Kalavari Kodalu Kanaka Mahalakshmi Today October 12th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీనే విహారి భార్య అని తెలుసుకున్న పండు.. నిశ్చితార్థం ఆపేస్తాడా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode పేపర్‌లో కనకం, విహారిల ఫోటో చూసిన పండు పెళ్లి గురించి కనకాన్ని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Kalavari Kodalu Kanaka Mahalakshmi Today October 12th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీనే విహారి భార్య అని తెలుసుకున్న పండు.. నిశ్చితార్థం ఆపేస్తాడా? kalavari kodalu kanaka mahalakshmi serial today october 12th episode written update in telugu Kalavari Kodalu Kanaka Mahalakshmi Today October 12th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీనే విహారి భార్య అని తెలుసుకున్న పండు.. నిశ్చితార్థం ఆపేస్తాడా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/12/5394bf7e9190e4726ea6083578f287721728694758845882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్రతో ఆమె తల్లిదండ్రులు పూజ చేయిస్తారు. యమునకు అంబిక మత్తు మందు ఇవ్వడంతో యమున కళ్లు తిరుగు తుంటాయి. యమునకు పంతులు అక్షింతలు కలిపి తీసుకురమ్మని చెప్పడంతో యమున లక్ష్మీని పిలుస్తుంది. లక్ష్మీ కంగారు పడుతుంది. వంట గది నుంచి బయటకు రాకూడదని అనుకుంటుంది. విహారి చూసేస్తాడేమో అని టెన్షన్‌తో మెల్లగా వచ్చేసరికి సహస్ర మాత్రమే మండపంలో ఉండటంతో అక్కడికి వెళ్తుంది. యమున లక్ష్మీకి అక్షింతలు తీసుకురమ్మని చెప్తుంది.
మరోవైపు విహారి చేతి కంకణం పడిపోయింటుంది అది లక్ష్మీకి దొరుకుతుంది. ఇక లక్ష్మీ ఎలా అయినా దాన్ని విహారికి ఇవ్వాలని అనుకుంటుంది. పండు కోసం వెతుకుతుంది. పండు లేకపోవడంతో తానే తీసుకొని వెళ్తుంది. గదిలో విహారి కనకం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో లక్ష్మీ విహారి గదికి బయట నుంచే కంకణం విహారికి అందిస్తుంది. విహారి లక్ష్మీ చేయి స్పర్శని గుర్తు పడతాడు. ఇంతలో ఫ్రెండ్ పిలవడంతో వెళ్లిపోతాడు. విహారికి తన ఫ్రెండ్ కంకణం కడతాడు. లక్ష్మీ కూడా విహారి చేతి స్పర్శకి ఎమోషనల్ అవుతుంది. మరోవైపు పంతులు సహస్రకి బట్టలు మార్చుకొని రమ్మని చెప్తారు.
పద్మాక్షి: అంబిక నువ్వు కలిపిన మందులో తేడా ఏమైనా ఉందా లేక ఆ యమున స్ట్రాంగ్‌గా ఉందా. లేక పోతే ఈ పాటికి ఏదో చాటు పడుండాల్సిన ఆమె ఇంత కులాషాగా ఎలా ఉంటుంది. నువ్వు యమునకు కలిపినవి కరెక్ట్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్‌నా.
అంబిక: కరెక్ట్‌గానే కలిపా అక్క ఏమైందో అర్థం కావడం లేదు. మరోవైపు యమునకు కళ్లు తిరిగితే నీళ్లు అడిగి తాగుతుంది.
యమున: నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్లు నా బాధ ఒక్కసారి పోయింది. నువ్వు (పద్మాక్షిని చూసి ) తిరిగి ఇంటికి రావడం వల్ల ఏం గొడవ జరుగుతుందో అనుకున్నా కానీ అంతా బాగుంది.
యమున విహారి దగ్గరకు వెళ్లి తన భర్త డ్రస్‌లో కొడుకుని చూసి మీ నాన్నని చూసినట్లే ఉందని అని ఎమోషనల్ అవుతుంది. కొడుకుని తీసుకొని యమున వస్తుంది. ఇక సహస్ర అందంగా రెడీ అయితే తనని తన ఫ్రెండ్స్ తీసుకొని వస్తారు. ఇద్దరిని ఒక్క దగ్గర కూర్చొపెడతారు. ఇక పంతులు ఉంగరాలు అడుగుతారు. యమున గదిలో ఉంగరాలు ఉన్నాయని తీసుకురమ్మని లక్ష్మీతో చెప్తుంది. పండు కూడా లక్ష్మీ దగ్గరే ఉంటాడు. పండు లక్ష్మీని అక్కడికి ఎందుకు రావడం లేదని అడుగుతాడు. ఏదో ఉందని అనుమానిస్తాడు. ఇక ఇద్దరూ ఉంగరాల కోసం వెళ్తుండగా పేపర్లు ఎగిరిపోవడంతో పండు అక్కడికి వెళ్లిపోతాడు. పేపర్లు సర్దుతూ ఉంటాడు పండు అందులో కనకం, విహారిల పెళ్లి యాడ్ ఉంటుంది.
అనుకోకుండా పండు ఆ పేర్లలో కనకం విహారిల పెళ్లి యాడ్ చూసేస్తాడు. విహారి భార్య లక్ష్మీ అని షాక్ అయిపోతాడు. ఇంతలో లక్ష్మీ ఉంగరాలు తీసుకొని అటుగా వస్తుంది. పండుని పిలుస్తుంది. ఉంగరాలు తీసుకొని వెళ్దామా అంటే పండు లక్ష్మీకి పేపర్లో యాడ్ చూపిస్తాడు. లక్ష్మీ షాక్ అయిపోతుంది. ఈ ఫొటో వెనక ఓ పెద్ద కథ ఉందని నీ ఒంటరి జీవితం వెనక ఎంతో పెద్ద కథ ఉందని ఏంటి ఎందుకు ఎప్పుడు ఎలా నాకు ఏం అర్థం కావడం లేదు లక్ష్మమ్మ అని అడుగుతాడు. విహారి బాబు నీకు ఏం అవుతాడు అని పండు అంటే నా భర్త అని అంటుంది కనకం పండు షాక్ అయిపోతాడు. లక్ష్మీ తన పెళ్లి కథ మొత్తం పండుకి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)