అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today April 18th: కార్తీకదీపం 2 సీరియల్: మా కన్నీటికి విలువ లేదా బావ.. జ్యోత్స్న ఎమోషనల్‌.. గుండెల్ని పిండేసే సీన్!

Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్‌తో జ్యోత్స్న ఎమోషనల్‌గా మాట్లాడి దీప చేసిన తప్పునకు జైలులోనే ఉంటుందని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న దీపని జైలుకి వెళ్లి కలుస్తుంది. నీకు నీ కూతురి మీద ఏంత ప్రేమ ఉందో నా డాడీకి నేను అంటే అంతే ప్రేమ. నాకు నా తండ్రి అంటే నాకు అంతే ప్రేమ. మీరు మాత్రమే మనుషులు మీవి మాత్రమే అనుబంధాలు అన్నట్లు మాట్లాడుకోకండి అని కార్తీక్, దీపలు శౌర్య గురించి మాట్లాడుతుంటే చెప్తుంది. మా డాడీకి ఏమైనా జరిగితే నిన్ను మాత్రం వదిలిపెట్టను అని జ్యో అంటుంది. దాంతో దీప జ్యోత్స్న గొంతు పట్టుకుంటుంది. 

ఎస్‌ఐ వచ్చి విడిపించి దీప నీకు బుర్ర పని చేస్తుందా ఇప్పటికే ఒకరు చావు బతుకుల మధ్య ఉన్నారు ఇప్పుడు ఇంకొకరిని చంపాలి అనుకుంటున్నావా అని దీప మీద అరుస్తారు. ఇలా స్టేషన్‌లో గొడవ పడితే మీ మీద మరొకేసు పెట్టాల్సి ఉంటుందని అంటారు. కార్తీక్, జ్యోత్స్న ఇద్దరూ సారీ చెప్తారు. ఇక జ్యోత్స్నని సంతకం పెట్టమని అంటారు. కోర్టులోనే తేల్చుకుందాం దీప అని చెప్తుంది. బయట వాళ్లు ఎవరూ వాళ్లని కలవకుండా చూడండి సాక్ష్యాల్ని కొనేస్తారు అని జ్యోత్స్న అంటుంది. 

కార్తీక్ దీపతో నీకు ఎందుకు అంత కోపం ఎందుకు జ్యోత్స్నతో అలా ప్రవర్తించావ్.. ఇప్పుడు జ్యోత్స్నకి ఇది మరొ సాక్ష్యం దొరికింది. లోతుగా ఇరుక్కుంటున్నావ్ దీప అసలు నిన్ను ఎలా కాపాడాలో కూడా తెలీదు అని కార్తీక్  అంటాడు. నేను కాల్చలేదు అని దీప అంటే గన్ నీ చేతిలో ఉంది బులెట్ మామయ్యకి తగిలింది కాల్చలేదు అని ఎలా అంటావ్ అని కార్తీక్ అంటాడు. లాయర్ తన తెలివితేటలు ఉపయోగించి నిన్ను బయటకు తీసుకొస్తాడు. మామయ్యకి ఏమైనా అయితే ఇక అంతే అని కార్తీక్ అంటాడు. ఆయనకు ఏం కాదు అని దీప అంటుంది. నువ్వు ఈ కేసు నుంచి బయట పడాలి దీప అని కార్తీక్ అంటాడు. నువ్వు చేసిన పనికి తాత, జ్యోత్స్న, అత్త ఎవరు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు అని కార్తీక్ అంటాడు.
కార్తీక్ వెళ్తుంటే జ్యోత్స్న ఆపి నీతో మాట్లాడాలి బావ అని అంటుంది. నన్ను దీప కాల్చాలి అనుకుంది అంటే మరి నువ్వు కూడా చంపాలి అనుకున్నావ్ కదా అంటాడు. 

