Karthika Deepam 2 Serial Today April 14th: కార్తీకదీపం 2 సీరియల్: దశరథ్‌కి ఏమైనైతే దీపని చంపేస్తా.. కార్తీక్‌కి కన్నీటి సాక్షిగా అత్త, తాతల వార్నింగ్!
Karthika Deepam 2 Today Episode కార్తీక్ హాస్పిటల్‌కి వెళ్లడం సుమిత్ర, తాత తమ బాధ చెప్పి కార్తీక్‌ని పంపేయడం కార్తీక్ ఇంటికెళ్లి కాంచన వాళ్లతో విషయం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దశరథ్ కండీషన్ సీరియస్‌గా ఉందని నర్స్ చెప్తుంది. సుమిత్ర కుప్పకూలిపోయి ఏడుస్తుంది. శివన్నారాయణ కూడా ఏడుస్తారు. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తే పెద్దాయన వెళ్లిపోమని అంటారు. కార్తీక్ వినకపోవడంతో కొట్టడానికి చేయి ఎత్తుతారు. సుమిత్ర ఆపుతుంది.
సుమిత్ర: ఎందుకు వచ్చావ్‌రా నీ భర్తకు ఏమైనా అయితే నీ భార్యకు అన్యాయం జరుగుతుంది అని బాధ పడుతున్నావ్. నా భర్తకి ఇలా అవ్వడానికి కారణం దీప కాదురా నువ్వు. నాభర్త చావుబతుకల మధ్య ఉండటానికి కారణం నువ్వు.
జ్యోత్స్న: డాడీని షూట్ చేసింది దీప అయితే బావని అంటావేంటి అమ్మ.
సుమిత్ర: బావ ఏం చేశాడు కదా అంతా చేసింది మీ బావే. ఈరోజు మన కుటుంబం బాధ పడటానికి కారణం ఎవరో కాదు మీ బావే. లోపల ఒక మనిషి ప్రాణాలతో పోరాడుతున్నాడు ఆ మనిషికి ఏం అవుతుందో ఏ క్షణం ఏం వార్త వినాల్సి వస్తుందో అని నా గుండె ఆగిపోయేలా ఉందిరా. మౌనంగా ఏడ్వడానికి తప్ప ఏం కాదు అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదురా దీని అంతటికి నువ్వు కారణంరా.
కార్తీక్: నేనేం చేశాను అత్త.
సుమిత్ర: దీప మెడలో తాళి కట్టావురా. సాయం చేసిన మనిషిలా మిగిలిపోవాల్సిన దీపని తాళి కట్టి బంధువుని చేశావ్. నువ్వు తాళి కట్టకపోయి ఉంటే మీ నాన్న వల్ల మొదలైన గొడవలు ఆయన ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆగిపోయేవి కానీ నువ్వు దీప మెడలో తాళి కట్టి రెండు కుటుంబాలను ఎప్పటికీ కలవని శత్రువుల్ని చేశావ్. దీప మెడలో పడిన మూడు ముళ్లు నా కూతురి మెడలో పడుంటే ఈ పాటికి మన కుటుంబాలు వేరేలా ఉండేవి. మిమల్ని ఎంత మాలో కలుపుకోవాలి అని చూసినా ఆడ పడుచు కోసం ఎన్ని మెట్లు దిగొచ్చినా మీరు మారలేదు. దీప అస్సలు మారలేదు. ఆ మనిషి తప్పులు మీద తప్పులు చేస్తూనే ఉంది మీరు సమర్దిస్తూనే ఉంది.
కార్తీక్: దీప మీ ఇంటికి రావడం తెలీదు అత్త.
శివన్నారాయణ: తెలీదు రా నీకు ఏం తెలీదు. నీ పెళ్లాం నా మనవరాలి నిశ్చితార్థం చెడగొట్టింది లాగి పెట్టి కొట్టకుండా గమ్మునున్నావ్ ఎందుకంటే నీకేం తెలీదురా. దీపకి బుద్ధి లేదు అనుకుంటే నీ అమ్మని మా ఇంటికి పంపింది. నీకు ఏం తెలీదురా. చివరకు దీప స్వయంగా నీ మేనమామకే కాల్చిందిరా. ఆ బులెట్ దశరథ్కి తగలకపోయింటే జ్యోత్స్నకి తగిలేది. అంటే దీప ఉద్దేశం నా మనవరాలిని చంపాలి అనే కదా. ఇది కూడా నీకు తెలీదు. నీకు తెలీకుండా నీకు చెప్పకుండా ఇదంతా చేస్తే నువ్వు చేతకాని వాడిలా చూస్తూ కూర్చొన్నావ్.
కార్తీక్: అవును తాత నేను చేతకానివాడినే అందుకే ఎవరు తిట్టినా భరించాను కొట్టినా భరించాను మిమల్ని దూరం చేసుకోవలేకపోయాను. నీ గొప్ప తనం బంధాలు వదిలేసుకోవడంలో ఉన్నా నేను మీ కోసం చేతకాని వాడిలా ఉన్నాను. ఇప్పుడు నేను చేతకాని వాడినే అందుకే మామయ్య కోసం వచ్చాను.
పారిజాతం: నువ్వు వచ్చింది నీ మేన మామ కోసం కాదురా. మీ మామయ్యకి ఏమైనా అయితే నీ పెళ్లాం ఏమైపోతుందా అని.
శివన్నారాయణ: ఇప్పుడు మాత్రం దీపని వదులుతాను అనుకున్నావా వీడి పెళ్లాం మళ్లీ జీవితంలో బయటకు రాదు. ఈయన గారి పెళ్లాం తప్పులు మీద తప్పులు చేస్తున్నా ఈ దరిద్రం మనకు ఎందుకులే అని వదిలేశాను కానీ దీప మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని ముందే తెలుసుంటే దానికి చేయాల్సిన శాస్తి ఎప్పుడో చేసేవాడిని. ఓరేయ్ కార్తీక్ దశరథ్ నా ఒక్కగానొక్క కొడుకే కాదురా. నా యావత్ ఆస్తికి నా పరువుకి నా పంచప్రాణాలకు వారసుడు. వాడికి ఏమీ కాకపోతే నీభార్య కనీసం జైలులో అయినా ఉంటుంది. కానీ ఏమైనా అయితే ప్రాణానికి ప్రాణం లెక్క కట్టాల్సిందే. చెప్పు ఈ మాట వెళ్లి నీ భార్యకి చెప్పు.
సుమిత్ర ఏడుస్తూ లోపల ఆపరేషన్ జరుగుతుంది ఇప్పటి వరకు ఒక్క డాక్టర్ బయటకు వచ్చి ఏం చెప్పలేదు కండీషన్ సీరియస్ అని చెప్తారు. అసలు నీ భార్య వచ్చింది నా ప్రాణాలు కాపాడటానికి కాదురా నా పసుపుకుంకుమలు తీసుకెళ్లడానికి వచ్చింది. కార్తీక్‌ని సుమిత్ర వెళ్లిపోమని అంటుంది. అందరూ కార్తీక్‌ని వెళ్లిపోమని చెప్తారు. డాక్టర్లు వచ్చి మా డాడీకి ఏం కాలేదు అని చెప్తే తప్ప మేం మామూలు మనుషులు కాలేం వెళ్లిపో బావ అని అంటుంది. ఇక పెద్దాయన కార్తీక్‌తో నువ్వే కాదు మీ అమ్మ నీ చెల్లి ఎవరూ ఇక్కడికి రాకూడదు అని చెప్పి కార్తీక్‌ని వెళ్లిపోమని చెప్తారు.
కార్తీక్ తాతయ్య, అత్త మాటలు తలచుకొని బాధ పడుతూ వెళ్లిపోతాడు. దిగులుగా ఇంటికి వస్తాడు. శౌర్య ఎదురెళ్లి నానమ్మ కింద పడిపోయిందని చెప్తుంది. ఏమైందని కార్తీక్ అడిగితే లో బీపీతో పడిపోయానని కాంచన చెప్తుంది. దీప గురించి అడుగుతుంది. శౌర్యని కార్తీక్ లోపలికి వెళ్లమంటాడు. ఎక్కడుందని అనసూయ అడిగితే స్టేషన్‌లో ఉందని కార్తీక్ చెప్తాడు. అందేంటి అని అడిగితే పని మీద బస్ స్టేషన్‌కి వెళ్లిందని అంటాడు. శౌర్య మీద అరిచేసి కార్తీక్ లోపలికి పంపేస్తాడు. తర్వాత ఏమైందని కాంచన అడిగితే కార్తీక్ కూలబడిపోయి దీప దశరథ్‌ని కాల్చేయడం నుంచి జరిగింది అంతా తలచుకుంటాడు. అమ్మ ఇది విని నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు కానీ చెప్తున్నా అని దీప దశరథ్‌ని కాల్చేసిందని చెప్తాడు. కాంచన, అనసూయ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!





















