యాయం చేయకు నాన్న అని ఏడుస్తుంది. ఇన్నేళ్లు వారసురాలిగా బతికి ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అంటుంది. బావని పోగొట్టుకొని ఇప్పటికే పుట్టెడు బాధలో ఉన్నానని ఇప్పుడు తల్లిదండ్రులకు దూరం చేయకు అని ఏడుస్తుంది. దాసు ఎలా అయినా నిజం చెప్తా అంటే నన్ను చంపేయ్ అని తర్వాత నిజం చెప్పు అని జ్యోత్స్న ఏడుస్తుంది. జ్యోత్స్న కనీళ్లకు దాసు కరిగిపోతాడు. దీప వారసురాలు అని చెప్తే నన్ను చంపేయ్ అని దాసు చేతులతో చంపాలని ప్రయత్నిస్తుంది.
ఈ నిజం ఎవరికైనా చెప్తే చచ్చిపోతానని అంటుంది. ఈ నిజం ఎవరికీ చెప్పొద్దని మాట ఇవ్వమంటుంది. దాసు ఇవ్వను అని అంటే నేను యాక్సిడెంట్ చేసుకొని చస్తానని అంటుంది. దాంతో దాసు జ్యోత్స్నని ఆపి నా నోటితో ఈ నిజం ఎప్పటికీ ఎవరికీ చెప్పనని అంటాడు. అలా అని ఈ ఇంటి వారసురాలికి కూడా అన్యాయం చేయను అని అంటాడు. జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది. తిరిగి చూస్తే దాసు వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: చెల్లిని అడ్డు పెట్టుకొని జీవన్‌ని కట్టడి చేసిన రాజు, రూపలు.. చివరి నిమిషంలో శ్వేత ఎంట్రీ!