అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today December 27th: కార్తీకదీపం 2 సీరియల్: ఎంత పని చేశావ్ జ్యో.. కూలీగా దీప కంటపడ్డ కార్తీక్.. ఇది మామూలు షాక్ కాదుగా!

Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్‌కి ఎక్కడా జాబ్ రాకుండా జ్యోత్స్న చేయడం శ్రీధర్ కార్తీక్‌కి జాబ్ ఇస్తానని ఆఫర్ ఇవ్వడం కార్తీక్ వద్దని వచ్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ జాబ్ కోసం బయల్దేరుతాడు. కార్తీక్ బస్‌స్టాండ్‌లో వెయిట్ చేయడం ఎండకు ఇబ్బంది పడటం చూసిన జ్యోత్స్న లిఫ్ట్ ఇస్తాను అనుకొని దగ్గరకు వెళ్లబోతే కార్తీక్ ఆటో ఎక్కి వెళ్లిపోతాడు. జ్యోత్స్న కార్తీక్‌ని ఫాలో అవుతుంది. కార్తీక్‌ ఓ కంపెనీకి జాబ్‌కి వెళ్తాడు. ఆయన కార్తీక్ జ్యోత్స్న సీఈఓగా వచ్చాడని మర్యాద చేస్తాడు. కానీ కార్తీక్ జాబుకి వస్తాను అంటే వాళ్లు జాబు ఇవ్వడం కుదరదు అని అంటాడు. తర్వాత కార్తీక్ వాళ్ల ఎండీకి చెప్పమని అనడంతో వాళ్లు కార్తీక్‌కి సీఈఓ పోస్ట్ ఇవ్వమని అంటారు.

మరోవైపు జ్యోత్స్న తాత ఇన్ఫులిన్స్ వాడి కార్తీక్‌కి జాబ్ రాకూడదని అనుకుంటుంది. ఫోన్ చేసి చెప్పడంతో వాళ్లు కార్తీక్‌కి జాబ్ ఇవ్వమని వెళ్లిపోమని అంటారు. పాపం కార్తీక్ దిగాలుగా బయటకు వస్తాడు. ముందు ఒకే చెప్పి తర్వాత వద్దు అన్నారు ఏదో జరిగింది అనుకొని బయటకు వస్తాడు. కార్తీక్ నిస్సహాతతో ఎండకు ఫైల్ అడ్డుపెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ప్రతీ దగ్గర కార్తీక్‌కి ముందు జాబ్ ఇస్తామని చెప్పి జ్యోత్స్న కాల్‌తో జాబ్ ఇవ్వమని అనేస్తారు. మరోవైపు కాంచన శౌర్యకి తినిపిస్తుంది. దీప నీరు తీసుకొస్తుంది. మనం ఇన్ని ఇళ్లు తిరుగుతున్నాం ఏంటి అమ్మ అని శౌర్య దీపతో అడుగుతుంది. ఇక కార్తక్ దిగాలుగా ఇంటికి వస్తాడు.

శౌర్య కార్తీక్‌తో నువ్వు స్వీట్స్‌తో వస్తావని అమ్మ చెప్పింది తీసుకురాలేదు అని అడుగుతుంది. కార్తీక్ తర్వాత తెస్తాను అని చెప్పి జాబ్ దొరకలేదు అని చెప్తాడు. ఇక దీప కార్తీక్ వెనకాలే వెళ్తుంది. మీకు జాబ్ రాకపోవడం ఏంటి అని అడగుతుంది. జాబ్ ముందు వచ్చింది అని చెప్పారు తర్వాత లేదు అని పంపేశారు అని చెప్తాడు. ప్రతీ దగ్గర ఇదే జరిగిందని వీడికి ఉద్యోగం ఇవ్వొద్దని ఎవరో చెప్పినట్లే అయిందని అంటాడు. జాబ్ వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నాను అని కానీ ఇలా అయిందని ఫీలవుతాడు. దీప మనసులో కార్తీక్ బాబుకి జాబ్ రాకపోవడానికి జ్యోత్స్నకి ఏమైనా సంబంధం ఉందా అనుకుంటుంది. 

