Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 1st: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: తల్లిని గుడిలో చూసేసిన విహారి.. మొదలైన తులాభారం, సహస్ర ప్రేమ గెలుస్తుందా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode సహస్రతో కలిసి విహారి పూజ చేస్తున్న గుడిలో విహారి తల్లి యమునను చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode హోమంలో అగ్ని కీలలు రావడం చూసి పంతులు ఏం కాదు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఇలా అగ్ని చూపిస్తుందని అంటారు. దాంతో విహారి కనకంతో తన పెళ్లి గుర్తు చేసుకొని క్షమాపణ చెప్తాడు. ఇక పంతులు సహస్ర, విహారిలను కూర్చొమని అంటాడు. కూర్చున్న తర్వాత విహారి ఓ చిన్న అద్దంలో చూసి అమ్మ అని చాలా సంతోషిస్తాడు. విహారి లేవబోతే పంతులు వద్దని అంటాడు. దాంతో విహారి పండుని పంపి తన తల్లిని తీసుకురమ్మని చెప్తాడు. పద్మాక్షి, యమున ఒకర్ని ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు.
యమున: వీళ్లంతా ఇక్కడున్నారేంటి. పూజ జరిగేది వేరే గుడిలో కదా. బెరుకు బెరుకుగా యమున అక్కడికి వస్తుంది.
అంబిక: చూశావా అక్క నువ్వు ఎంత చెప్పినా వినకుండా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది ఇందతా కొడుకు మీద ప్రేమ అనుకోవాలా లేక నీ మాట అంటే లెక్కలేదు అనుకోవాలా.
పద్మాక్షి: రావొద్దని చెప్పినా నా మాట వినలేదు అనుభవిస్తుంది. నా మాటకు ఎదురు చెప్పినా నేను అనుకున్నట్లు కార్యక్రమం జరగకపోయినా అనుభవిస్తుంది.
విహారి: అమ్మా ఏమైపోయావ్ ఎన్ని సార్లు ఫోన్ చేశానో తెలుసా.
యమున: గుడికి వస్తూ ఫోన్ ఎందుకని తీసుకురాలేదు.
అంబిక: ఈవిడ గారి తోక ఆ లక్ష్మీ రాలేదేంటి. అంటే నేను ఇచ్చిన వార్నింగ్‌కి చెక్కేసుంటుంది.
పంతులు లక్ష్మీతో నీ అత్తిళ్లు నీ వల్ల చాలా సంతోషంగా ఉంటారు. అందరికీ నీ వల్ల మంచి జరుగుతుంది కానీ నీకు పండిన చెట్టుకి రాళ్ల దెబ్బల్లా నీ జీవితం ఉంటుంది కానీ ఏదో ఒక రోజు నిన్న గుర్తిస్తారు అని చెప్తారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే అని లక్ష్మీ మనసులో అనుకుంటుంది. ఇక యమున దగ్గరకు వెళ్తూ విహారి వాళ్లని చూసి ఆగిపోతుంది. మరో గుడిలో జరగాల్సిన పూజ ఈ గుడిలో జరుగుతుందేంటని విహారి చూడకుండా పారిపోతుంది. పూజలో వేయాల్సిన హోమ ద్రవ్యాల్ని పంతులు విహారికి ఇస్తే విహారి మొదటగా తల్లికే టచ్ చేయమని అంటాడు. కాదాంబరి వద్దు అన్నట్లు యమునకు సైగ చేస్తుంది. యమున భయపడుతుంది. కానీ విహారి మళ్లీ చెప్పడంతో యమున ముట్టుకుంటుంది. పద్మాక్షి రగిలిపోతుంది.
పెద్దాయన భక్తవత్సలం లక్ష్మీ గురించి అడుగుతారు. దాంతో యమున ఉదయం ఇద్దరం కలిసి వచ్చాం అని ఇక్కడే ఎక్కడో ఉంటుందని అంటుంది. ఇక పంతులు తులాభారం కార్యక్రమాన్ని చేయమని అంటారు. అందరూ అక్కడికి చేరుకుంటారు. తులాభారం కార్యక్రమం మొదలవుతుంది. కనకం దూరం నుంచి చూస్తూ సంతోష పడుతుంది. అంబిక విహారి మీద పగ తీర్చుకోవడానికి తులాభారం చేయాల్సిన బెల్లం దగ్గరకు వెళ్లి కొంత బెల్లం దాచేస్తుంది. పండు లక్ష్మీని చూసి తులాభారం దగ్గరకు వెళ్లమని అంటాడు. ఇక పూజ దగ్గరకు రమ్మంటే లక్ష్మీ రాను అంటుంది దాంతో పండు ఓ తులసి మాలను లక్ష్మీకి ఇచ్చి దేవుడికి వేయమని అంటాడు.
విహారి తులాభారంలో కూర్చొవడం లక్ష్మీ కృష్ణుడికి తులసి దండ వేయడం ఒకేసారి జరుగుతుంది. లక్ష్మీ కృష్ణుడిని చూసి విహారిని చూసి చాలా సంతోషిస్తుంది. కృష్ణుడికి వేసిన ఓ పూల దండ నుంచి ఓ తులసీదళం పడుతుంది. దాన్ని తీసుకొని దండం పెడుతుంది. భక్తవత్సలం గారికి తులాభారం వేయమని అంటే సహస్ర తాను చేస్తానని అంటుంది. తులాభారం అంత ఈజీ కాదని బరువతో పాటు భక్తి కూడా ముఖ్యమని పెద్దాయన చెప్తారు. సహస్రకి తల్లి సపోర్ట్ చేయడంతో సహస్ర బెల్లం పెడుతుంది. ఎంత పెడుతున్నా విహారి పైకి లేవదు దీంతో అందరూ టెన్షన్ పడతారు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సొగసరి అత్తల్ని తన షాప్‌లో బట్టలమ్మేలా ప్లాన్ చేసిన గడసరి కోడలు!