జ్యోత్స్న: దీప కావాలనే షూట్ చేసిందని నీకు తెలుసు బావ కానీ భార్య మీద ప్రేమతో కొంచెం కూడా జాలి లేకుండా ఎలా మాట్లాడుతున్నావ్ బావ. మా డాడీ నీకు మామయ్య కదా చిన్నప్పుడు మా ఇంట్లోనే ఉన్నావ్ కదా.. నీకు మా డాడీ ఎంత ప్రేమగా చూసుకున్నారో మర్చిపోయావా. అంత ప్రేమగా చూసుకున్న మనిషి చావు బతుకుల మధ్య ఉంటే కనీసం జాలి లేకుండా మాట్లాడుతున్నావ్.. దీనంటికి ఎవరు కారణం. దీప నన్ను కాల్చిందా మా డాడీని కాల్చిందా లేక పొరపాటున కాల్చిందా అనేవి పక్కన పడితే తన చేతితో గన్ పేలింది మా డాడీకి ఏమైనా అయితే మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని ఆలోచించావా. మా అమ్మ బతుకుతుందా. మా తాత బతుకుతారా. వాళ్లు డాడీకి ఏమవుతుందో అని అక్కడి నుంచి కదలడం లేదు తినడం లేదు. మరి నువ్వేమో ఎవరు ఎలా పోతే ఏంటి నా భార్యకు ఏం కాకూడదు అని ఆలోచిస్తున్నావ్. మనుషులు ఇంతే బావ ప్రేమలు స్వార్థం ఉంటుంది. చెప్పుకోవడానికి కారణాలు ఉంటాయి. మా దురదృష్టం ఏంటి అంటే  మా కారణాలకే కాదు మా కన్నీళ్లుకు కూడా మీ దగ్గర విలువ ఉండదు. నీకు పట్టుదల ఎక్కువ తల్లి కన్నవారికి దూరం అయిపోతుంది అన్నా నువ్వు పట్టుదల వదులుకోలేదు. మరి నేను ప్రేమ ఎలా వదులుకుంటాను బావ. అన్నీ నీ కోసమే చేశాను. 
కార్తీక్: ప్రేమ అంటే ప్రాణాలు పోసేది ప్రాణాలు తీసేది కాదు.
జ్యోత్స్న: మరి ఎవరి ప్రేమ కోసం దీప ప్రాణాలు తీయాలి అనుకుంది బావ.
కార్తీక్: మనం ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకుందాం.
జ్యోత్స్న: చెప్పాను కదా మా బాధకే కాదు మా కన్నీళ్లకు మీ దగ్గర విలువ లేదని. దీప మాత్రం ఈ కేసు నుంచి తప్పించుకోలేదు బావ. చేసిన తప్పునకు జైలు శిక్ష అనుభవించాల్సిందే.

కార్తీక్ ఇంటికి వెళ్తాడు. అమ్మని తీసుకొచ్చావా నాన్న అని అడుగుతుంది శౌర్య. అమ్మ కోసం శౌర్య చాలా బాధ పడుతుంది. అమ్మ దగ్గరకు వెళ్దామని అంటారు. ఇక కార్తీక్ శౌర్యకి కథ చెప్పి తినిపిస్తాడు. అనసూయ క్యారేజ్ తీసుకొస్తే ఎవరికి అని శౌర్య అడుగుతుంది. తెలిసిన వాళ్లకి అని కార్తీక్ చెప్పి శౌర్యని పంపేస్తాడు. ఇక లాయర్ గురించి కార్తీక్ కాంచన, అనసూయలకు చెప్తాడు. మామయ్య స్ఫ్రుహలోకి వచ్చారని చెప్తాడు. దీపకి భోజనం తీసుకొని కార్తీక్ వెళ్తాడు. సుమిత్ర ఏడుస్తుంది. సుమిత్ర మామయ్యతో మీ బాధ చూసి మేం ఎక్కడ బాధ పడతానో అని మీరు పక్కకి వెళ్లి ఏడుస్తున్నారని తెలుసు మామయ్య అని ఏడుస్తుంది. ఏ వ్రతం చేసినా మీరు నన్ను దీర్ఘసుమంగళి భవ అని దీవిస్తారు మీ దీవెనలు నిజం అవ్వాలి మామయ్య అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: రత్నమాలకు పక్షవాతం.. గిరి మారిపోయాడా.. త్రిపుర పెళ్లికి ఒప్పుకుంటుందా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget