Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 4th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: సహస్ర జీవితం నాశనం! విహారి కారణమా? పిల్లలు పుట్టరా? పద్మాక్షి ఆవేదన
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 4th సహస్ర గర్భసంచి పోయిందని తీసేయాల్సి వచ్చిందని డాక్టర్ పద్మాక్షితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ విహారితో తన గురించి ఆలోచించొద్దని సహస్రమ్మ మీదే ప్రేమ పెంచుకోండి అని చెప్తుంది. నిజమైన ప్రేమ ఒక్కసారి పుడుతుంది. చనిపోయే వరకు పోదు అని అది నీమీదే నాకు ఉందని అంటాడు. సహస్రతో బంధం మొదలవదు అని విహారి అనుకుంటాడు. లక్ష్మీతో ఆ దేవుడు మనల్ని కలుపుతాడు లక్ష్మీ అని విహారి నమ్మకంగా చెప్తాడు.
పద్మాక్షి హాస్పిటల్‌లో ఏడుస్తుంది. డాక్టర్ వచ్చి సహస్ర ప్రమాదం నుంచి బయట పడింది కానీ ఓ బ్యాడ్ న్యూస్ అని చెప్తుంది. ఏంటి అని పద్మాక్షి అడగటంతో యాక్సిడెంట్‌లో సహస్రకు ఇంటర్నల్ ప్రాబ్లమ్ వచ్చిందని అందుకు తన గర్భసంచి తీసేయాల్సి వచ్చిందని ఇక సహస్రకు పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పడంతో పద్మాక్షి కుప్పకూలిపోతుంది. తన ప్రాణాలు కాపాడాలి అంటే గర్భసంచి తీసేయాల్సి వచ్చిందని డాక్టర్ చెప్తుంది. పద్మాక్షి తల బాదుకొని ఏడుస్తుంది. ఈ విషయం సహస్రకు చెపొద్దని ఏడుస్తుంది. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదని అంటుంది.
పద్మాక్షి తల బాదుకొని చాలా చాలా ఏడుస్తుంది. ఇంతలో ఇంటి వాళ్లు అందరూ వస్తారు. పద్మాక్షి వాళ్లని ఆపేస్తుంది. ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతుంది. సహస్రకు ఇలాంటి పరిస్థితి రావడానికి ఈ విహారినే కారణం అని ఏడుస్తుంది. ఏమైందని అందరూ అడిగితే నా కూతురు ఈ రోజు హాస్పిటల్‌లో ఉందంటే నువ్వే కారణం అంటుంది. నేనేం చేశాను అని విహారి అంటే నువ్వేం చేయడం లేదు అదే దీనికి కారణం అసలు దానితో మాట్లాడుతున్నావా.. బయటకు తీసుకెళ్తున్నావా.. అసలు పెళ్లంలా చూశావా.. అసలు దానికి పని ఉంటే ఎవరు బయటకు తీసుకెళ్లాలి..విహారినే కాదా కానీ దానిని వదిలేశాడు.. అందుకే దానికి ఈ పరిస్థితి అని పద్మాక్షి కుమిలిపోతుంది.
పద్మాక్షి ఏడుస్తూ విహారి నీ అంతట నువ్వు వచ్చి సహస్రని పెళ్లి చేసుకున్నావ్ కదా.. ఆశ పడి పెళ్లి చేసుకున్న నువ్వు ఇలా చేస్తే ఎలా అని అడుగుతుంది. ఇక నుంచి సహస్రని జాగ్రత్తగా చూసుకుంటాడని యమున అంటే.. అది విహారి చెప్పాలి ఇక నుంచి బాధ్యతగా ఉంటాను అంటే అందరూ లోపలికి వెళ్లండి లేదంటే వద్దు అనేస్తుంది. అందరూ విహారికి చెప్పమని అంటారు.లక్ష్మీ కూడా సైగ చేస్తుంది. దాంతో విహారి సారీ అత్తయ్య ఇక నుంచి సహస్రని జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్తాడు.
పద్మాక్షి తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. అందరూ లోపలికి వెళ్లి సహస్రని చూస్తారు. సహస్రని ఇంటికి తీసుకొస్తారు. పద్మాక్షి సహస్రని చూసి దాని జీవితానికి పెద్ద దెబ్బ తగిలిపోయిందని చాలా బాధ పడుతుంది. సహస్రని పోచమ్మ దగ్గరకు తీసుకెళ్దామని భక్తవత్సలం అంటే పద్మాక్షి చాలా టెన్షన్ పడుతుంది. పోచమ్మ సహస్రకు పిల్లలు పుట్టరు అని చెప్తే ప్రాబ్లమ్ అవుతుందని పద్మాక్షి ఇప్పుడు వద్దని అంటుంది. సహస్ర వారసుడిని ఇవ్వాలని కాదాంబరి వాళ్లు కోరుకుంటే యమున మనసులో లక్ష్మీ వారసుడిని ఇస్తుందని పోచమ్మ చెప్పిందని గుర్తు చేసుకుంటుంది.
భక్తవత్సలం గారికి పార్థసారధి అని వీకే ఇండ్రస్టీస్ ఎండీ మాట్లాడుతాడు. రామాపురంలో మీ 200 ఎకరాలు కొనాలని అనుకుంటున్నామని ఎంత డబ్బు అయినా ఇస్తామని ఆయన అంటే నేను అమ్మను అని భక్తవత్సలం చెప్పేస్తారు. ఎలా అయినా కొనిపిస్తా అని పార్థసారధి అనుకుంటాడు. ఇక పద్మాక్షికి తన మనిషి కాల్ చేసి లక్ష్మీ అసలైన భర్త గురించి డిటైల్స్ దొరికాయని ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లి ఫొటోలు పంపిస్తానని చెప్తాడు. పద్మాక్షికి డిటైల్స్ పంపిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