కార్తీక్ పూర్తిగా పేదవాడిలా మారిపోయి లుంగీ బనియన్ వేసుకొని ఉంటాడు. తన ఫోన్ లేకపోవడంతో తల్లి ఫోన్లో సిమ్ వేస్తాడు. దీప కార్తీక్‌కి టీ ఇస్తుంది. ఇంతలో కార్తీక్‌కి కొత్త నెంబరు నుంచి ఫోన్ వస్తుంది. జాబ్ ఉంది రండి అని అడ్రస్ పెడతాడు. కార్తీక్ ఇంట్లో వాళ్లతో నాకు ఏదో అనుమానంగా ఉందని అంటాడు. ఉద్యోగం వచ్చినా రాకపోయినా రమ్మన్నారు కాబట్టి వెళ్లమని దీప, కాంచన చెప్తారు. దాంతో కార్తీక్ బయల్దేరి అడ్రస్‌కి వెళ్తాడు. లోపలికి వెళ్లి జాబు ఇస్తానన్నందుకు థ్యాంక్స్ అంటాడు. తీరా చూస్తే అది కార్తీక్ తండ్రి శ్రీధర్. కార్తీక్ షాక్ అయి లేచి నిల్చొంటాడు. 

కార్తీక్: అబద్ధం చెప్పి రప్పించుకోవాల్సిన అవసరం నీకు ఏంటి.
శ్రీధర్: మరి ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం నీకు ఏంటి.
కార్తీక్: అంటే ఫాలో అవుతున్నావా.
శ్రీధర్: తండ్రిని కదా.
కార్తీక్: అయితే చెడగొట్టింది నువ్వేనా.
శ్రీధర్: ఓరేయ్ అది నాకు తెలీదు అందులో నాకు భాగం లేదు. అవన్నీ నాకు తెలీదు కానీ జాబు ఇవ్వాలని పిలుస్తున్నా. నువ్వు రోడ్డు మీద తిరగడం నాకు ఇష్టం లేదు. 
కార్తీక్: మీ దగ్గర నాకు అవసరం లేదు.
శ్రీధర్: మరి ఫ్యామిలీని ఎలా పోషిస్తావ్. ఉన్నదేమో అద్దె కొంప. పోనీ ఒక్కడివా అంటే నిన్ను నమ్ముకొని నీ వెనకాలే నలుగురు ఉన్నారు. ఉద్యోగం లేకపోతే ఎలా. గుడి దగ్గరకు తీసుకెళ్తావా. 
కార్తీక్: నువ్వు పైకి బాధ నటించినా లోపల నాకు బాగా అయింది అనుకుంటున్నావ్. నిన్ను మేం పంపేశాం అనే ఫ్రస్టేషన్‌లో ఉన్నావ్ రివేంజ్ తీర్చుకోవడానికీ నీకు ఒక అవకాశం దొరికింది. మీరు నన్ను గెంటేసినా నేను మీకు సాయం చేశాను అనుకోవడానికి.
శ్రీధర్: నువ్వు మీ అమ్మ నన్ను ఇంకా జీవితంలో అర్థం చేసుకోలేరురా.
కార్తీక్: ఇంకెప్పుడూ నా అవకాశంతో ఆడుకోవద్దు.
శ్రీధర్: అరేయ్ నీకు బిజినెస్‌కి కూడా నేను డబ్బు ఇస్తానురా మంచి అవకాశం పొగొట్టుకోకు. 

ఎంత చెప్పినా కార్తీక్ వినకపోవడంతో కావాలి అంటే 24 గంటల్లో జాబ్ తెచ్చుకో అంటాడు. గంటలో జాబ్ తెచ్చుకుంటా అని కార్తీక్ తండ్రితో సవాలు చేస్తాడు. ఇక దీప ఓ పెద్దింటికి వంట మనిషిగా పని చేస్తానని అడగటానికి వెళ్తుంది. దాంతో ఆవిడ ఒక రోజు వండితే తర్వాత టేస్ట్‌లు బట్టి జీతం మాట్లాడుతానని అంటుంది. దీప కిచెన్‌లోకి వెళ్తుంది. సరుకులు లేవు అని చెప్తుంది. దాంతో ఆవిడ ఫోన్ చేసి సరకులు తెప్పిస్తుంది. సరుకులు వచ్చాయని చెప్పడంతో దీప డోర్ తీస్తుంది. కార్తీక్ సరుకులు తీసుకురావడం చూసి దీప బిత్తరపోతుంది. దీపని చూసి కార్తీక్ షాక్ అవుతాడు. కార్తీక్ సరుకులు తీసుకొని లోపలికి వస్తాడు. ఓనర్ దీప చేతిలో లిస్ట్ పెట్టి సరుకులు సరిపోయావో లేదో చెక్ చేయమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మరీ దారుణంగా జాను, తాతగారికి ఘోర అవమానం - ఏడుస్తూ వెళ్లిపోయిన మిత్ర, లక్ష్మీ!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget